Chiranjeevi: చిరంజీవి సినిమాలో బాలీవుడ్ హీరోయిన్... కమల్ హాసన్ సినిమా చేసిన 15 ఏళ్లకు!
Mega 157 Movie Actress: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ఆయన వీరాభిమాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించనున్న సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ నటిస్తారని ఫిలింనగర్ వర్గాల సమాచారం.

Chiranjeevi Odela Movie: మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆయన వీరాభిమాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటన వచ్చిన సంగతి ప్రేక్షకులు అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ భామను సంప్రదించినట్లు తెలిసింది. ఆమె ఎవరు? అనే వివరాల్లోకి వెళితే...
చిరంజీవి సినిమాలో రాణి ముఖర్జీ!?
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నటించిన సినిమా చిరంజీవికి 157వ సినిమా. అందుకని మెగా 157 (Mega 157) అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ భామ రాణి ముఖర్జీ అయితే బాగుంటుందని ఆవిడను సంప్రదించారట. ఇటీవల ఆమెను కలిసి శ్రీకాంత్ ఓదెల కథ వివరించినట్లు కూడా ఫిలింనగర్ వర్గాలలో ఒక సమాచారం వినబడుతుంది. అయితే... ఆ విషయం మీద ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేదు.
పెళ్లి తర్వాత సినిమాల ఎంపికలో రాణి ముఖర్జీ ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. కమర్షియల్ హీరోయిన్ పాత్రలకు ఆవిడ కాస్త దూరంగా ఉంటున్నారు. 'మర్దాని' వంటి ఫిమేల్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ చేస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల సినిమా కూడా సగటు కమర్షియల్ సినిమాలకు భిన్నంగా కంటెంట్ ఓరియంటెడ్ కథతో, మెగాస్టార్ వయసుతో పాటు ఆయన ఇమేజ్ వంటివి దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ రాశారట. అందులో హీరోయిన్ పాత్రకు వెయిటేజ్ ఉండడంతో రాణి ముఖర్జీ ఒకే చెబుతారని ఆశిస్తున్నారు.
కమల్ హాసన్ సినిమా చేసిన 15 ఏళ్లకు?
రాణి ముఖర్జీ బాలీవుడ్ హీరోయిన్. బాలీవుడ్ హీరోయిన్లు తెలుగు సినిమాలు, ఆ మాట వస్తే సౌత్ సినిమాలు చేయడం తక్కువ. ఈ మధ్య ఈ మధ్య సౌత్ హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేయడం మొదలు పెట్టిన తర్వాత బాలీవుడ్ హీరోయిన్లు సౌత్ సినిమాలు చేస్తున్నారు. రాణి ముఖర్జీ అయితే ఒకటే సౌత్ సినిమా చేశారు. అది కూడా 15 ఏళ్ల క్రితం. లోకనాయకుడు కమల్ హాసన్ హే రామ్ సినిమాలో ఆవిడ నటించారు ఇప్పుడు చిరంజీవి సినిమా ఓకే చేస్తే ఆవిడ రెండో సౌత్ సినిమా అవుతుంది.
Also Read: ఏడుసార్లు అబార్షన్... బెదిరింపులు... తమిళ నటిపై లైంగిక వేధింపుల కేసులో విస్తుపోయే నిజాలు
చిరంజీవి శ్రీకాంత్ ఓదెల సినిమాను ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకం మీద సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా కంటే ముందు అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ సంస్థ మీద సాహు గారపాటి ప్రొడ్యూస్ చేయనున్న సినిమాలో చిరంజీవి నటిస్తారు. ఆ సినిమా కంటే ముందు 'బింబిసార' ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో నటిస్తున్న 'విశ్వంభర' విడుదల కానుంది.





















