Google Pay FD: గూగుల్ పే సరికొత్త సౌకర్యం.. బ్యాంక్ అకౌంట్ లేకున్నా 2 నిమిషాల్లో ఎఫ్‌డీ.. ఎలాగో తెలుసా
గూగుల్ పే తన వినియోగదారులకు సరికొత్త అవకాశాన్ని కల్పించింది. ఎలాంటి బ్యాంకు ఖాతాలు తెరవకుండానే ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
పేమెంట్ యాప్‌లలో ఒకటైన గూగుల్ పే తన వినియోగదారులకు సరికొత్త అవకాశాన్ని కల్పించింది. ఎలాంటి బ్యాంకు ఖాతాలు తెరవకుండానే ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు గూగుల్ పే యూజర్లకు ఎఫ్‌డీ ఆఫర్ చేస్తున్నాయి. ఇక్విటాస్ బ్యాంక్ ఫైన్ టెక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సాయంతో యూజర్లకు ఈ సౌలభ్యాన్ని కల్పిస్తోంది.
ఎలాంటి బ్యాంక్ ఖాతాలు తెరవకుండానే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం అనేది మంచి విషయమే. ఇందులో అధిక వడ్డీ రేట్లను ఖాతాదారులు పొందవచ్చు. ఇక్విటాస్ బ్యాంక్ .. గూగుల్ పే ద్వారా ఎప్‌డీలు క్రియేట్ చేయనుంది. ఇందులో ఏడాదికిగానూ 6.35 శాతం వడ్డీ రిటర్న్ పొందవచ్చునని స్పష్టం చేసింది. ఇతర సేవింగ్స్ విధానాలతో పోల్చితే ఇది చాలా ఎక్కువ.
Also Read: Gold-Silver Price: దిగొచ్చిన పసిడి ధర.. వెండి కూడా అదే దారిలో.. గ్రాముకు ఎంత తగ్గిదంటే..
ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఇక్విటాస్ ప్రతి డిపాజిటర్‌కు గరిష్టంగా రూ.5 లక్షల మేర గ్యారంటీ ఇస్తుంది. మీరు బ్యాంకుకు వెళ్లకుండా ఇంటి వద్ద నుంచే గూగుల్ పే యాప్ ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే వినియోగదారులు కేవైసీ పూర్తి చేసిన వారికి ఈ సౌకర్యం అందుబాటులో ఉండనుంది. ఇందులో ఎఫ్‌డీ చేసిన మొత్తం మెచ్యూరిటీ గడువు ముగిసిన తరువాత గూగుల్ పే లో లింక్ అయిన మీ బ్యాంకు ఖాతాకు నగుదు జమ చేయనున్నామని ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు.
- 2 నిమిషాల్లో ఎఫ్‌డీని బుక్ చేసుకునే విధానం..
- మొదట మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ పే యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని వివరాలు నమోదు చేసుకోవాలి.
- గూగుల్ పే యాప్ ఓపెన్ చేశాక.. కిందకి స్క్రోల్ చేస్తే బిజినెస్ అండ్ బిల్స్ ఆప్షన్ కనిపిస్తుంది.
- అందులో ఇక్విటాస్ బ్యాంక్ స్పాట్ కోసం ఇక్విటాస్ ఎస్‌ఎఫ్‌బీ లోగో/సెర్చ్ ఫర్ ఇక్విటాస్ మీద క్లిక్ చేయాలి.
- పాన్ నెంబర్ మరియు ఆధార్ నెంబర్ లాంటి కేవైసీ వివరాలు ఇక్విటాస్ బ్యాంకుకు నమోదు చేయాలి.
- గూగుల్ పే యూపీఐ ద్వారా పేమెంట్ పూర్తి చేయాలి.
Also Read: EPFO New Rules: ఈపీఎఫ్ఓ కొత్త రూల్ గురించి తెలుసా? అలా చేయకపోతే ఆ డబ్బులు హాంఫట్!
గూగుల్ పే ద్వారా ఎఫ్‌డీ ఇవ్వడం అనేది తొలిసారి అని, అందులోనూ డిజిటల్ గా జరిగే ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ ద్వారా మీరు అధిక వడ్డీ రేట్లు పొందుతారని వెల్లడించింది. ఇక్విటాస్ బ్యాంక్ గూగుల్ పేతో కలిసి సంయుక్తంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది.
ఒకవేళ మీకు ఏదైనా నగదు అవసరం వచ్చి మీరు ముందుగానే ఎఫ్‌డీ నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. ప్రీమెచ్యూర్‌గా విత్ డ్రా చేసిన రోజే బ్యాంకు ఖాతాకు నగదు జమ అవుతుందని ఇక్విటాస్ బ్యాంకు స్పష్టం చేసింది.