Royal Enfield Classic 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 వచ్చేసింది.. బుల్లెట్ బండి ధర ఎంతంటే?
రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి క్లాసిక్ 350 మోడల్ మనదేశంలో ఎంట్రీ ఇచ్చింది. దీని ప్రారంభ ధర రూ.1.84లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ప్రకారం) నిర్ణయించారు.
భారత్‌లో అత్యంత పాపులారిటీ సంపాదించుకున్న బైకులలో ఒకటైన రాయల్ ఎన్‌ఫీల్డ్.. తన కొత్త మోడల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. బుల్లెట్ బండెక్కి షికార్లు కొట్టడానికి ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. అందుకు తగ్గట్లుగానే రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా అదిరిపోయే ఫీచర్లతో ఎప్పటికప్పుడు కొత్త బైక్‌లను రిలీజ్ చేస్తుంటుంది. ఇక కొత్తగా లేటెస్ట్ ఫీచర్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి క్లాసిక్ 350 మోడల్ మనదేశంలో ఎంట్రీ ఇచ్చింది. దీని ప్రారంభ ధర రూ.1.84 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ప్రకారం) నిర్ణయించారు. వేరియంట్లను బట్టి చూస్తే దీని టాప్ ఎండ్ ధర రూ.2.15 లక్షల వరకు ఉంటుంది.
As we unveil our all-new motorcycle, you stand a chance to win a secret gift. All you have to do is watch our live launch on 01.09.21, screenshot the motorcycle when it appears and mail it to us at bereborn@royalenfield.com
— Royal Enfield (@royalenfield) August 30, 2021
Visit:https://t.co/2h2rMH3uWD#BeReborn #RoyalEnfield pic.twitter.com/2stCfcEm89
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ధర..
ఈ బైక్ ఐదు వేరియంట్లలో లభిస్తుంది. క్లాసిక్ రెడ్డిచ్, క్లాసిక్ హాల్కోన్, క్లాసిక్ సిగ్నల్స్, క్లాసిక్ డార్క్, క్లాసిక్ క్రోమ్ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఎక్స్ షోరూం చెన్నై ప్రకారం.. క్లాసిక్ రెడ్డిచ్ ధర రూ.1,84,374.. క్లాసిక్ హాల్కోన్ ధర రూ.1,93,123.. క్లాసిక్ సిగ్నల్స్ ధర రూ.2,04,367.. క్లాసిక్ డార్క్ ధర రూ.2,11,465.. క్లాసిక్ క్రోమ్ ధర రూ.2,15,118గా ఉంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 స్పెసిఫికేషన్లు..
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350లో 349 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 6,100 ఆర్పీఎం వద్ద 20.2 బీహెచ్‌పీ పవర్‌ని రిలీజ్ చేస్తుంది. ఇక 4,000 ఆర్పీఎం వద్ద.. 27ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ గేర్ బాక్స్ ఇందులో ఉండనుంది. ఒక్కో దానికి ఒక్కో రేటు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. బైకు మందు భాగంలో 300 ఎంఎం, వెనుక వైపు 270 ఎంఎం డిస్క్ బ్రేకులను అందించారు. ఇది అలాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్స్‌తో అందుబాటులోకి వస్తుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ అమ్మకాల్లో క్లాసిక్ 350 మోడల్‌దే అత్యధిక భాగం ఉంటుంది. మొత్తం కంపెనీ అమ్మే కార్లలో దాదాపు 80 శాతం ఇవే ఉంటాయి. మెటియోర్ 350 తర్వాత దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన రెండో బైక్ ఇదే కావడం విశేషం.