News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Yadagiri Gutta: యాదగిరిగుట్టకు "గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్" అవార్డు, హర్షం వ్యక్తం చేసిన సీఎం!

Yadagiri Gutta: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అవార్డు దక్కడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అవార్డు దక్కడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. 

FOLLOW US: 
Share:

Yadagiri Gutta: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి 2022- 2025 సంవత్సరాలకు గాను ‘‘ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్’’ ప్రదానం చేసే "గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్" ( ఆధ్యాత్మిక హరిత పుణ్య క్షేత్రం ) అవార్డు లభించింది. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పుణ్య క్షేత్రానికి ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కడం ఆనందంగా ఉందన్నారు. స్వయం పాలనలో తెలంగాణ దేవాలయాలకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కడం భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి దక్కిన గౌరవమని సీఎం తెలిపారు. 

తెలంగాణ దేవాలయానికి ‘ఆధ్యాత్మిక హరిత పుణ్య క్షేత్రం’ అవార్డు రావడం, ప్రజల మనోభావాలను, మత సాంప్రదాయాలను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యాదగిరి గుట్ట పునర్నిర్మాణం, భారతీయ ఆధ్యాత్మిక పునురుజ్జీవన వైభవానికి నిదర్శనంగా నిలిచిందని సిఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. యాదాద్రి ఆలయ పవిత్రతకు, ప్రాశస్త్యానికి భంగం కలగకుండా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆధునీకరణ పనులను ‘ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్’ ప్రశంసించడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిన అపూర్వ గౌరవమని సీఎం అన్నారు. తెలంగాణ ప్రజల ఇలవేల్పు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రాన్ని భక్తులకు మరింత చేరువ చేసేందుకు ప్రతిష్టాత్మకంగా పునఃప్రతిష్ఠ చేసిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా వర్దిల్లేలా యాదగిరి పంచ లక్ష్మీనరసింహ స్వామి కృపాకటాక్షాలు ప్రజల పై ఉండాలని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ప్రార్థించారు.

ఆధ్యాత్మిక హరిత పుణ్య క్షేత్రం అవార్డు రావడానికి గల కారణాలు..

  • 13 వ శతాబ్దానికి చెందిన శ్రీ యాదగిరి గుట్ట  లక్ష్మీ నరసింహ దేవాలయ స్వయంభూ పవిత్రతకు భంగం వాటిల్లకుండా, స్వయం భువుని ఏ మాత్రం తాకకుండా ఆలయ  ప్రాశస్త్యాన్ని కాపాడుతూ నిర్మాణం చేపట్టినందుకు..
  • ఆలయం లోపలి వెలుపలి ప్రాంగణంలో శిలలను సంరక్షణ చేసినందుకు..
  • నూటికి నూరు శాతం సెంట్రల్ ఎయిర్ కండిషన్ విధానంతోపాటు ఆలయ వాహిక (ducting) నిర్మాణాలు తదితర సుందరీకరణ పనులను ఆలయ గోడలకు ఏమాత్రం నష్టం వాటిల్లకుండా చేపట్టినందుకు..
  • ప్రత్యేక “సూర్య వాహిక’ ద్వారా ప్రధాన ఆలయంలోకి సహజ కాంతి ప్రసారం జరిగేలా ప్రత్యేక నిర్మాణం చేసినందుకు..
  • భక్తుల రద్దీ విపరీతంగా ఉండే సమయంల్లోనూ స్వచ్ఛమైన గాలి నలుదిశలా ప్రసరించేలా వెంటిలేటర్లు, కిటికీలు ఏర్పాటు చేసినందుకు..
  • ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ నిర్మాణాలను పూర్తిగా కృష్ణశిలతో నిర్మించడం.. తద్వారా సహజరీతిలో వేడిని తగ్గించడంతో శీతలీకరణ భారం తగ్గి పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు నందించడం..
  • విస్తారమైన పచ్చదనంతో కూడుకున్నపరిసరాలు వేడి ప్రభావాన్ని చాలావరకు నివారిస్తాయి.. 
  • స్వచ్ఛమైన తాగునీటి లభ్యతను అందుబాటులో ఉంచడం..
  • భక్తుల అవసరాలకు సరిపోయే చెరువులను నిర్మించడం..
  • భక్తుల వాహనాలకు తగిన పార్కింగ్ స్థలాలను కేటాయించడం..
  • భక్తుల  రవాణా నిమిత్తం నిరంతర  సేవలను అందుబాటులోకి తేవడం.. వంటి నిబంధనలను పరిశీలించి ఈ అవార్డును ప్రకటించడం జరిగిందని అవార్డు ప్రకటించిన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ తెలిపింది.
Published at : 20 Oct 2022 09:07 PM (IST) Tags: CM KCR News Yadagiri gutta Telangana News Yadadri Laxmi Narasimha Swamy Temple Green Place of Worship Award

ఇవి కూడా చూడండి

Merit Scholarship: వెబ్‌సైట్‌లో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్ష హాల్‌టికెట్లు, ఎగ్జామ్ ఎప్పుడంటే?

Merit Scholarship: వెబ్‌సైట్‌లో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్ష హాల్‌టికెట్లు, ఎగ్జామ్ ఎప్పుడంటే?

KCR On Results: హైరానా వద్దు, 3న సంబరాలు చేసుకుందాం- పార్టీ నేతలకు సీఎం కేసీఆర్‌ భరోసా

KCR On Results: హైరానా వద్దు, 3న సంబరాలు చేసుకుందాం- పార్టీ నేతలకు సీఎం కేసీఆర్‌ భరోసా

LAWCET: లాసెట్‌ సీట్ల కేటాయింపు, తొలి విడతలో 5912 మందికి ప్రవేశాలు

LAWCET: లాసెట్‌ సీట్ల కేటాయింపు, తొలి విడతలో 5912 మందికి ప్రవేశాలు

Telangana Polling 2023 LIVE Updates: తెలంగాణలో గెలిచేది ఎవరు.? నిలిచేది ఎవరు.? - ఏబీపీ సీ ఓటర్ సర్వే ఫలితాలు

Telangana Polling 2023 LIVE Updates:  తెలంగాణలో గెలిచేది ఎవరు.? నిలిచేది ఎవరు.? - ఏబీపీ సీ ఓటర్ సర్వే ఫలితాలు

Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, 70 దాటిన పోలింగ్ శాతం

Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, 70 దాటిన పోలింగ్ శాతం

టాప్ స్టోరీస్

Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత

Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత