News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Gold-Silver Price: దిగొచ్చిన పసిడి ధర.. వెండి కూడా అదే దారిలో.. గ్రాముకు ఎంత తగ్గిదంటే..

హైదరాబాద్‌ మార్కెట్‌లో బంగారం ధర గ్రాముకు రూ.10 మేర తగ్గింది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99) ధర ప్రస్తుతం రూ.48,230 గా ఉంది.

FOLLOW US: 
Share:

భారత్‌లో బంగారం, వెండి ధరలు ఈ రోజు (సెప్టెంబరు 3) స్వల్పంగా తగ్గాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ భారత మార్కెట్‌లో రూ.46,280 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర తాజాగా రూ.47,280 గా ఉంది. మొత్తానికి గత 10 రోజుల ధరలతో పోలిస్తే పసిడి కాస్త ధర పెరిగింది.

భారత మార్కెట్‌లో బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టగా.. వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. గ్రామునకు రూ.0.50 పైసల మేర పెరిగింది. కానీ, హైదరాబాద్ మార్కెట్‌లో మాత్రం వెండి ధర గ్రాముకు రూ.0.30 పైసలు తగ్గింది. తాజాగా భారత మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.63,500గా కొనసాగుతోంది. హైదరాబాద్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర కాస్త ఎక్కువగా రూ.68,400 ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ముఖ్య నగరాల్లో సెప్టెంబరు 3న బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి తాజా ధరలివీ..
హైదరాబాద్‌ మార్కెట్‌లో బంగారం ధర గ్రాముకు రూ.10 మేర తగ్గింది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99) ధర ప్రస్తుతం రూ.48,230 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం (91.6) ధర రూ.44,200 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.68,400 పలికింది.

ఇక విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర సెప్టెంబరు 3న రూ.44,200 కాగా.. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,230గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.68,400గా ఉంది. విశాఖపట్నం పసిడి మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,200 గానే ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,230గా ఉంది. ఇక్కడ కూడా వెండి ధర కిలో హైదరాబాద్ తరహాలోనే రూ.68,400 పలుకుతోంది.

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు సెప్టెంబరు 3న ఇలా ఉన్నాయి. ముంబయిలో ఈరోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,280 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,280గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,510 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,560గా ఉంది.

ప్లాటినం ధరలో స్వల్ప తగ్గుదల
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర హైదరాబాద్‌లో గ్రాము రూ.2,360గా ఉంది. ముందు రోజుతో పోలిస్తే ఈ ధర గ్రాముకు రూ.15 వరకూ పెరిగింది. 10 గ్రాముల ప్లాటినం ధర ఇక్కడ రూ.23,600 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర అదే కొనసాగుతోంది.

వివిధ అంశాలపై పసిడి ధర
బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.

Published at : 03 Sep 2021 06:48 AM (IST) Tags: Gold Price Silver Price Todays gold cost Todays silver price platinum price hyderabad gold silver price vijayawada gold price

ఇవి కూడా చూడండి

LIC New Policy: జీవితాంతం గ్యారెంటీగా ఆదాయాన్ని ఇచ్చే ఎల్‌ఐసీ కొత్త పాలసీ - జీవన్‌ ఉత్సవ్‌

LIC New Policy: జీవితాంతం గ్యారెంటీగా ఆదాయాన్ని ఇచ్చే ఎల్‌ఐసీ కొత్త పాలసీ - జీవన్‌ ఉత్సవ్‌

Cement Sector: ప్రస్తుతం సిమెంట్ రేట్ల పరిస్థితేంటి? - ఇల్లు ఇప్పుడే కట్టాలా, కొంతకాలం ఆగాలా?

Cement Sector: ప్రస్తుతం సిమెంట్ రేట్ల పరిస్థితేంటి? - ఇల్లు ఇప్పుడే కట్టాలా, కొంతకాలం ఆగాలా?

Petrol-Diesel Price 30 November 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

Petrol-Diesel Price 30 November 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

BSE M-cap: స్టాక్‌ మార్కెట్‌లో మరో రికార్డ్‌, BSE వేగానికి కీలక మైలురాయి బలాదూర్‌

BSE M-cap: స్టాక్‌ మార్కెట్‌లో మరో రికార్డ్‌, BSE వేగానికి కీలక మైలురాయి బలాదూర్‌

Stocks To Watch Today 29 November 2023: ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Tata Tech, Gandhar, Fedbank Fin, ICICI Sec

Stocks To Watch Today 29 November 2023: ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Tata Tech, Gandhar, Fedbank Fin, ICICI Sec

టాప్ స్టోరీస్

Telangana Exit Poll Results 2023: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి, ఏంటంటే!

Telangana Exit Poll Results 2023: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి, ఏంటంటే!

Dhootha Web Series Review - దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?

Dhootha Web Series Review - దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?

Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, 70 దాటిన పోలింగ్ శాతం

Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, 70 దాటిన పోలింగ్ శాతం

Vijay Rashmika: ఒకే తరహా డ్రెస్‌లో రష్మిక, విజయ్ దేవరకొండ - దొరికిపోయారుగా!

Vijay Rashmika: ఒకే తరహా డ్రెస్‌లో రష్మిక, విజయ్ దేవరకొండ - దొరికిపోయారుగా!