By: ABP Desam | Published : 20 Oct 2021 07:32 PM (IST)|Updated : 20 Oct 2021 07:32 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
మ్యాచ్ గెలిచాక హార్దిక్, సూర్యకుమార్ యాదవ్ (Source: BCCI Twitter)
టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో భారత్ ఏకంగా తొమ్మిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 152 పరుగులు చేయగా.. భారత్ 17.5 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి ఆ లక్ష్యాన్ని ఛేదించింది.
మూడు ఓవర్లకే మూడు వికెట్లు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ప్రారంభంలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. భారత స్పిన్నర్లు అశ్విన్, జడేజా బంతితో మ్యాజిక్ చేయడంతో ఆస్ట్రేలియా 11 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (1: 7 బంతుల్లో), వన్‌డౌన్‌లో వచ్చిన మిషెల్ మార్ష్‌లను(0: 1 బంతి) అశ్విన్ వెనక్కి పంపగా, మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్‌ను (8: 10 బంతుల్లో, ఒక ఫోర్) జడేజా అవుట్ చేశాడు. ఆ తర్వాత స్టీఫెన్ స్మిత్ (57: 48 బంతుల్లో, ఏడు ఫోర్లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (37: 28 బంతుల్లో, ఐదు ఫోర్లు) ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేసినా వీరు మరీ నిదానంగా ఆడటంతో స్కోరు నత్తనడకన ముందుకు సాగింది. దీంతో మొదటి 10 ఓవర్లలో ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయి 57 పరుగులు మాత్రమే సాధించింది.
ఆ తర్వాత ఆస్ట్రేలియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఫాంలో ఉన్న మ్యాక్స్‌వెల్‌ను క్లీన్ బౌల్డ్ చేసి రాహుల్ చాహర్ భారత్‌కు మంచి బ్రేక్ ఇచ్చాడు. అయితే ఆ తర్వాత స్మిత్ గేర్లు మార్చడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ వేగం పుంజుకుంది. 15 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది. ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి స్మిత్ తన అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. చివరి ఓవర్లో భువీ అద్బుతంగా బౌలింగ్ చేసి ఆరు పరుగులు మాత్రమే ఇవ్వడంతో పాటు స్మిత్ వికెట్ కూడా తీసుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు తీయగా.. జడేజా, భువీ, రాహుల్ చాహర్ చెరో వికెట్ తీశారు.
మొదటి బంతి నుంచే లక్ష్యం వైపు..
సులభమైన లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఎక్కడా ఇబ్బంది కలగలేదు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (39: 31 బంతుల్లో, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు), రోహిత్ శర్మ (60 రిటైర్డ్ హర్ట్: 41 బంతుల్లో, ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు) అస్సలు తడబడకుండా బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 9.2 ఓవర్లలోనే 68 పరుగులు జోడించారు. అస్టిన్ అగర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రాహుల్ అవుటయ్యాడు.
ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్‌తో (38 నాటౌట్: 27 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. కాసేపటికి రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడంతో హార్దిక్ పాండ్యా (14: 8 బంతుల్లో, ఒక సిక్సర్) క్రీజులోకి వచ్చాడు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ కలిసి మ్యాచ్‌ను ముగించారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఏకంగా ఎనిమిది మందితో బౌలింగ్ వేయించడం విశేషం. వీరిలో కేవలం ఆస్టన్ అగర్ మాత్రమే వికెట్ తీయగలిగాడు.
Also Read: విజయంతో వరల్డ్ కప్ ఖాతా తెరిచిన టీమిండియా.. ఏడు వికెట్లతో ఇంగ్లండ్ చిత్తు
Also Read: టీ20 ప్రపంచకప్‌లో ముందే ఫైనల్ ఆడేస్తున్న కోహ్లీసేన! ఇప్పటి వరకు పాక్‌పై తిరుగులేని భారత్
Also Read: కూతురితో కోహ్లీ ఫొటో.. ‘ఒక్క ఫ్రేమ్‌లో నా మొత్తం హృదయం’ అన్న అనుష్క!
PBKS Vs DC Highlights: టాప్-4కు ఢిల్లీ క్యాపిటల్స్ - కీలక మ్యాచ్‌లో పంజాబ్‌పై విజయం!
PBKS Vs DC: ఆఖర్లో తడబడ్డ ఢిల్లీ క్యాపిటల్స్ - పంజాబ్ ముందు సులువైన లక్ష్యం!
Batsmen Out At 199: 199 మీద అవుటైన ఏంజెలో మాథ్యూస్ - ఆ 12 మంది సరసన - ఇద్దరు భారతీయలు కూడా!
PBKS Vs DC Toss: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ - ప్రతీకారానికీ రెడీ!
CSK Worst Record: ఐపీఎల్లో చెన్నై చెత్త రికార్డు - 15 సీజన్లలో ఏ జట్టూ చేయని ఘోరమైన ప్రదర్శన!
Astrology: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!
Google Pixel 6A Price: గూగుల్ పిక్సెల్ ధరలను ప్రకటించిన కంపెనీ - ఏ దేశంలో తక్కువకు కొనచ్చంటే?
Bandi Sanjay About KCR: కేసీఆర్ పాతబస్తీకి పోవాలంటే ఒవైసీ పర్మిషన్ తీసుకోవాలి: సీఎంపై బండి సంజయ్ సెటైర్స్
Sony Xperia Ace III: అత్యంత చవకైన సోనీ 5జీ ఫోన్ వచ్చేసింది - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?