అన్వేషించండి

Google Safety Engineering Centre: హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, కుదిరిన ఒప్పందం

Telangana CM Revanth Reddy Google Agreement | దిగ్గజ సంస్థ గూగుల్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ హైదరాబాద్‌లో నెలకొల్పనున్నారు.

Google Safety Engineering Centre GSEC in Hyderabad is first in India | తెలంగాణ ప్రభుత్వం దిగ్గజ సంస్థ గూగుల్ కంపెనీతో కీలక ఒప్పందం చేసుకుంది. తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ ముందుకొచ్చింది. దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (GSEC)ని హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు గూగుల్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. 

ఏషియా పసిఫిక్ జోన్లో రెండో సెంటర్

హైదరాబాద్ నగరంలో స్థాపించే సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రపంచంలోనే అయిదవది కాగా, ఏషియా పసిఫిక్ జోన్లో టోక్యో (Tokyo) తర్వాత ఏర్పాటు చేస్తున్న రెండో సెంటర్ కావడం విశేషం  గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (GSEC) అనేది ప్రత్యేకమైన అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ హబ్ (Global cyber security Hub).  ఈ సేఫ్టీ సెంటర్ అధునాతన భద్రతతో పాటు ఆన్‌లైన్ సేఫ్టీ ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 

Google Safety Engineering Centre: హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, కుదిరిన ఒప్పందం

అత్యాధునిక పరిశోధన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial intelligence) ఆధారిత భద్రత, సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు, రీసెర్చర్లకు ఈ సేఫ్టీ సెంటర్ సహకార వేదికగా మారనుంది. భారతదేశంలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించి, ఉపాధి పెంచడం, సైబర్‌ సెక్యూరిటీ సామర్థ్యాలు పెంపొందించాలన్న లక్ష్యంతో ఈ సేఫ్టీ సెంటర్ పని చేస్తుంది. ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా భారీ సంఖ్యలో ఉద్యోగులున్న గూగుల్ సంస్థ అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్ లో నిర్మిస్తోందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. 

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో గూగుల్ ఆఫీసుకు..

ఈ ఏడాది అక్టోబర్ 3న జరిగిన గూగుల్ ఫర్ ఇండియా 2024 (Google For India) కాన్‌క్లేవ్‌లోనే సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. అప్పటి నుంచి జీఎస్ఈసీని తమ రాష్ట్రంలోనే నెలకొల్పాలని, గూగుల్ పెట్టుబడులను ఆహ్వానించేందుకు దేశంలోని పలు రాష్ట్రాలు పోటీ పడ్డాయి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అమెరికా పర్యటనలో భాగంగా గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. దాంతో హైదరాబాద్‌లో ఈ అత్యాధునిక సెంటర్ ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపింది. 

సీఎం రేవంత్ నివాసంలో భేటీ

ఈ సేఫ్టీ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు గూగుల్ ముందుకు రావటం చాలా ఆనందంగా, గర్వంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గూగుల్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్య ఒప్పందం చేసుకోవటంతో హైదరాబాద్ మరోసారి ప్రపంచంలో మేటీ  ఐటీ, ఇన్నోవేషన్ హబ్‌గా అందరి దృష్టిని ఆకర్షిస్తుందన్నారు. గూగుల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాయల్ హాన్సెన్‌ అధ్వర్యంలోని కంపెనీ ప్రతినిధి బృందం బుధవారం జూబ్లీహిల్స్ లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు.  

డిజిటల్ స్కిల్ డెవలప్‌మెంట్‌లో తెలంగాణ  ముందంజలో ఉందని ఈ సందర్భంగా హాన్సెన్ అన్నారు. ‘ప్రపంచ వ్యాప్తంగా ఐటీ, ఐటీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అభివృద్ధికి హైదరాబాద్ కేంద్రంగా ఉంది. ఇప్పటికే ప్రపంచంలో అయిదు ఫేమస్ టెక్ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆపిల్, ఫేస్‌బుక్ ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు సేఫ్టీ సెంటర్ ద్వారా స్థాయిలో సైబర్ సేఫ్టీ సమస్యలను వేగంఆ పరిష్కరించే వీలుంటుంది. ఈ సెంటర్ ఏర్పాటుతో వేల సంఖ్యలో  ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని’ చెప్పారు.

Also Read: Harish Rao Quash Petition: హైకోర్టులో హ‌రీష్ రావు క్వాష్ పిటిష‌న్, అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని రిక్వెస్ట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Google Safety Engineering Centre: హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, కుదిరిన ఒప్పందం
హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, కుదిరిన ఒప్పందం
KTR: కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపం మార్చొద్దు - చరిత్ర చెరిపేస్తున్నారంటూ సీఎంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపం మార్చొద్దు - చరిత్ర చెరిపేస్తున్నారంటూ సీఎంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Balakrishna: మోక్షజ్ఞ మూడో సినిమా ఖరారు - బాలకృష్ణ క్లాసిక్ హిట్ ఫిల్మ్ సీక్వెల్‌లో...
మోక్షజ్ఞ మూడో సినిమా ఖరారు - బాలకృష్ణ క్లాసిక్ హిట్ ఫిల్మ్ సీక్వెల్‌లో...
Harish Rao Quash Petition: హైకోర్టులో హ‌రీష్ రావు క్వాష్ పిటిష‌న్, అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని రిక్వెస్ట్
హైకోర్టులో హ‌రీష్ రావు క్వాష్ పిటిష‌న్, అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని రిక్వెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గోల్డెన్ టెంపుల్‌లో కాల్పుల కలకలంతెలుగు రాష్ట్రాల్లో భూకంపం, గుబులు పుట్టిస్తున్న వీడియోలుPolice Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Google Safety Engineering Centre: హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, కుదిరిన ఒప్పందం
హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, కుదిరిన ఒప్పందం
KTR: కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపం మార్చొద్దు - చరిత్ర చెరిపేస్తున్నారంటూ సీఎంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపం మార్చొద్దు - చరిత్ర చెరిపేస్తున్నారంటూ సీఎంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Balakrishna: మోక్షజ్ఞ మూడో సినిమా ఖరారు - బాలకృష్ణ క్లాసిక్ హిట్ ఫిల్మ్ సీక్వెల్‌లో...
మోక్షజ్ఞ మూడో సినిమా ఖరారు - బాలకృష్ణ క్లాసిక్ హిట్ ఫిల్మ్ సీక్వెల్‌లో...
Harish Rao Quash Petition: హైకోర్టులో హ‌రీష్ రావు క్వాష్ పిటిష‌న్, అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని రిక్వెస్ట్
హైకోర్టులో హ‌రీష్ రావు క్వాష్ పిటిష‌న్, అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని రిక్వెస్ట్
Naga Chaitanya Fitness Routine : నాగచైతన్య డైట్ విషయంలో ఆ మిస్టేక్స్ అస్సలు చేయడట.. ఫిట్​నెస్ పాఠాలు చెప్తోన్న అక్కినేని అబ్బాయి
నాగచైతన్య డైట్ విషయంలో ఆ మిస్టేక్స్ అస్సలు చేయడట.. ఫిట్​నెస్ పాఠాలు చెప్తోన్న అక్కినేని అబ్బాయి
Kakinada Port Issue News: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పెను సంచలనం - కాకినాడ పోర్టు, సెజ్‌ అక్రమాలపై సీఐడీ విచారణ
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పెను సంచలనం - కాకినాడ పోర్టు, సెజ్‌ అక్రమాలపై సీఐడీ విచారణ
Earthquake In Hyderabad List: 50ఏళ్లలో  హైదరాబాద్ పరిధిలో ఏర్పడ్డ అతి పెద్ద భూకంపం ఇదే - ఇప్పటి వరకు వచ్చిన భారీ భూకంపాల లిస్ట్
50 ఏళ్లలో తెలంగాణలో వచ్చిన అతిపెద్ద భూకంపం ఇదే. ఇంతకు ముందు వచ్చింది ఎక్కడంటే..
RGV on Pushpa 2 Ticket Rates: తిండి, దుస్తులకన్నా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అవసరమా... ఇడ్లీ ఎగ్జాంపుల్‌తో 'పుష్ప 2' టికెట్ రేట్లపై ఆర్జీవి కౌంటర్
తిండి, దుస్తులకన్నా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అవసరమా... ఇడ్లీ ఎగ్జాంపుల్‌తో 'పుష్ప 2' టికెట్ రేట్లపై ఆర్జీవి కౌంటర్
Embed widget