IPL 2023, LSG vs MI: టఫ్ పిచ్‌పై ముంబయి టార్గెట్ 178 - స్టాయినిస్ హల్క్ ఇన్నింగ్స్!
IPL 2023, LSG vs MI: కఠిన పిచ్‌పై లక్నో సూపర్ జెయింట్స్ అదరగొట్టింది! ఏకనా స్టేడియంలో మంచి స్కోరే చేసింది. అత్యంత కీలక మ్యాచులో ముంబయి ఇండియన్స్‌కు 178 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది.

IPL 2023, LSG vs MI:
కఠిన పిచ్‌పై లక్నో సూపర్ జెయింట్స్ అదరగొట్టింది! ఏకనా స్టేడియంలో మంచి స్కోరే చేసింది. అత్యంత కీలక మ్యాచులో ముంబయి ఇండియన్స్‌కు 178 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. మార్కస్ స్టాయినిస్ (89*; 47 బంతుల్లో 4x7, 8x6) మరోసారి తనలోని హల్క్‌ను బయటకు తీసుకొచ్చాడు. సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కృనాల్ పాండ్య (49; 42 బంతుల్లో 1x4, 1x6) అతడికి అండగా నిలిచాడు. బెరెన్‌డార్ఫ్ 2 వికెట్లు పడగొట్టాడు.
Innings break!
— IndianPremierLeague (@IPL) May 16, 2023
An exceptional knock from @MStoinis inspires @LucknowIPL to a 177/3 in the first innings 🔥🔥
A huge chase coming up for @mipaltan. Can they do it?
Scorecard ▶️ https://t.co/yxOTeCROIh #TATAIPL | #LSGvMI pic.twitter.com/IuqLDqCyWy
ఓపెనర్లు ఫెయిల్
టాస్ ఓడిన లక్నో మొదట బ్యాటింగ్‌కు వచ్చింది. పవర్‌ప్లే ముగిసే సరికే 2 వికెట్లు నష్టపోయి 35 పరుగులు చేసింది. టాప్-3 ఆటగాళ్లు ఇంపాక్టేమీ చూపించలేదు. జట్టు స్కోరు వద్దే దీపక్ హుడా (5), ప్రేరక్ మన్కడ్ (0) వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. స్పిన్ ఆడేందుకు ఇబ్బంది పడ్డ క్వింటన్ డికాక్ (16)ను పియూష్ చావ్లా 6.1వ బంతికి ఔట్ చేశాడు. పిచ్ చాలా కఠినంగా ఉండటం.. ముంబయి బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో లక్నో స్కోరు నెమ్మదించింది.
పాండ్య, స్టాయినిస్ పాట్నర్‌షిప్
ఇలాంటి టఫ్ కండీషన్స్‌లో కెప్టెన్ కృనాల్ పాండ్య, మార్కస్ స్టాయినిస్ నిలిచారు. చక్కని బంతుల్ని డిఫెండ్ చేశారు. చెత్త బంతుల్ని వేటాడారు. నాలుగో వికెట్‌కు 59 బంతుల్లో 82 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించారు. దాంతో 9 ఓవర్లకు లక్నో 63/3తో నిలిచింది. లూజ్ ఓవర్ దొరికేంత వరకు ఈ ఇద్దరూ తొందర పడలేదు. తెలివిగా అటాక్ చేసి పరుగులు రాబట్టారు. 14 ఓవర్లకు స్కోరును 100కు చేర్చారు. సరిగ్గా హాఫ్ సెంచరీ ముందు పిక్కలు పట్టేయడంతో కృనాల్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అప్పటికి స్కోరు 117/3.
ఆఖర్లో హల్క్ ఇన్నింగ్స్
నికోలస్ పూరన్ (8*) వచ్చాక.. 15 ఓవర్లు దాటాక.. మార్కస్ స్టాయినిస్ తన విధ్వంసాన్ని చూపించాడు. బ్యాటింగ్ చేసేందుకు కష్టంగా అనిపిస్తున్న పిచ్‌పై 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. అదీ సిక్సర్‌తో. ఆ తర్వాత మరింత చెలరేగాడు. క్రిస్ జోర్డాన్ వేసిన 18వ ఓవర్లో ఏకంగా రెండు సిక్సర్లు, మూడు బౌండరీలు బాదేసి 24 పరుగులు రాబట్టాడు. బెరెన్‌డార్ఫ్ వేసిన 19వ ఓవర్లో రెండు సిక్సర్లు బాదేశాడు. ఆఖరి ఓవర్ ఆఖరి బంతినీ స్టాండ్స్‌లో పెట్టేసి జట్టు స్కోరును 177/3కు చేర్చాడు. ఇలాంటి స్లగ్గిష్ పిచ్‌పై ఇది టఫ్ టార్గెట్టే!
ముంబయి ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, నేహాల్ వధేరా, టిమ్ డేవిడ్, హృతిక్ షోకీన్, క్రిస్ జోర్డాన్, పియూష్ చావ్లా, జేసన్ బెరెన్‌డార్ఫ్, ఆకాశ్ మధ్వాల్
లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డికాక్, దీపక్ హుడా, ప్రేరక్ మన్కడ్, కృనాల్ పాండ్య, మార్కస్ స్టాయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోనీ, నవీనుల్ హఖ్, రవి బిష్ణోయ్, స్వప్నిల్ సింగ్, మొహిసిన్ ఖాన్
A gigantic MAXIMUM to reach his fifty 💥
— IndianPremierLeague (@IPL) May 16, 2023
This has been a splendid innings from @MStoinis 🙌
Follow the match ▶️ https://t.co/yxOTeCROIh #TATAIPL | #LSGvMI pic.twitter.com/C4wSiSygTv
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

