News
News
X

GIS 2023 Vizag: ఏపీ ప్రభుత్వ పనితీరుపై పారిశ్రామికవేత్తల ప్రశంసలు- 15వేల కోట్ల పెట్టుబడికి శ్రీ సిమెంట్‌, జిందాల్ స్టీల్‌ గ్రీన్ సిగ్నల్

GIS 2023 Vizag: విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ప్రారంభ కార్యక్రమంలో అంబానీ సహా పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొన్నారు. ఇందులో దేశ, విదేశా పెట్టుబడుదారులు ఉన్నారు.

FOLLOW US: 
Share:

 GIS 2023 Vizag: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ 2023లో దేశవిదేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక పాలసీ, చేపట్టే కార్యక్రమాలపై ప్రశంసలు కురిపించారు. పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారు. 

విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ప్రారంభ కార్యక్రమంలో అంబానీ సహా పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొన్నారు. ఇందులో దేశ, విదేశా పెట్టుబడుదారులు ఉన్నారు. ఏపీలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు తాము సుముఖంగా ఉన్నట్టు ప్రకటించడంతోపాటు ఏపీలో నిర్భయంగా పెట్టుబడులు పెట్టొచ్చని సలహా ఇచ్చారు. 

ఏపీలో నైపుణ్యమైన వనరులు ఉన్నాయన్నారు శ్రీసిమెంట్‌ ఛైర్మన్‌ హరిమోహన్. జగన్ నాయకత్వంలో ఏపీ పరిశ్రమల హబ్‌గా మారిందన్నారు. కర్బన రహిత వాతావరణం కోసం ఏపీ కృషి ప్రశంసనీయమని కొనియాడారు. ఏపీ పారిశ్రామీకరణలో శ్రీసిమెంట్ తన పాత్ర పోషిస్తుందని హామీ ఇచ్చారు. ఐదు వేల కోట్లతో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. దీని ద్వారా ఐదు వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపింది. 

ఆరోగ్య రంగంలో ఏపీ సర్కారు కృషిని పొగిడారు అపోలో హాస్పిటల్స్ వైస్‌ ఛైర్‌పర్శన్ ప్రీతారెడ్డి. ఏపీ సర్కార్‌తో అపోలో భాగస్వామిగా ఉండటం ఆనందంగా ఉందన్నారు. ఆరోగ్య శ్రీ పథకం ఆవిష్కర్త వైఎస్‌ కృషిని ఈ వేదికపై గుర్తు చేశారు ప్రీతారెడ్డి. నాఫ్‌ సీఈవో సుమ్మిత్‌ బిదానీ మాట్లాడుతూ.. పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందన్నారు. ఏపీలో రోడ్‌ కనెక్టివిటీ, విద్యుత్ సౌకర్యాలు బాగున్నాయన్నారు. ఇన్వెస్టర్స్‌ సదస్సు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. 

ఏపీలో పదివేల కోట్ల పెట్టుబడులకు జిందాల్ స్టీల్స్‌ ముందుకు వచ్చింది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో మాట్లాడిన నవీన్ జిందాల్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పటికే కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి ఈ మధ్యే ఈ సంస్థ శంకుస్థాపన కూడా చేసింది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు టెస్లా కో ఫౌండర్‌ మార్టిన్ ఎబర్‌ హార్డ్‌. గ్రీన్ ఎనర్జీ పట్ల ఏపీ ఆసక్తి చూపడం అభినందనీయమన్నారు. సుస్థిర అభివృద్ధి ప్రపంచానికి చాలా అవసరమని తెలిపారు. 

2002లో కార్ల తయారీ కంపెనీ చాలా క్రేజీగా ప్రారంభమైంది. అసలు ఇలాంటి ఆలోచనతో ఆటోమొబైల్‌ కంపెనీ పెట్టాలనే ఆలోచన ఎవరూ చేయరేమో. అంతా కొత్తవారితా మేం స్టార్ట్ చేశాం అందులో ఒక్కరికి కూడా ఎలక్ట్రిక్ కార్ల తయారీలో అనుభవం లేదు. అయినా ప్రారంభించాం. మొత్తం బాధ్యత తీసుకున్నాం. ఇప్పుడు ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మాట్లాడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా వాటికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలో మేం చాలా సమస్యలు ఎదుర్కొన్నాం.. వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించుకొని మీ ముందు నిలబడ్డాం. నాకు ఏపీలో ఉన్న స్టార్టప్‌ల గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంది. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తులు గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. - మార్టిన్ ఎబర్‌హార్డ్, టెస్లా సహ వ్యవస్థాపకుడు & మాజీ CEO 

ఏపీలో చాలా రంగాల్లో వెంటవెంటనే అనుమతులు వస్తున్నాయని...ఇది పారిశ్రామికవేత్తలకు చాలా ఆనందదాయమన్నారు టోరే ఇండస్ట్రీస్‌ ఎండీ మసహిరో యమగూచి. రాష్ట్ర అభివృద్ధిలో కియా పాత్ర చాలా కీలక పాత్ర పోషించిందన్నారు కియా ఇండియా ప్రతినిధి కబ్‌డోంగ్‌లి. ప్రభుత్వ సహకారాలు కియా అబివృద్ధికి దోహదపడిందన్నారు. ఏపీలో కియా కార్యకలాపాలు సులువుగా సాగిందన్నారు. 

Published at : 03 Mar 2023 12:24 PM (IST) Tags: Tesla AP News Bharat Biotech Visakha News krishna ella CM Jagan Naveen Jindal Global investors summit 2023 Global investors summit First Day Global investors Summit in Visakha AP Updates Martin Eberhard Jindal Steel and Power Ltd.

సంబంధిత కథనాలు

అచ్చెన్న ఫ్లెక్సీలపై దువ్వాడ పోస్టర్లు -మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు

అచ్చెన్న ఫ్లెక్సీలపై దువ్వాడ పోస్టర్లు -మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు

పలాసలో భూవివాదాలపై మంత్రి భూ దర్బార్‌- కబ్జాలు నిరూపిస్తే రాజకీయల నుంచి తప్పుకుంటానంటూ ప్రకటన

పలాసలో భూవివాదాలపై మంత్రి భూ దర్బార్‌- కబ్జాలు నిరూపిస్తే రాజకీయల నుంచి తప్పుకుంటానంటూ ప్రకటన

Chandrababu: నేను కట్టిన హైటెక్ సిటీని YSR కూల్చింటే అభివృద్ది జరిగేదా?: చంద్రబాబు

Chandrababu: నేను కట్టిన హైటెక్ సిటీని YSR కూల్చింటే అభివృద్ది జరిగేదా?: చంద్రబాబు

Chandrababu Speech: పసుపు ఎక్కడ ఉంటే అక్కడ శుభం - చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది: చంద్రబాబు

Chandrababu Speech: పసుపు ఎక్కడ ఉంటే అక్కడ శుభం - చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది: చంద్రబాబు

Visakhapatnam: చనిపోతామంటూ నిన్న దంపతుల సెల్ఫీ వీడియో - నేడు మృతదేహాలు లభ్యం

Visakhapatnam: చనిపోతామంటూ నిన్న దంపతుల సెల్ఫీ వీడియో - నేడు మృతదేహాలు లభ్యం

టాప్ స్టోరీస్

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు