By: ABP Desam | Updated at : 16 Oct 2021 04:17 PM (IST)
Edited By: Ramakrishna Paladi
గౌతమ్ గంభీర్
ఐపీఎల్ ఫైనల్లో ఓటమి పాలైన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ అండగా నిలిచాడు. విజేత చెన్నై సూపర్‌కింగ్స్‌కు అభినందనలు తెలియజేశాడు. వారితో పోలిస్తే ఫైనళ్లలో కేకేఆర్ ఎక్కువ విజయవంతమైన జట్టని సున్నితంగా విమర్శించాడు.
'చెన్నై సూపర్‌కింగ్స్‌కు అభినందనలు! కోల్‌కతా నైట్‌రైడర్స్ బాధపడకండి. మనం మూడు ఫైనళ్లలో రెండు గెలిచాం. మీరు తలెత్తుకోండి! ' అని గౌతీ ట్వీట్ చేశాడు. కాగా మ్యాచుకు ముందు అతడు కేకేఆర్‌కు మద్దతుగా మాట్లాడాడు. ఆ జట్టు విజయం సాధిస్తుందని అంచనా వేశాడు.
Also Read: ఛాంపియన్ సూపర్ కింగ్స్.. నాలుగోసారి ట్రోఫీని ముద్దాడిన చెన్నై.. ఒత్తిడికి చిత్తయిన కోల్‌కతా
'ఒకసారి మీరు డేటా చూడండి. డేటా, అంకెలను చూశాక మన (కేకేఆర్)తో పోలిస్తే వాళ్లే (సీఎస్‌కే) పెద్ద చోకర్స్ అని నా జట్టుకు చెబుతాను. ఎందుకంటే వారు ఎనిమిది ఫైనళ్లు ఆడి నాలుగే గెలిచారు. మనం రెండు ఆడితే రెండూ గెలిచాం. ఒత్తిడిలో వారు మనకన్నా ఎక్కువగా చిత్తయ్యారు' అని గంభీర్ అన్నాడు. వందశాతం కష్టపడితే ఫైనల్లో విజయం సాధించగలమని వెల్లడించాడు.
ఏదేమైనా గంభీర్ అంచనాలు తలకిందులయ్యాయి. చెన్నై చేతిలో కేకేఆర్ పరాజయం చవిచూసింది. ధోనీసేన నాలుగో ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. గతేడాది చెత్త ప్రదర్శనతో విమర్శల పాలైన ఆ జట్టు తిరిగి అందరి ముందు విజేతగా నిలబడింది. ధోనీ తనలో నాయకత్వ సత్తా తగ్గలేదని చాటి చెప్పాడు.
Congratulations @ChennaiIPL! Don’t worry @KKRiders, we’re still 2 out of 3. Keep ur heads up!
— Gautam Gambhir (@GautamGambhir) October 15, 2021
Winning trophies & winning hearts! 🏆 💛
— IndianPremierLeague (@IPL) October 15, 2021
It's time to say good night from Dubai with 'Thala' @msdhoni's special message for the @ChennaiIPL fans after #CSK's title triumph. 👏 💛#VIVOIPL | #Final | #CSKvKKR pic.twitter.com/gqkJMEH0gl
SRH Vs PBKS Highlights: ఐపీఎల్‌ను ఓటమితో ముగించిన రైజర్స్ - ఐదు వికెట్లతో పంజాబ్ విజయం!
SRH Vs PBKS: తడబడ్డ సన్‌రైజర్స్ - పంజాబ్ ముందు ఈజీ టార్గెట్!
IPL 2022 Play Offs Schedule: ప్లేఆఫ్స్‌లో ఎవరితో ఎవరు తలపడుతున్నారు? మ్యాచ్‌లు ఎప్పుడు ?
SRH Vs PBKS Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ - ఎవరికీ ఉపయోగం లేని మ్యాచ్!
IND vs SA, T20 Series: టీ20 కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ - సఫారీ సిరీస్‌కు జట్టు ఎంపిక
CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్
Wild Poliovirus case : ఆఫ్రికాలో వైల్డ్ పోలియో వైరస్ కలవరం, 30 ఏళ్ల తర్వాత మొజాంబిక్ లో తొలి కేసు నమోదు!
Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్‌పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!
Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?