Asia Cup 2023: 17 ఏళ్ల తర్వాత పాక్ లో టీం ఇండియా పర్యటన... ఆసియా కప్ 2023 హోస్టింగ్ హక్కులు దక్కించుకున్న పాకిస్థాన్..!
సుమారు 17 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ లో భారత క్రికెట్ జట్టు పర్యటించనుంది. ఆసియా కప్ 2023 నిర్వహణ హక్కులు దాదాపుగా పాకిస్థాన్ కు ఖరారు కావడంతో టీం ఇండియా పాక్ పర్యటన వెళ్లే అవకాశం ఉంది.
భారత క్రికెట్ జట్టు 17 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ పర్యటించనుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) ఆసియా కప్ 2023 హోస్టింగ్ హక్కులను దక్కే అవకాశం ఉండడంతో టీం ఇండియా పాకిస్థాన్ లో పర్యటించ అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు తెలిపారు. ఐసీసీ ఈవెంట్లలో పాక్ వెలుపల మాత్రమే భారత్-పాకిస్థాన్ తలపడుతున్నాయి. 2023 ఆసియా కప్ హోస్టింగ్ హక్కులు దాదాపుగా పీసీబీకి ఖరారయ్యాయి. పాకిస్థాన్ ఈ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇస్తుందా లేక యూఏఈకి మారుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: రోహిత్‌శర్మకు ఇష్టమైన సినిమా, మైదానం, వంటకం ఏంటో తెలుసా?
50 ఓవర్ల ఫార్మాట్ లో మ్యాచ్ లు
2023లో 50 ఓవర్ల ప్రపంచ కప్ ఉంటుంది కాబట్టి ఆసియా కప్ టోర్నమెంట్ కూడా 50 ఓవర్ల ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 2018లో కూడా ఆసియా కప్పును 50 ఓవర్ల ఫార్మాట్ లో నిర్వహించారు. కొవిడ్-19 కారణంగా 2020 లో జరగాల్సిన ఆసియా కప్ రద్దుచేశారు.
Also Read: నేనైతే అశ్విన్‌కు చోటివ్వను..! కేవలం పరుగుల్ని నియంత్రిస్తే సరిపోదన్న మంజ్రేకర్
కివీస్, ఇంగ్లాండ్ సిరీస్ రద్దు
పాకిస్థాన్ గత కొన్ని సంవత్సరాలుగా వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, వరల్డ్ ఎలెవన్, శ్రీలంక, ఇతర జట్లకు ఆతిథ్యం ఇచ్చింది. ఇటీవల న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు పాకిస్థాన్‌లో జరిగే మ్యాచ్‌ల నుంచి వైదొలిగాయి. భద్రతా కారణాలతో ఈ పర్యటనలను రద్దు చేసుకున్నట్లు ఆ దేశాల క్రికెట్ బోర్డులు ప్రకటించాయి. మొదటి వన్డే ప్రారంభం అయ్యే ముందే కివీస్ సిరీస్ రద్దు చేసుకుని స్వదేశానికి తరలివెళ్లింది ఇంగ్లాండ్ జట్టు మాత్రం నెల రోజుల ముందే పాక్ సిరీస్‌ను రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది.
Also Read: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే పండగ.. థియేటర్లలో టీ20 ప్రపంచకప్ లైవ్.. ఆ కిక్కే వేరప్పా!
వచ్చే ఏడాది ఆస్ట్రేలియా టూర్
వచ్చే ఏడాది ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్ లో పర్యటించనుంది. ఆ సిరీస్‌కు పీసీబీ ఆతిథ్యం ఇస్తుందా లేదా అన్న సందేహం ఉంది. ఈ సిరీస్ ఏ అవాంతరాలు లేకుండా జరిగితే ఆసియా కప్ కు మార్గం సుగుమమం అయినట్లే అని పీసీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఛాంపియన్ సూపర్ కింగ్స్.. నాలుగోసారి ట్రోఫీని ముద్దాడిన చెన్నై.. ఒత్తిడికి చిత్తయిన కోల్‌కతా
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి