అన్వేషించండి

Dandari Festival Photos: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల దండారి వేడుకలపై స్పెషల్ స్టోరీ

Adilabad News | దీపావళి సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దండారీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అందరికన్నా భిన్నంగా అడవి బిడ్డల సంస్కృతి, సాంప్రదాయాలు ఉంటాయి.

Dandari Festival | ఆదివాసీ గ్రామాల్లో డప్పుల చప్పుల్లు... తుడుం మోతలు... పర్ర, వెట్టే, ఘుమ్మేళ, వాయిద్యాల నడుమ పాటలు పాడుతూ చచ్చోయ్ కోలాట నృత్యాలు.. తలపై నెమలి పించాల టోపీ.. భుజానికి జంతువుల చర్మం.. మెడలో అడవుల్లో లభించే వనమూలికల హారాలు.. చేతిలో గంగారాం సోటా.. శరీరానికి విభూది రాసుకుని గుస్సాడి వేషధారణ.. దీపావళి సందర్భంగా 8 రోజులపాటు దండారి వేడుకలు... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు నిర్వహించే దండారి వేడుకలపై abp దేశం ప్రత్యేక కథనం. 

భిన్నంగా సంస్కృతి, సాంప్రదాయాలు 
ఆదివాసుల జిల్లాగా పేరిందిన ఈ ఆదిలాబాద్ జిల్లాలో అడవి బిడ్డల సంస్కృతి, సాంప్రదాయాలు అందరికన్నా భిన్నంగా ఉంటాయి. ప్రతి ఏటా దీపావళి సందర్భంగా గ్రామాల్లో దండారి ఉత్సవాలను వైభవంగా జరుపుకుంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దీపావళికి ముందుగా 8 రోజుల ముందు అన్ని గోండు, కొలాం గూడాల్లో దండారీ వేడుకల సందర్భంగా తమ తమ గ్రామ పటెల్ ఇంటి ఆవరణలో దండారీ వేదిలకను రంగు రంగుల విద్యుత్ కాంతుల మద్య అందంగా అలంకరణలు చేసి ముస్తాబు చేస్తారు. అకాడి అంటే జూన్ మాసంలో వన దేవతల పూజలు చేసినప్పటి నుండి అకాడి దేవతను కొలుస్తు నాలుగు నెలల పాటు దీపావళి వరకు ఈ పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.


Dandari Festival Photos: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల దండారి వేడుకలపై స్పెషల్ స్టోరీ

దీపావళికి ముందుగా అందరు మంచిర్యాల జిల్లాలోని గుడిరేవు వద్దనున్న తమ ఆది దైవమైన పద్మల్ పురి కాకోబాబాయి దేవతను దర్శించుకొని గోదావరి స్నానాలు ఆచరించి అక్కడ నుండి సాంప్రదాయ దండారీ వేడుకలను ప్రారంభిస్తారు. అక్కడ నుండి తమ గ్రామాలకు చేరుకొని గ్రామాల్లో తమ ఎత్మసార్ దేవతగా భావించే గుస్సాడి వేషధారణలు వేస్తారు. మొక్కు ఉన్న వాళ్ళు తమ తాతలకాలంగా గుస్సాడి టోపి ఉన్న ప్రతి ఇంటి నుండి ఒకరు ఈ గుస్సాడి వేషధారణ వేస్తారు. నెత్తిపై నెమలిపించాల టోపి, కాళ్ళకు నడుముకు గజ్జలు, మెడలో రుద్రాక్ష మాలలు, ఒళ్ళంతా విభూది, లెదా మసి రాసుకొని భుజానికి ఓ జంతు చర్మం, చేతిలో గంగారాం సోటా (ఓ రోలు కర్ర), అచ్చం శివుడి వలే అవతరాం ఉంటుంది.

8 రోజులపాటు ఈ గుస్సాడి వేషధారణ అంటే ఒక కఠోరమైన దీక్ష లాంటిది. గుస్సాడి వేషధారణ వేసిన వారు 8 రోజులపాటు స్నానం చేయరు. అలాగే ఉంటారు. ఇక తమ గ్రామాల్లో నిర్వహించే దండారీ వేడుకల్లో ఉత్సాహంగా నృత్యాలు చేస్తారు. వారికి తోడుగా చిన్నారులు పరపొరిలుగా చచోయ్ కొలాటాలతో నృత్యాలు చేస్తారు. మహిళలు సాంప్రదాయ రెలా పాటల పాడుతూ నృత్యాలు చేస్తారు. ఈ ఉత్సవాలను ప్రారంభించే ముందు మహిళలు రెలా రెలా పాటలతో స్వాగతం పలుకుతారు. అటు పటెల్ ఇంటి వద్ద యజమాని తమ దైవం వద్ద నుండి దీపం వెలిగించి బయటకు తీసుకొని వచ్చి వారికి దండారీకి స్వాగతమని ఆహ్వానించి తమ సాంప్రదాయ ఆకాడి, ఎత్మాసార్ దేవతల సామాగ్రి గుస్సాడి వేషధారణకు సంబంధించిన వస్తువులను అందిస్తారు. అప్పుడు చిన్నారులు ఈ కొలాటాలతో పాటలు పాడుతు స్వీకరిస్తారు.


Dandari Festival Photos: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల దండారి వేడుకలపై స్పెషల్ స్టోరీ

అనంతరం పర్ర వెట్టే గుమ్మెల అనే సాంప్రదాయ వాయిద్యాలను పెద్దలు సమకూర్చి వాయిస్తారు. ఒక పాట అయ్యాక అందులోనుండి గుస్సాడి వేషధారణ వేసే వారు తమ ఆ గుస్సాడి సామాగ్రి తీసుకొని ఎప్పుడు యధావిధిగా ఉండే దుస్తులను తీసి గుస్సాడి వేషధారణ వేస్తారు. చిన్నారుల్లోను పరపోరిలుగా అంటే ఆడమగ లాగా వేషాదరణ వేస్తారు. ఈ వేషధారణ ఎందుకంటే తమ పూర్వికుల నుండి వస్తున్న సాంప్రదాయం ప్రకారం సృష్టి తయారైందని, పద్మల్ పురి కాకోబాయి దేవత అనుగ్రహం వల్ల, ఎత్మసార్ దేవతను మొదలుకొని లోకం పుట్టినట్లు భావిస్తు వేషధారణ వేస్తారు. 

Also Read: TGSRTC Special Buses: కురుమూర్తి జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, టికెట్ బుకింగ్స్ ఇలా

మొదటగా భోగి అనే కార్యక్రమం

దీపావళి పండుగ అంటె దేశవ్యాప్తంగా అందరు ఎవరిళ్ళలో వారు లక్ష్మి పూజలు చేసుకొని సంబరాలు జరుపుకుంటుంటే ఆదివాసీలు మాత్రం తమ గ్రామమంతా కలిసి ఒకేచోటా ఉత్సాహంగా దండారీ వేడుకలను జరుకుంటారు ఇది వారి ప్రత్యేకతా.. దండారీ వేడుకల్లో మొదటగా భోగి అనే కార్యక్రమం నిర్వహిస్తారు. అప్పటి నుండి మిగతా అన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దండారీ ప్రాంగణంలో అడుగుపెట్టి పర్ర, వెట్టే, గుమ్మెల అనే వాయిద్యాలు వాయిస్తు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. ఆదివాసీల్లో సోలడెమ్సా అట్రవాజ అనే రకాల వాయిద్యాలు ఉన్నాయి. ఇందులో ఏ సమయంలో ఏ వాయిద్యం వాయిస్తే ఆ రకంగా ఆదివాసీలు నడుస్తారు. దండారీ వాయిద్యం అందరికన్న భిన్నంగా ఉంటుంది. ఒకేసారి అన్ని డప్పులతో ఓక తుడుం మాత్రమే వాయిస్తు 15 నిమిషాల పాటు వాయిస్తారు. ఇది దండారీ ప్రారంభంలొ మరియు ముగింపు సమయంలో ప్రతిరోజు వాయిస్తారు. అనంతరం మిగతా వాయిద్య క్రమాలు వేరు వేరు రకాలుగా డప్పు వాయిద్యాలు వాయిస్తు దండారీ ప్రాంగణంలో అందరు నృత్యాలు చేస్తు సంబరంగా ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. పర్ర వెట్టే వాయిద్యాలతో చచ్చోయ్ అనే కొలాటమాడుతు సందడి చేస్తారు. ఇందులో పులి వేషధారణ, కోడల్, టప్పల్ వేషధారణలు ఉంటాయి. ఈ నృత్యాలు అందరిని ఆకట్టుకుంటాయి. గుస్సాడిలు నెమలి పించాలటోపిలు ధరించి చేసే నృత్యాలు అందరికన్న వినూత్నంగా ఉంటాయి.


Dandari Festival Photos: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల దండారి వేడుకలపై స్పెషల్ స్టోరీ

గుస్సాడిలను తాదో, లేదా గురు అని కూడా పిలుస్తారు. ఎత్మాసార్ దేవతను ఆదివాసీలు తమ పవిత్ర దైవంగా కొలుస్తారు. కోరిన కోరికలు, మొక్కులు చెల్లిస్తే ఖచ్చితంగా నెరవేరుతాయన్న గట్టి నమ్మకం ఆదివాసీల్లో ఉంది. ఎవరికైనా సంతానం కలగకుంటే ఎత్మాసార్ దేవతకు మొక్కితే ఖచ్చితంగా సంతాన భాగ్యం లభిస్తుందని, తమ పాడి పంటలు బాగుండాలి, కుటుంబం అందరు సుఖ సంతోషాలతో ఉండాలని, ఏటా దండారి ఉత్సవాలను పురస్కరించుకుని ఎత్మసార్ దేవతకు మొక్కులు చెల్లిస్తారని ఆదివాసీలు చెబుతున్నారు.

దండారీ అనేది ఆదివాసీలకు చాలా పెద్ద పండుగా ఇది వారి పూర్వకాలం నుండి వస్తున్న ఆచారమని, నేటికి ఆదివాసీలు దీపావళి సందర్భంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తమ గ్రామాల్లో దండారీ భోగి పూజలు అయిన వెంటనే ఒక గ్రామం వారు మరో గ్రామానికి అతిథిగా వెళతారు. ఇలా అతిథిగా వెళ్ళడం ఆనవాయితీగా వస్తోంది. అతిథులకు సాదర ఆహ్వనంతో పాటు ఒక రోజు ఇరువురు కలిసి ఆడిపాడి నృత్యాలు చేసి సందడి చేస్తారు. అనంతరం ఒకరికొకరు కలుసుకొని బందుత్వం పెంచుకుంటారు. ఇందులో పెళ్ళిళ్ళ కోసం బందుత్వాలు కూడా జతకడతాయి. నచ్చితే పెళ్ళి మాత్రం వేసవి సమయంలో జరుపుతారు. ఇలా ఒక ఊరు నుండి మరోక ఊరికి వచ్చిన అతిథులు వచ్చే యెడాది వారి వద్దకు అతిథులుగా వస్తుంటారు. ఇలా బందుత్వాలను బలపరిచే ఒక రకమైన వినూత్న ఆచారం ఆదివాసీల్లో ఉందనీ సమాక గ్రామానికీ చెందిన యశ్వంత్ రావ్ మహారాజ్ అన్నారు. తమ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ పవిత్రలకు అంచె దిశగా నేటికీ ఈ వేడుకలను ఎంతో వైభవంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. 

భిన్నమైన శైలిలో కోలాం ఆదివాసుల దండారి వేడుకలు

ఉట్నూర్ మండలంలోని సాలెగూడా గ్రామంలో కోలాం ఆదివాసులు భిన్నమైన శైలిలో దండారి వేడుకలు జరుపుకున్నారు అందరూ చేతిలో కర్రలతో డప్పులు వాయిస్తుంటే... కోలాం ఆదివాసులు తమ సాంప్రదాయ రీతిలో సోలాడేంస, అట్రా వాజలో భాగంగా చేతులతో  వాయిద్యాలు వహిస్తే... పిల్లల గ్రోవి ఊదుతూ పాటలు పాడుతూ సాంప్రదాయ వేడుకలో చిన్నారులు నృత్యాలు చేశారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు దండారి వేడుకల్లో పాల్గొని ఎత్మాసార్ దేవతలకు పూజలు నిర్వహించారు. అనంతరం వారితో కలిసి నృత్యాలు చేశారు. అలాగే ఉట్నూర్ మండలంలోని మత్తడిగూడా గ్రామంలో ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు వారి గ్రామస్తులు దండారిగా వెళ్లి వేడుకలను జరుపుకున్నారు. సాంప్రదాయ వేషధారణలో దోతీ కట్టుకొని ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు, కుటుంబ సభ్యులతో గ్రామస్తులతో కలిసి దండారి వేడుకల్లో పాల్గొన్నారు. గుస్సాడీ తాదో పర పోరీలతో కలిసి కోలాటం ఆడుతూ చచ్చోయ్ నృత్యాలు చేస్తు అందరినీ ఆకట్టుకున్నారు. సాంప్రదాయ వేడుకలను ఘనంగా జరుపుకోవడం ఆనావాయితీగా వస్తోందని తమ సంస్కృతి ఆచారాలను కాపాడుతూ నేటికీ ఆదివాసి గ్రామాల్లో దండారి వేడుకలను జరుపుకోవడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం దండారి వేడుకలకు 10,000 ఇవ్వగా తమ ప్రభుత్వం హయాంలో ఒక్కో దండారికి రూ.15000 ఇవ్వడం జరిగిందన్నారు. 


Dandari Festival Photos: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల దండారి వేడుకలపై స్పెషల్ స్టోరీ

ఇంద్రవెల్లి మండలంలోని సమాకా గ్రామంలో రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, పార్లమెంటరీ ఇంచార్జి ఆత్రం సుగుణక్క దండారీ వేడుకల్లో పాల్గొని నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. మహిళలతో కలిసి ఆత్రం సుగుణక్క రేలారేలా పాటల మధ్య సాంప్రదాయ నృత్యాలు చేశారు. ముందుగా గ్రామస్తులు వారికి డప్పు వాయిద్యాల మధ్య ఘన స్వాగతం పలికారు. సాంప్రదాయ రీతిలో ఒకరినొకరు కలుసుకొని అలింగనం చేసుకున్నారు. ఈ సంధర్భంగా తమ ఆరాధ్య దైవమైన ఏత్మాసార్ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేదిశగా ఆదివాసులంతా ముందుకు నడవాలని, భావితరాలకు అందించే దిశగా ప్రతి ఒక్కరూ ఈ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆదివాసుల అభివృద్ధి కోసం పాటుపడతామన్నారు. 

Also Read: BRS Chief KTR: బీఆర్ఎస్ తదుపరి సుప్రీం కేటీఆరేనా ? మరి హరీశ్ రావు పాత్ర ఏంటి?

ఆదివాసిల చరిత్రపై కొడప జైవంత్ రావ్ అనే కోలాం ఆదివాసి రీసెర్చ్ ప్రారంభించారు. సందర్భంగా తనకు తెలిసిన పూర్వకాలపు చరిత్రను తనదైన శైలిలో ఏబీపీ దేశంతో వివరించారు. పూర్వకాలంలో తమ ఆది దైవం అనుగ్రహం వల్ల ఎత్మాసార్ ను పంపడం జరిగిందని, దానివల్లనే దీపావళి సందర్భంగా చారిత్రాత్మకమైనటువంటి దండారి వేడుకలను "సోలా డెంసా అట్రా వాజ" వాయిద్యాల రీతిలోనూ ఒక్కో సగ,గా మొత్తం నాలుగు సగ,లు ఈ ప్రాంతంలో ఉన్నాయని, గొండు, కోలాం  అనేది వేరు కాదని, ఇద్దరు ఒకటే అని, గొండులు రాజులుగా.. కోలాములు పూజారులుగా ఉండేవారని నేటికీ అలాగే ఆ క్రమంలోనే ఇలా నడుస్తూ ఈ వేడుకలను జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఒక్కో సగవారికి ఒక రకమైన వాయిద్యాలు.. ఇలా విభిన్నమైన శైలిలో వాయిస్తూ దండారి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఇలా ఆదివాసులు తమ ఆచార సాంప్రదాయాలను భావితరాలకు అందించే దిశగా పూర్వకాలం నుండి వస్తున్న ఆచార వ్యవహరాలను నేటికీ పాటిస్తూ తమ సంస్కృతికి జీవం పోస్తున్నారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Champions Trophy Winner India: ఏకైక జట్టుగా భారత్ రికార్డ్, అసాధారణ ఆటతో అద్భుత ఫలితం: భారత జట్టుపై రాష్ట్రపతి, ప్రధాని ప్రశంసలు
ఏకైక జట్టుగా భారత్ రికార్డ్, అసాధారణ ఆటతో అద్భుత ఫలితం: భారత జట్టుపై రాష్ట్రపతి, ప్రధాని ప్రశంసలు
TDP MLC Candidates: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. వారికే అవకాశం ఎందుకంటే ?
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. వారికే అవకాశం ఎందుకంటే ?
Telangana Latest News: ఎమ్మెల్సీగా విజయశాంతి-  అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్- జాబితా ఇదే !
ఎమ్మెల్సీగా విజయశాంతి- అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్- జాబితా ఇదే !
Garimella Balakrishna Prasad Passes Away: టీటీడీ ఆస్థాన విద్వాంసుడు, ప్రముఖ గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
టీటీడీ ఆస్థాన విద్వాంసుడు, ప్రముఖ గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ind vs Nz Champions Trophy 2025 Final | ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా టీమిండియా | ABP DesamInd vs nz First Half Highlights | Champions Trophy 2025 Final లో భారత్ దే ఫస్ట్ హాఫ్ | ABP DesamInd vs NZ CT Final 2025 | అప్పుడు అంతా బాగానే ఉంది..కానీ ఆ ఒక్క మ్యాచ్ తో కోలుకోలేని దెబ్బ తిన్నాంInd vs Nz Champions Trophy 2025 Final | MS Dhoni కథకు క్లైమాక్స్ ఈరోజే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Champions Trophy Winner India: ఏకైక జట్టుగా భారత్ రికార్డ్, అసాధారణ ఆటతో అద్భుత ఫలితం: భారత జట్టుపై రాష్ట్రపతి, ప్రధాని ప్రశంసలు
ఏకైక జట్టుగా భారత్ రికార్డ్, అసాధారణ ఆటతో అద్భుత ఫలితం: భారత జట్టుపై రాష్ట్రపతి, ప్రధాని ప్రశంసలు
TDP MLC Candidates: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. వారికే అవకాశం ఎందుకంటే ?
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. వారికే అవకాశం ఎందుకంటే ?
Telangana Latest News: ఎమ్మెల్సీగా విజయశాంతి-  అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్- జాబితా ఇదే !
ఎమ్మెల్సీగా విజయశాంతి- అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్- జాబితా ఇదే !
Garimella Balakrishna Prasad Passes Away: టీటీడీ ఆస్థాన విద్వాంసుడు, ప్రముఖ గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
టీటీడీ ఆస్థాన విద్వాంసుడు, ప్రముఖ గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
Ram Charan Upasana: రామ్ చరణ్ - ఉపాసన దంపతులతో నమ్రత, సితార... రీసెంట్ పార్టీ ఫోటోస్ చూశారా?
రామ్ చరణ్ - ఉపాసన దంపతులతో నమ్రత, సితార... రీసెంట్ పార్టీ ఫోటోస్ చూశారా?
Telangana Latest News: తెలంగాణ చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- లక్ష వరకు రుణమాఫీ!
తెలంగాణ చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- లక్ష వరకు రుణమాఫీ!
Prabhas Prashanth Varma Movie: బ్రహ్మ రాక్షస కాదు... ప్రభాస్, ప్రశాంత్ వర్మ సినిమాకు కొత్త టైటిల్
బ్రహ్మ రాక్షస కాదు... ప్రభాస్, ప్రశాంత్ వర్మ సినిమాకు కొత్త టైటిల్
BRS: 11న బీఆర్​ఎస్​ శాసనసభా పక్ష సమావేశం.. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్​!
11న బీఆర్​ఎస్​ శాసనసభా పక్ష సమావేశం.. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్​!
Embed widget