Balakrishna: మోక్షజ్ఞ మూడో సినిమా ఖరారు - బాలకృష్ణ క్లాసిక్ హిట్ ఫిల్మ్ సీక్వెల్‌లో...
Nandamuri Mokshagna 3rd Movie: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ హీరోగా పరిచయం కానున్నారు. రెండో సినిమా వెంకీ అట్లూరితో చేస్తున్నారు. ఇప్పుడు మూడో సినిమా కూడా కన్ఫర్మ్ అయ్యింది.
నందమూరి నట వారసుడు, గాడ్ ఆఫ్ మాసెస్ - నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) అతి త్వరలో వెండితెరకు కథానాయకుడిగా పరిచయం కానున్న సంగతి తెలిసిందే. నందమూరి వారసురుడిని వెండితెరకు పరిచయం చేసే బాధ్యత 'హనుమాన్' చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ తీసుకున్నారు. రెండో సినిమా చేసే అవకాశం 'సార్', 'లక్కీ భాస్కర్' సినిమాలతో భారీ హిట్స్ అందుకున్న వెంకీ అట్లూరికి వచ్చింది. మూడో సినిమా కూడా కన్ఫర్మ్ అయ్యింది.
తండ్రి తనయులతో క్లాసిక్ హిట్ సీక్వెల్!
నందమూరి బాలకృష్ణ శతాధిక చిత్ర కథానాయకుడు. వందకు పైగా సినిమాలు ఆయన చేశారు. అందులో టాప్ ఫైవ్ సినిమాలు సెలెక్ట్ చేయమని అభిమానులు ఎవరినైనా కోరితే... వాళ్లు ఎంపిక చేసే సినిమాల్లో కచ్చితంగా ఆదిత్య 369 ఉంటుంది. హీరోగా బాలకృష్ణ ప్రయాణంలో అదొక మధురమైన జ్ఞాపకం.
'ఆదిత్య 369' సినిమాకు సీక్వెల్ చేయాలని నందమూరి బాలకృష్ణ కొంత కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఒకానొక దశలో 'ఆదిత్య 999 మ్యాక్స్' సినిమాతో తనయుడిని హీరోగా పరిచయం చేయాలని కూడా ఆయన భావించారు. సంగీతం శ్రీనివాసరావు 'ఆదిత్య 369' సినిమాకు దర్శకత్వం వహించగా... తన దర్శకత్వంలో 'ఆదిత్య 999 మ్యాక్స్' చేయాలని బాలకృష్ణ సంకల్పించారు.
కథానాయకుడిగా ఒక వైపు, హిందూపూర్ ఎమ్మెల్యేగా మరో వైపు, బసవతారకం ఆస్పత్రి బాధ్యతలు ఇంకో వైపు... బాలకృష్ణ బిజీ బిజీగా ఉంటున్నారు. అందువల్ల 'ఆదిత్య మ్యాక్స్ 999' స్క్రిప్ట్ వర్క్ అనుకున్న విధంగా ముందుకు జరగలేదు. కొంత ఆలస్యం అయ్యింది. ఈ తరుణంలో మోక్షజ్ఞ తేజను పరిచయం చేసే అవకాశం ప్రశాంత్ వర్మ అందుకోగా, తర్వాత సినిమా చేసే అవకాశం వెంకీ అట్లూరి తీసుకున్నారు. ఇప్పుడు మోక్షజ్ఞ తేజ మూడో సినిమాగా 'ఆదిత్య 999 మ్యాక్స్' తెరకెక్కుతోంది. తనయుడు మోక్షజ్ఞ తేజ హీరోగా 'ఆదిత్య 999 మ్యాక్స్' చేస్తున్నట్లు, లేటెస్ట్ టెక్నాలజీతో ఆ సినిమా తీయనున్నట్లు 'ఆహా అన్ స్టాపబుల్' షోలో బాలకృష్ణ తెలిపారు. ఆ సినిమా వచ్చే ఏడాది విడుదల చేసే అవకాశం ఉందన్నారు.
Also Read: నాగ చైతన్య - శోభిత పెళ్లికి వచ్చే అతిథులు వీళ్ళే - టాలీవుడ్ టాప్ స్టార్స్ ఎవరు వస్తున్నారంటే?
నవీన్ పోలిశెట్టి, శ్రీ లీల ఎపిసోడ్!
తెలుగులో టాప్ ఓటీటీ, ఇండియాలో హైయెస్ట్ ఐఎండిబి రేటింగ్ అందుకున్న టాక్ షోగా రికార్డులు క్రియేట్ చేసిన 'అన్ స్టాపబుల్' కార్యక్రమానికి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి అయ్యాయి నాలుగో సీజన్ ప్రస్తుతం నడుస్తోంది.
Jai Balayya, Jathiratnam oke stage meeda🔥
— ahavideoin (@ahavideoIN) December 2, 2024
Ee " leela" nu apedevarika!😍#UnstoppableWithNBK Season 4, Episode 6 premieres on Dec 6. #UnstoppableS4 #naveenpolishetty @sreeleela14 @NaveenPolishety #nandamuribalakrishna #Aha #Unstoppable #sreeleela pic.twitter.com/gbblHYovvp
'అన్ స్టాపబుల్ 4'లో ఇప్పటికి ఐదు ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అయ్యాయి. డిసెంబర్ 6 నుంచి ఆరో ఎపిసోడ్ మొదలు కానుంది. ఆ ఎపిసోడ్ లో బాలకృష్ణ 'ఆదిత్య 369' గెటప్ లో సందడి చేయనున్నారు. అందులో 'ఆదిత్య 999 మ్యాక్స్' గురించి మరిన్ని వివరాలు వెల్లడించారని ఆహా వర్గాలు తెలిపాయి. ఆ చిత్రానికి తానే దర్శకత్వం వహిస్తానని బాలకృష్ణ వెల్లడించారా? లేదా? దర్శకత్వ బాధ్యతలు మరొకరికి అప్పగిస్తారా? అనేది డిసెంబర్ 6న తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ కు నవీన్ పోలిశెట్టి, శ్రీ లీల వచ్చారు.
Also Read: దేవి శ్రీ ప్రసాద్ లేదా సామ్ సీఎస్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?