By: ABP Desam | Updated at : 05 Sep 2021 12:23 PM (IST)
Edited By: Shankard
ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు
కొందరు సేవింగ్స్ ఖాతాలో పొదుపు చేస్తే.. మరికొందరు చిట్టీలు కడుతుంటారు. అయితే గ్యారంటీగా రిటర్న్స్ ఆశించే వారు కొన్ని బ్యాంకులలో ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) చేయాలని భావించి సేవింగ్స్ చేస్తారు. సీనియర్ సిటిజన్లతో పాటు ఇతర వయసుల వాళ్లు.. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, పెన్షనర్లు ఎఫ్‌డీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఇందులో తక్కువ రిస్క్ ఉంటుంది.
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకోవడం సరైందే కానీ అందుకు తగిన బ్యాంకు లేదా సంస్థను ఎంచుకోవడంలో పొరపాట్లు జరుగుతుంటాయి. ఏ బ్యాంకు అధిక వడ్డీకి ఎఫ్‌డీ ఆఫర్ చేస్తుందో తెలుసుకుని ఇన్వెస్ట్ చేయడం మేలు చేస్తుంది. భారతీయ స్టేట్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ లేదా ఇతర పెద్ద బ్యాంకులు ఎఫ్‌డీ ఆఫర్ చేస్తాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అయితే బ్యాంకు ఖాతాలు లేకున్నా గూగుల్ పే ద్వారా ఎఫ్‌డీ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. పెద్ద బ్యాంకులైన ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐలతో పోల్చితే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అతి ఎక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. ఇందులో 6.75 శాతం నుంచి 7 శాతం వరకు రిటర్న్స్ పొందుతారు.
సుర్యోడే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 3.25 శాతం నుంచి 6.75 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తోంది. అయితే సేవింగ్స్ మెచ్యురిటీ 7 రోజుల నుంచి గరిష్టంగా 10 ఏళ్ల వరకు ఉంటుంది. కొన్ని బ్యాంకులలో ఎఫ్‌డీ వివరాలు మీకు అందిస్తున్నాం..
నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఎఫ్‌డీ రేట్లు..
నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు తన ఖాతాదారులకు 3 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ అందిస్తుంది. ఎఫ్‌డీ మెచ్యురిటీ కనిష్టంగా 7 రోజుల నుంచి గరిష్టంగా 10 ఏళ్ల వరకు ఉంటుంది.
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్‌డీ రేట్లు..
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు 2.5 శాతం నుంచి 6.75 శాతం వరకు వడ్డీని అందిస్తున్నాయి. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 3 నుంచి 6.75 శాతం వరకు వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది.
Also Read: EPFO New Rules: ఈపీఎఫ్ఓ కొత్త రూల్ గురించి తెలుసా? అలా చేయకపోతే ఆ డబ్బులు హాంఫట్!
భారతీయ స్టేట్ బ్యాంకులో ఎఫ్‌డీ రేట్లు..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ కస్టమర్లకు 2.9 శాతం నుంచి 5.4 శాతం వరకు వడ్డీని అందిస్తుంది. అయితే ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ మెచ్యురిటీ గడువు కనిష్టంగా 7 రోజులుండగా.. గరిష్ట కాల వ్యవధి 10 సంవత్సరాలు.
ఐసీఐసీఐ బ్యాంక్..
ఐసీఐసీఐ బ్యాంకు సైతం తక్కువగా వడ్డీ ఆఫర్ చేస్తోంది. 7 నుంచి గరిష్టంగా 10 ఏళ్ల మెచ్యురిటీ ఉండే ఎఫ్‌డీలపై వడ్డీ 2.5 శాతం నుంచి 5.50 శాతం వరకు ఇస్తుంది.
హెచ్‌డీఎఫ్‌సీ ఎఫ్‌డీ రేట్లు..
మరో అతిపెద్ద బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు 2.50 శాతం నుంచి 5.50 శాతం వరకు వడ్డీని అందిస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ మెచ్యురిటీ కనిష్ట గడువు 7 రోజులు కాగా, గరిష్టంగా 10 ఏళ్ల వరకు ఉంటుంది.
Also Read: Royal Enfield Classic 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 వచ్చేసింది.. బుల్లెట్ బండి ధర ఎంతంటే?
Year Ender 2025: ఈ ఏడాదిలో RBI ఎప్పుడెప్పుడు రెపో రేటు తగ్గించింది? ప్రజలకు ఎలా ఉపశమనం కలిగించింది?
SIP Benefits : కేవలం రూ. 2000 SIPతో 5 కోట్ల రూపాయల భారీ కార్పస్‌ను ఎలా తయారు చేయాలి? ఏ ఫండ్ మంచి రాబడి ఇస్తోంది?
Post Office RD Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకు రూ.333 ఆదా చేస్తే మీరే లక్షాధికారి!
Lost Phone Tracking:ఫోన్ పోగొట్టుకున్నా లేదా చోరీ అయినా ఈ విధంగా ట్రాక్ చేయండి! మొత్తం ప్రక్రియ తెలుసుకోండి!
EPFO Update: మీ PF ఖాతాలో వడ్డీ డబ్బులు జమ అయ్యాయా? ఇంట్లో కూర్చుని ఇలా చెక్ చేసుకోండి!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!