గోల్డెన్ టెంపుల్‌లో కాల్పుల కలకలం
అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో కాల్పుల కలకలం రేగింది. శిరోమణి అకాలీ దళ్ నేత సుక్‌బీర్ సింగ్ బాదల్‌పై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. సుక్‌బీర్ సింగ్ ఆలయ ఆవరణలో నిలబడి ఉండగా ఓ వ్యక్తి ఉన్నట్టుండి ముందుకు వచ్చి తుపాకీ గురి పెట్టాడు. చుట్టూ ఉన్న వాళ్లు వెంటనే అప్రమత్తమై...ఆ వ్యక్తిని అడ్డుకున్నారు. దీంతో తుపాకీ గురి తప్పింది. బులెట్ పైన గోడవైపు దూసుకెళ్లింది. తృటిలో సుక్‌బీర్‌కి ప్రాణాపాయం తప్పింది. నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే...సుక్‌బీర్ సింగ్ టెంపుల్ ఎంట్రెన్స్ వద్ద కాపలా కాస్తున్న సమయంలో ఈ కాల్పులు జరిగాయి. వీల్‌చైర్‌లో ఉన్న బాదల్‌పై దాడి చేసిన వ్యక్తిని నరైన్ సింగ్ చౌరాగా గుర్తించారు. 1984లోనే పాకిస్థాన్‌కి వెళ్లిన నరైన్ చౌరా...ఆయుధాల స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఒకప్పుడు పంజాబ్‌కి డిప్యుటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించిన సుక్‌బీర్ సింగ్ బాదల్‌కి ఇటీవలే జెడ్ ప్లస్ సెక్యూరిటీ అప్రూవ్ అయింది. ఆ మరుసటి రోజే ఇలా దాడి జరగడం సంచలనం సృష్టించింది.