Mobile Phone Safety: ఈ లక్షణాలు మీ మొబైల్ ఫోన్‌లో కనిపిస్తే వైరస్ ప్రవేశించిందని అర్ధం, బీ అలెర్ట్!
Malware Signs Mobile Phone: ఫోన్‌లోకి వైరస్ ప్రవేశిస్తే కొన్ని సంకేతాలు కనిపించడం ప్రారంభిస్తాయి. ఫోన్ త్వరగా వేడెక్కడం, బ్యాటరీ వేగంగా డిశ్చార్జ్ కావడం, ఫోన్ పనితీరు స్లో కావడం వంటివి జరుగుతుంటాయి.

Mobile Phone Safety Tips: ఈ రోజుల్లో మొబైల్ ఫోన్, ముఖ్యంగా ఇంటర్నెట్‌తో కూడిన మొబైల్ ఫోన్ లేనిదే ప్రజలకు రోజు గడవదు. ఉద్యోగం లేదా వ్యాపారం నుంచి కాలక్షేపం వరకు, స్మార్ట్ ఫోన్ ద్వారా ప్రతి అవసరం తీరుతోంది. పర్సనల్ డిటైల్స్ నుంచి సినిమా టిక్కెట్ల వరకు అన్నీ మొబైల్ ఫోన్‌లో నిక్షిప్తమై ఉంటాయి. డిజిటల్ లావాదేవీల కోసం మొబైల్ ఫోన్లను విరివిగా వినియోగిస్తున్నారు. కాబట్టి, హ్యాకర్ల దృష్టి కూడా మొబైల్ ఫోన్లపై ఉంది. వాళ్లు, మాల్‌వేర్ లేదా వైరస్ ద్వారా మీ మొబైల్ ఫోన్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మాల్‌వేర్ ఫోన్‌లోకి ప్రవేశిస్తే చాలా నష్టం కలిగిస్తుంది.
మొబైల్ ఫోన్‌లోకి వైరస్ ప్రవేశిస్తే ఎలా గుర్తించాలి? (How to detect if a virus has entered a mobile phone?)
పాప్-అప్ ప్రకటనలు
ఫోన్‌లో పాప్-అప్ ప్రకటనలు నిరంతరం కనిపిస్తూ ఉంటే & వాటిని స్క్రీన్ నుండి తీసివేయడం కష్టంగా ఉంటే, అది మాల్‌వేర్ వల్ల కావచ్చు. ఆ ప్రకటనలపై క్లిక్ చేస్తే మీ ఫోన్‌లో ఉన్న వ్యక్తిగత సమాచారం తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.
ఎలాంటి కారణం లేకుండా బిల్లు పెరగడం
అదనపు సర్వీస్ తీసుకోకుండానే మీ ఫోన్ బిల్లు పెరిగితే మీరు అప్రమత్తంగా ఉండాలి. చాలా సార్లు క్రామింగ్ (cramming) వల్ల బిల్లు పెరుగుతుంది. క్రామింగ్ అంటే మీరు ఉపయోగించని సేవ కోసం థర్డ్ పార్టీ కంపెనీ మీకు ఛార్జ్ విధించడం. మాల్‌వేర్ ద్వారా ఈ పని చేయవచ్చు.
మరో ఆసక్తికర కథనం: ఒక్క ఆర్డర్ లోనే 250 పిజ్జాలు - సింగిల్ మీల్ ఆర్డర్ పై రూ.5 లక్షలు - స్విగ్గీ, జొమాటోలో 2024లో రికార్డ్ ఆర్డర్స్
బ్యాటరీ ఛార్జింగ్ వేగంగా తగ్గిపోవడం
మాల్‌వేర్ సంకేతాల్లో బ్యాటరీ వేగంగా డిఛార్జ్ కావడం ఒకటి. మీ ఫోన్‌లో మాల్‌వేర్ ప్రవేశిస్తే, అది బ్యాక్‌గ్రౌండ్‌లో వివిధ రకాల పనులు చేస్తూనే ఉంటుంది. దీనివల్ల మీ ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా ఐపోతుంది. అంతేకాదు, సాధారణ పరిస్థితుల్లో కూడా ఫోన్ చాలా వేడిగా ఉంటే అది మాల్‌వేర్ వల్ల కావచ్చు.
ఫోన్ వేగం నెమ్మదించడం
మొబైల్ ఫోన్‌లో మాల్‌వేర్ ఉంటే ఫోన్ వర్కింగ్ స్పీడ్ తగ్గుతుంది. వాస్తవానికి, మాల్‌వేర్ మీ ఫోన్ భాగాలను పని చేయిస్తూనే ఉంటుంది. కాబట్టి, ఫోన్‌లో మీరు నిర్వహించాల్సిన ఇతర పనుల వేగం తగ్గుతుంది. కొన్నిసార్లు ఆ పనులు క్రాష్ అవుతాయి.
ఫోన్‌లో అనవసర యాప్‌లు
కొన్నిసార్లు, మీరు ఒక యాప్‌ను డౌన్‌లోడ్ చేస్తున్నప్పుడు, దానితో పాటు మీకు తెలీకుండానే మాల్‌వేర్ కూడా డౌన్‌లోడ్ అవుతుంది. ఇది ఫోన్‌లో అదనపు యాప్‌లను ఇన్‌స్టాల్ చేస్తుంది. అందువల్ల, యాప్ లిస్ట్‌పై నిఘా ఉంచండి & ఏదైనా అవాంఛిత యాప్ ఇన్‌స్టాల్ అయినట్లు మీరు గుర్తిస్తే దానిని తెరవవద్దు & వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయండి.
మరో ఆసక్తికర కథనం: ఆన్‌లైన్ షాపింగ్‌పై బంపర్ డిస్కౌంట్ - ఈ క్రెడిట్ కార్డ్స్‌తో అద్భుతమైన క్యాష్‌బ్యాక్స్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

