Anushka on Social Media: కూతురితో కోహ్లీ ఫొటో.. ‘ఒక్క ఫ్రేమ్‌లో నా మొత్తం హృదయం’ అన్న అనుష్క!

విరాట్ కోహ్లీ, తన కూతురు వామికతో ఉన్న ఫొటోను అనుష్క శర్మ షేర్ చేసింది. ఎంతో క్యూట్‌గా ఉన్న ఈ ఫొటోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

FOLLOW US: 

ప్రముఖ క్రికెటర్, టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తన కూతురుతో ఉన్న ఫొటోలను తన భార్య, ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మ ట్వీటర్‌లో షేర్ చేశారు. తండ్రీ, కూతుళ్లు ఉన్న ఈ క్యూట్ ఫొటోకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ ఫొటో పోస్ట్ అయిన రెండు గంటల్లో 20 లక్షల లైకులు రావడం విశేషం.

ఈ ఫొటో కింద ‘My whole heart in one frame.’ అనే క్యాప్షన్ కూడా అనుష్క రాసింది. విరాట్ కోహ్లీ.. తన కూతుర్ని నవ్వుతూ చూస్తున్న ఈ ఫొటో ఎంతో క్యూట్‌గా ఉంది. తన కూతురి ముఖాన్ని అనుష్క శర్మ రివీల్ చేయకపోయినా.. చిన్నారి వామిక, విరాట్ కోహ్లీ ఉన్న ఈ ఫొటో ఫ్యాన్స్‌కు ఎంతో ఆనందాన్ని అందించింది. కామెంట్ సెక్షన్‌ను ఫ్యాన్స్ తమ కామెంట్లతో నింపేస్తున్నారు. ఒకసారి ఆ పోస్ట్ ఎలా ఉందో చూసేయండి..

View this post on Instagram
 
A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

ఈ ఫొటోకు సెలబ్రిటీలు ఎలా రియాక్ట్ అయ్యారు?
ఆలియా భట్, వరుణ్ ధావన్, జెనీలియా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ ఫొటోను లైక్ చేయగా.. రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, మసాబా గుప్తా, సునీల్ శెట్టి, నీతి మోహన్, రణ్‌వీర్ సింగ్, దియా మీర్జా, ఈషా అగర్వాల్ వంటి సెలబ్రిటీలు కామెంట్లు కూడా చేశారు.

అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ తమ కూతురి ముఖం ఎందుకు చూపించట్లేదు?
ఈ సంవత్సరం జనవరి 11వ తేదీన వామిక పుట్టడంతో విరాట్, అనుష్క తల్లిదండ్రులయ్యారు. తమ కూతురి పూర్తి ఫొటోలను ఎందుకు షేర్ చేయట్లేదని ఫ్యాన్స్ ‘ఆస్క్ మీ’ సెక్షన్‌లో అడిగినప్పుడు.. తమ కూతురి ఫొటోలను తాము సోషల్ మీడియాలో పెట్టదలచుకోలేదన్నారు.

‘అసలు సోషల్ మీడియా ఏంటనే అంశంపై వామికకు పూర్తిగా అర్థం అయ్యాక తనే నిర్ణయం తీసుకుంటుందని, అంతవరకు తమ చిన్నారి పూర్తి ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టబోమని’ విరాట్ కోహ్లీ అప్పుడు చెప్పాడు.

ఇక ప్రొఫెషనల్ విషయానికి వస్తే.. విరాట్ కోహ్లీ టీ20 వరల్డ్‌కప్‌కు సన్నద్ధం అవుతున్నాడు. కెప్టెన్‌గా తనకు ఇదే లాస్ట్ సిరీస్. ఆ తర్వాత కేవలం ఆటగాడిగా మాత్రమే జట్టులో కొనసాగనున్నాడు. ఇక అనుష్క శర్మ 2018లో షారుక్ ఖాన్‌తో నటించిన ‘జీరో’ సినిమా తర్వాత ఇంతవరకు తెర మీద కనిపించలేదు. తను తిరిగి రావడం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే నిర్మాతగా మాత్రం అనుష్క ఫుల్ బిజీ. గతేడాది ఓటీటీలో ‘బుల్‌బుల్’, ‘పాతాళ్ లోక్’ వంటి భారీ హిట్లను కొట్టింది. ఇటీవలే మృతి చెందిన ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్ ‘ఖాలా’ అనే సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం కానున్నాడు. ఈ సినిమాను కూడా అనుష్క శర్మనే నిర్మించనుంది.

Also Read: ధోనీసేనకు అభినందనలు చెప్పినట్టే చెప్పి.. పంచ్ వేసిన గౌతమ్‌ గంభీర్‌

Also Read: ఈ సీజన్ లో అసలైన విజేత కోల్ కతా... ఐపీఎల్ సెకండ్ పార్ట్ లో ఆ జట్టు గొప్పగా ఆడింది... సీఎస్కే కెప్టెన్ ధోనీ కామెంట్స్

Also Read: ఐపీఎల్‌ ఫైనల్‌ ముందు ధోనీ నేర్పిన వ్యాపార పాఠమిది! ప్రశంసించిన ఆనంద్‌ మహీంద్రా

Also Read: టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఇదే.. ఈ ఐపీఎల్‌లో ఎంతమంది హిట్ అయ్యారో తెలుసా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Virat Kohli Anushka Sharma Vamika Anushka Shares Virat Vamika Pic My Whole Heart in One Frame

సంబంధిత కథనాలు

LSG Vs RR: లక్నోపై రాజస్తాన్ ఘనవిజయం - రెండో స్థానానికి రాయల్స్ - పోటీ ఇవ్వలేకపోయిన సూపర్ జెయింట్స్!

LSG Vs RR: లక్నోపై రాజస్తాన్ ఘనవిజయం - రెండో స్థానానికి రాయల్స్ - పోటీ ఇవ్వలేకపోయిన సూపర్ జెయింట్స్!

LSG Vs RR: సమిష్టిగా రాణించిన రాజస్తాన్ బ్యాటర్లు - ఒక్క అర్థ సెంచరీ లేకుండా భారీ స్కోరు - లక్నో టార్గెట్ ఎంతంటే?

LSG Vs RR: సమిష్టిగా రాణించిన రాజస్తాన్ బ్యాటర్లు - ఒక్క అర్థ సెంచరీ లేకుండా భారీ స్కోరు - లక్నో టార్గెట్ ఎంతంటే?

CSK Vs GT Result: టేబుల్ టాప్ దిశగా గుజరాత్ - చెన్నై ఏడు వికెట్లతో ఘనవిజయం!

CSK Vs GT Result: టేబుల్ టాప్ దిశగా గుజరాత్ - చెన్నై ఏడు వికెట్లతో ఘనవిజయం!

LSG Vs RR Toss: టాప్-2 కోసం పోరాటం - టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న రాజస్తాన్!

LSG Vs RR Toss: టాప్-2 కోసం పోరాటం - టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న రాజస్తాన్!

CSK Vs GT: దారుణంగా విఫలమైన చెన్నై బ్యాటింగ్ దళం - వికెట్లున్నా షాట్లు కొట్టలేక - గుజరాత్ టార్గెట్ ఎంతంటే?

CSK Vs GT:  దారుణంగా విఫలమైన చెన్నై బ్యాటింగ్ దళం - వికెట్లున్నా షాట్లు కొట్టలేక - గుజరాత్ టార్గెట్ ఎంతంటే?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

TS CPGET 2022: కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టులో మార్పులు - వారు ఏ కోర్సులోనైనా చేరేందుకు ఛాన్స్

TS CPGET 2022: కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టులో మార్పులు - వారు ఏ కోర్సులోనైనా చేరేందుకు ఛాన్స్

Tollywood: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేయబోయే సినిమాలివే!

Tollywood: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేయబోయే సినిమాలివే!

Family Health Survey : దక్షిణాదిలో రసికులు ఏపీ మగవాళ్లేనట - కనీసం నలుగురితో ...

Family Health Survey : దక్షిణాదిలో రసికులు ఏపీ మగవాళ్లేనట - కనీసం నలుగురితో ...

Katwa hospital: ఇదేందిరా ఇది! బిర్యానీ బిల్లు రూ.3 లక్షలా!

Katwa hospital: ఇదేందిరా ఇది! బిర్యానీ బిల్లు రూ.3 లక్షలా!