Naga Chaitanya Sobhita Dhulipala Wedding: నాగ చైతన్య - శోభిత పెళ్లికి వచ్చే అతిథులు వీళ్ళే - టాలీవుడ్ టాప్ స్టార్స్ ఎవరు వస్తున్నారంటే?
Naga Chaitanya Wedding Guest List: అక్కినేని నాగ చైతన్య, శోభితా ధూళిపాళ పెళ్లి వేడుకకు అన్నపూర్ణ స్టూడియోస్ ముస్తాబు అవుతోంది. మరి, ఈ పెళ్లికి వస్తున్న అతిథులు ఎవరో తెలుసా?
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) పెళ్లి సందడి మొదలైంది. తెలుగు అమ్మాయి, కథానాయిక శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala) మెడలో త్వరలో మూడు ముడులు వేయనున్నారు. ఈ జంట పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయ్యింది. మరి, ఈ పెళ్లికి ఎవరెవరు వస్తున్నారో తెలుసా? అక్కినేని ఇంట పెళ్లి అతిథులు ఎవరో తెలుసా?
మెగాస్టార్ మొదలుకుని స్టార్ హీరోల వరకు...
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అగ్ర కుటుంబాలు, హీరోలు చైతు - శోభిత పెళ్లికి హాజరు కానున్నారు. అక్కినేని, కొణిదెల కుటుంబాల మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున స్నేహం గురించి అందరికీ తెలిసిందే.
చైతు - శోభిత పెళ్లికి చిరంజీవితో పాటు ఆయన తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులు సైతం హాజరు కానున్నారు. నాగార్జునను మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఆప్యాయంగా 'బాబాయ్' అని పిలుస్తారు. తారక్ సైతం ఈ పెళ్లికి వస్తున్నారు. ఇంకా సూపర్ స్టార్ మహేష్ బాబు - ఉపాసన దంపతులు కూడా ఈ వివాహ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార - విఘ్నేష్ శివన్ దంపతులతో పాటు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పీవీ సింధు సైతం రానున్నారు.
View this post on Instagram
అతిథుల జాబితాలో ప్రభాస్, రాజమౌళి?
రెబల్ స్టార్ ప్రభాస్, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)కు సైతం ఆహ్వానాలు అందాయని తెలిసింది. మరి, అందులో ఎవరు ఎవరు వస్తారు? అనేది చూడాలి. 'పుష్ప 2' విడుదల హడావిడిలో ఉన్న బన్నీ వస్తారా? లేదా? అనేది చూడాలి.
Also Read: 'పుష్ప 2' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... అప్పుడు మగధీర, ఇప్పుడు పుష్ప 2 - అల్లు అరవింద్ ఏమన్నారంటే?
అక్కినేని ఫ్యామిలీతో పాటు దగ్గుబాటి ఫ్యామిలీ అంతా అటెండ్ కానున్నారు. చైతు మేనమామలు సురేష్ బాబు, వెంకటేష్, ఇంకా బావ రానా సహా పలువురు పెళ్లిలో సందడి చేయనున్నారు. ఆల్రెడీ పెళ్లి వేడుక దగ్గర సందడి మొదలైంది. పెళ్లి పనుల్లో అక్కినేని ఫ్యామిలీ బిజీగా ఉంది.