By: ABP Desam | Updated at : 16 Oct 2021 04:41 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ఆనంద్ మహీంద్రా
చెన్నై సూపర్‌కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీపై వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. అతడు ఒకపని చేస్తూనే మరో లక్ష్యంపై గురిపెట్టగలడని పేర్కొన్నారు. ఒకపక్క ఐపీఎల్ బిజీలో ఉన్నా నేషనల్ క్యాడెట్ కార్ప్స్ సమీక్షకు హాజరయ్యారని వెల్లడించారు. అతడి నుంచి గొప్ప నాయకత్వ పాఠాలు నేర్చుకోవచ్చని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC)లో సంస్కరణలు తీసుకురావాలని నడుం బిగించింది. ఇందుకోసం నిపుణులు, ప్రముఖులతో ఓ కమిటీని రూపొందించింది. మారిన కాలానికి అనుగుణంగా ఎన్‌సీసీని మార్చేందుకు ఏం చేయాలో చర్చించాలని కోరింది. అవసరమైన సలహాలను సూచించాలని వెల్లడించింది. ఇందులో ఆనంద్ మహీంద్రా, ఎంఎస్ ధోనీతో పాటు మరికొందరిని సభ్యులుగా చేర్చింది. రెండు రోజుల క్రితమే ఏర్పాటు చేసిన సమావేశానికి ధోనీ హాజరై విలువైన సలహాలు ఇచ్చాడని మహీంద్రా తెలిపారు.
Also Read: ఛాంపియన్ సూపర్ కింగ్స్.. నాలుగోసారి ట్రోఫీని ముద్దాడిన చెన్నై.. ఒత్తిడికి చిత్తయిన కోల్‌కతా
'ఐపీఎల్ ఫైనల్‌కు రెండు రోజుల ముందే ఎంఎస్ ధోనీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేషనల్ క్యాడెట్ కార్ప్స్ సమీక్షకు హాజరయయారు. అతడు సమావేశానికి బాగా సన్నద్ధమయ్యాడు. సూక్ష్మ మార్పులనూ సూచించాడు. చక్కని సూచనలు చేశాడు. ఐపీఎల్ ఒత్తిడిలోనూ హాజరైనందుకు అతడికి నేను ధన్యవాదాలు చెబితే.. తేలిగ్గా తీసుకున్నాడు' అని మహీంద్రా ట్వీట్ చేశారు.
ధోనీని చూసి ఓ పాఠం నేర్చుకోవచ్చని మహీంద్రా అన్నారు. 'జీవితాన్ని బ్యాలెన్స్ చేయడం దీన్నుంచి నేర్చుకోవచ్చు. మనదైన ముద్ర వేయడానికి జీవితంలో ఎన్నో అవకాశాలు వస్తాయి. కేవలం ఒకే లక్ష్యానికే అంకితమవ్వకుండా మిగతావాటిపైనా ఫోకస్ చేయొచ్చు. కాస్త విరుద్ధంగా అనిపించినా ఇది నిజమే. స్పష్టంగా ఆలోచిస్తే, కచ్చితత్వంతో ఉంటే ఒకేసారి కొన్ని లక్ష్యాలపై పనిచేయొచ్చు' అని మహీంద్రా మరో ట్వీట్ పెట్టారు.
Two days before the IPL final, @msdhoni joined a VC for a subcommittee of the National Cadet Corps review panel. He was well prepared & made seminal, convincing points during the meeting. When I thanked him for taking time out despite the IPL pressure, he made light of it. (1/2) pic.twitter.com/tf6LwAgs3v
— anand mahindra (@anandmahindra) October 16, 2021
The Leadership Lesson from this?
— anand mahindra (@anandmahindra) October 16, 2021
“BALANCE”
Life is rich with opportunities to make an impact. You can achieve focus even if not obsessed with just one goal. Paradoxical, but true. Work on a few goals concurrently. In each task,you’ll be more clear-headed, cool & composed (2/2) pic.twitter.com/mNmVMEy2C2
Tata Punch vs Hyundai Exter: రూ. 10 లక్షల్లోపు మంచి బడ్జెట్ కార్లు - ఏది బెస్టో తెలుసా?
Cryptocurrency Prices: మిక్స్డ్ నోట్లో క్రిప్టోలు - బిట్‌కాయిన్‌కు మాత్రం ప్రాఫిట్!
Stock Market News: స్టాక్ మార్కెట్లో లక్ష్మీ కళ! నేడు రూ.3 లక్షల కోట్లు లాభపడ్డ మదుపర్లు!
Stock Market News: సెన్సెక్స్‌కు రిలయన్స్ బూస్ట్! 62,000 పైన ట్రేడింగ్!
Gold-Silver Price Today 26 May 2023: పసిడి రేట్లో స్వల్ప మార్పు - ఇవాళ బంగారం, వెండి కొత్తలు ధరలు ఇవి
Telangana Politics : అయితే కొత్త పార్టీ లేకపోతే కాంగ్రెస్ - పొంగులేటి, జూపల్లి డిసైడయ్యారా ?
New Parliament Inauguration: కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
NTR - Balakrishna : బాలకృష్ణకు ముందే చెప్పిన కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్
New Parliament Opening: కొత్త పార్లమెంట్‌పై RJD వివాదాస్పద ట్వీట్, శవపేటికతో పోల్చడంపై దుమారం