Kakinada Port Issue News: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం - కాకినాడ పోర్టు, సెజ్ అక్రమాలపై సీఐడీ విచారణ
Latest News In Kakinada: కాకినాడ పోర్టు, సెజ్ విషయంలో తనను బెదిరించి బలవంతంగా వాటాను బదలాయించుకున్నారని కేవీ రావు ఫిర్యాదు చేశారు. దీనిపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది.
Andhra Pradesh CID Case In Kakinada: వైసీపీ అయిదేళ్లపాలనలో అరాచకాలు చోటుచేసుకున్నాయని కూటమి నేతలు చెబుతున్న దానికి బలం చేకూర్చే విధంగా అక్రమాలు బట్టబయలు అవుతున్నాయి. కాకినాడు పోర్టు కేంద్రంగా అక్రమ కార్యకలాపాలు యథేచ్ఛగా సాగించుకునేందుకు మరో బాగోతె వెలుగు చూసింది. పార్టీ అధినేత నుంచి ఎమ్మెల్యే స్థాయి నేతల వరకు మైండ్ గేమ్ అడి అనుకున్నవి దక్కించుకున్న విషయంపై కేసు నమోదు అయింది. కాకినాడ పోర్టులో రూ.2,500 కోట్లు విలువైన వాటాను అరబిందో సంస్థకు కేవలం రూ.494 కోట్లకే అప్పగించడంపై సీఐడీ దర్యాప్తు చేయనుంది. రూ.1,109 కోట్లు విలువైన సెజ్‌ను రూ.12 కోట్లుకు అప్పనంగా ఇవ్వడం కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. రూ.వేల కోట్లు ఆస్తులు తమకు కావాల్సిన సంస్థలకు, వ్యక్తులకు అప్పగించుకునేందుకు కాకినాడ పోర్టు, సెజ్ నుంచి బయటకు వెళ్ల గొట్టారంటూ ఆ సంస్థల అధినేత కేవీ రావు ఫిర్యాదు చేశారు.
అసలు ఫిర్యాదులో ఏముంది..? ఎవరిపై కేసులు నమోదు..?
వైసీపీ పాలనలో కాకినాడ పోర్టు, సెజ్‌లోని రూ.3,600 కోట్లు విలువైన వాటాను అత్యంత చౌకగా బలవంతంగా అరబిందోసంస్థకు బదలాయించుకున్నారని బాధితుడు కర్నాటి వెంకటేశ్వరరావు(కేవీ రావు) సీఐడీకు ఫిర్యాదు చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి 2020 మే నెలలో తనకు ఫోన్ చేసి కాకినాడ సీపోర్టు విషయంలో వైవీ సుబ్బారెడ్డికు మారుడు విక్రాంత్ రెడ్డిని కలిసి మాట్లాడాలని చెప్పారన్నారు. ఆయనతోపాటు అరబిందో సంస్థ యజమాని శరత్ చంద్రారెడ్డి(విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి సోదరుడు) కూడా ఉంటారని పేర్కన్నట్టు కేవీరావు తెలిపారు.
Also Read: ఏపీలో కూటమి గెలుపునకు ఆరు నెలలు- ప్రభుత్వం ప్లస్‌లు ఏంటి?.. మైనస్‌లేంటి ?
విజయసాయి రెడ్డి ఆదేశాలతో విక్రాంత్ రెడ్డిని హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లో కలిసినట్టు వెల్లడించారు కేవీ రావు. స్పెషల్ ఆడిట్ రిపోర్ట్ ప్రకారం కేఎస్‌పీఎల్ రూ.1,000 కోట్ల మేర వాటా సొమ్ము చెల్లించాలని విక్రాంత్ రెడ్డి చెప్పినట్టు పేర్కన్నారు. ఎలాంటి అవకతవకలు చేయలేదని ఆడిటర్లు రికార్డులను ఫ్యాబ్రికేట్ చేసి తప్పుడు నివేదికలు ఇచ్చారని తెలిపారు. ఏపీ ప్రభుత్వం నోటీసులిస్తే కేఎస్‌పీఎల్ తీవ్ర ఇబ్బందులు పడుతుందని విక్రాంత్ రెడ్డి హెచ్చరించినట్టు కేవీ రావు తెలిపారు. కేఎస్‌పీఎల్‌లో ఉన్న 50 శాతం వాటా, కాకినాడ సెజ్‌లోని 48.74 శాతం వాటాల్ని చెప్పిన వారి పేరిట బదిలీ చేయాలని ఒత్తిడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇదంతా తన కోసం కాదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటున్నారని విక్రాంత్ రెడ్డి చెప్పినట్టు కేవీ రావు వెల్లడించారు. లేకపోతే క్రిమినల్ కేసులు విజిలెన్స్ దాడులు తప్పవని బెదిరించారని, అంతేకాకుండా కుటుంబ సభ్యులను సైతం జైలుకు పంపిస్తామని భయభ్రాంతులకు గురిచేశారని పేర్కొన్నారు. కావాలంటే కొంత సొమ్ము చెల్లిస్తామని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించాలని ఒత్తిడి చేశారని తెలిపారు.
ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకున్న ఏపీ సీఐడీ ఐపీసీ 506, ఐపీసీ 384, ఐపీసీ 420, ఐపీసీ 109, ఐపీసీ 467, 120బీ, బీఎస్‌ఎస్ 111 సెక్షన్ల క్రింద అభియోగాలు మోపుతూ కేసు నమోదు చేసింది. జగన్‌కు సోదరుడి వరుస అయ్యే వై.విక్రాంత్ రెడ్డి, వైపీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఆయన అల్లుడి సోదరుడు అరబిందో సంస్థ ప్రతినిధి పి.శరత్ చంద్రారెడ్డి, పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం, ఎల్‌ఎల్‌పీ ఆడిట్ సంస్థలు, అరబిందో రియాల్టీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రయివేట్ లిమిటెడ్, అందులోని డైరెక్టర్లు తదితరులను ఈ కేసులో నిందితులుగా చేర్చింది సీఐడీ.
Also Read: అమరావతిలో ఐదు ఎకరాల భూమి కొన్న చంద్రబాబు- త్వరలోనే ఇంటి నిర్మాణం ప్రారంభం