అన్వేషించండి

KTR: కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపం మార్చొద్దు - చరిత్ర చెరిపేస్తున్నారంటూ సీఎంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Telangana News: సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై కోపంతో చరిత్రను చెరిపేయాలని చూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అలా చేస్తే చరిత్ర క్షమించదని అన్నారు.

KTR Sensational Comments On CM Revanth Reddy: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) తెలంగాణ తల్లిని మూర్తీభవించిన స్త్రీగా రూపొందించారని.. ఆయనపై కోపంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారిస్తే చరిత్ర క్షమించదని కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన తెలంగాణ సాహితీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చరిత్రను చెరిపేసేందుకు యత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. నాడు ఇందిరాగాంధీ ప్రతిష్టించిన భరతమాత రూపాన్ని వాజ్‌పేయీ అధికారంలోకి రాగానే మార్చలేదని గుర్తు చేశారు. 'దేశంలో ఎన్నో చోట్ల అధికార మార్పిడి జరిగింది. తెలుగుతల్లి విగ్రహ రూపం మారలేదు. కన్నడమాత విగ్రహం రూపు మారలేదు. కానీ, ఈ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కోపంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. నాలుగేళ్ల తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిన స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. అధికారం ఉందని సాయుధ బలగాల నడుమ మీ నాటకాలు కొంతకాలం సాగుతాయి. కానీ, ఎల్లకాలం ఇదే పరిస్థితి ఉండదు.' అంటూ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.

'వాటిపై సీఎంకు మాట రాదు'

సింహాలు తమ గాథ చెప్పుకోకపోతే.. వేటగాళ్లు చెప్పే పిట్ట కథలే చరిత్రగా నిలిచిపోతాయనేది అక్షర సత్యమని కేటీఆర్ అన్నారు. 'యుద్ధంలో గెలిచిన వాడే పరాజితుల చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇదే తెలంగాణలో జరుగుతుంది. కేసీఆర్ హయాంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం గురించి సీఎంకు ఒక్క మాట రాదు. శ్వేతసౌధం లాంటి అంబేడ్కర్ సచివాలయం గురించి ఒక్క మాట రాదు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ గురించి ఒక్క మాట రాదు. ఈ పదేళ్లలో జరిగిన నిర్మాణాల గురించి సీఎంకు ఒక్క మాట రాదు. ఎందుకంటే పరాజితుల చరిత్రను చెరిపేయాలనే మూర్ఖపు నాయకులు ఉన్నారు. ఈ సీఎం తెలంగాణ తల్లి విగ్రహాన్ని పేదరికానికి, సమస్యలకు చిహ్నంగా ప్రతిష్టించాలని అనుకుంటున్నారు. కేసీఆర్ చేసిన పోరాటాన్ని రూపుమాపుతా అంటున్నారు. ఇది ఆమోదయోగ్యం కాదు.' అని కేటీఆర్ అన్నారు.

తమ పదేళ్ల పాలనలో బతుకమ్మ, బోనాల పండుగలను రాష్ట్ర పండుగలుగా జరుపుకొన్నామని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక మన చరిత్రను ఎలుగెత్తి చాటుకునే ప్రయత్నం చేశామని.. తాము పార్టీ నాయకుల పేర్లు పెట్టి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదని అన్నారు. తెలంగాణ చరిత్ర శాశ్వతంగా నిలవాలనే ప్రయత్నంతో.. కవులు, కళాకారులకు, సాహితీవేత్తలకు పెద్దపీట వేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు ఆయా ప్రాంతాల దేవుళ్ల పేర్లు పెట్టామన్నారు. కార్యక్షేత్రంలో ప్రతి రోజూ కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడుతోన్న బీఆర్ఎస్ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. మరో నాలుగేళ్లు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ రోజు తెలంగాణ భవన్ జనతా గ్యారేజీగా మారిందని.. హైడ్రా, మూసీ బాధితులతో పాటు పలువురు క్యూ కడుతున్నారని చెప్పారు.

Also Read: Hydra News: హైడ్రా కీలక నిర్ణయం, ఫిర్యాదులు తీసుకునేందుకు ఒకరోజు కేటాయించిన సంస్థ

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget