Pushpa 2 First Review: 'పుష్ప 2' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... అప్పుడు మగధీర, ఇప్పుడు పుష్ప 2 - అల్లు అరవింద్ ఏమన్నారంటే?
Allu Aravind On Pushpa 2: 'పుష్ప 2' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తండ్రి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సినిమా చూసిన తర్వాత ఏం జరిగిందో చెప్పారు.
'పుష్ప 2' విడుదలకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. టిక్కెట్లు బుక్ చేసుకోవడంలో అభిమానులు బిజీ బిజీగా ఉన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఫ్యాన్స్ మాత్రమే కాదు... ఈ సినిమా చూడాలని ఎంటైర్ ఇండియన్ ఆడియన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. మరి, ఈ సినిమా ఎలా ఉందో తెలుసా? దీనికి ఫస్ట్ రివ్యూ ఎవరి నుంచి వచ్చిందో తెలుసా?
అప్పుడు మగధీర...ఇప్పుడు పుష్ప 2 ది రూల్!
Allu Aravind Review On Pushpa 2: తండ్రి కుమారులు అల్లు అరవింద్, అల్లు అర్జున్, ఇంకా మెగా ఫ్యామిలీ మెంబర్ విద్య కొప్పినీడి కలసి కొన్ని రోజుల క్రితం 'పుష్ప 2' చూశారనే సంగతి తెలిసిందే. సినిమా చూశాక ఆయన సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు చాలా చాలా సంతోషించారని ఇండస్ట్రీలోని సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. ఆ మాట ఇప్పుడు మరోసారి అల్లు అరవింద్ నోటి నుంచి వచ్చింది.
''వారం రోజుల క్రితం నేను సినిమా చూశాను. ఇంటికి వెళ్ళిన తర్వాత కాసేపటికి మా ఆవిడ (నిర్మల) నా దగ్గుకు వచ్చింది. 'ఏంటి ముఖం అంత వెలిగపోతుంది?' అని అడిగింది. సినిమా చాలా బావుందని, నాకు నచ్చిందని చెప్పాను. ఇన్ని సంవత్సరాలలో నా ముఖం ఇంతిలా వెలగడం రెండు సార్లు చూశానని చెప్పింది. ఒకటి మగధీర ముందు... రెండు, ఇప్పుడు ఈ సినిమా 'పుష్ప 2' ముందు'' అని అల్లు అరవింద్ అన్నారు.
తన మేనల్లుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేసిన సినిమా 'మగధీర'. అప్పట్లో టాలీవుడ్ హైయెస్ట్ బడ్జెట్ సినిమా అది. ఇండస్ట్రీ హిట్ అందుకుంది. కలెక్షన్ల రికార్డులు తిరగా రాసింది. ఇప్పుడు పుష్ప సైతం అదే రీతిలో కలెక్షన్ల రికార్డులు తిరగ రాయడం గ్యారంటీ అని అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: "పీలింగ్స్" సాంగ్ పక్కా లోకల్... పాడింది ఈ పాపులర్ జానపద గాయకులే అని తెలుసా?
అల్లు అర్జున్ వైఫ్, సుకుమార్ వైఫ్ గురించి...
'పుష్ప 2' సినిమా ఇంత అద్భుతంగా రావడం వెనుక అల్లు అర్జున్ వైఫ్ స్నేహ, సుకుమారు వైఫ్ తబిత తోడ్పాటు కూడా ఉందని అల్లు అరవింద్ అన్నారు. అవార్డులు అన్నీ వాళ్లకు ఇచ్చేయాలని చెప్పారు. ఐదేళ్ల పాటు ఇద్దరు పాజిటివ్ పిచ్చోళ్ళను వదిలేశారని, హీరో దర్శకుడికి భార్యల నుంచి వచ్చిన సపోర్ట్ ఎంతో ఉంటుందని చెప్పుకొచ్చారు.
సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) గురించి అల్లు అరవింద్ గొప్పగా చెప్పారు. దేవికి 11 ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుంచి అతను తనకు తెలుసు అని, దేవి తండ్రి సత్యమూర్తి తనకు స్నేహితులు అని, ఆ కుర్రాడు ఇవాళ వరుసగా ఇన్ని హిట్లు ఎలా కొడుతున్నాడో అని అల్లు అరవింద్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ ఇండియాలోనే టాప్ ప్రొడక్షన్ హౌస్ అని నిర్మాతలు నవీన్ ఎర్నేని రవిశంకర్ ఎలమంచిలి సీఈవో చెర్రీలు ఇన్ని సినిమాలు ఎలా చేస్తున్నారో అని వాళ్లను అభినందించారు.
Also Read: పుష్ప 2 సెన్సార్ బోర్డు రివ్యూ... అల్లు అర్జున్ సినిమాలో హైలైట్స్ ఏంటో తెలుసా?
'పుష్ప 2' సినిమా హిట్ అవుతుందా? లేదా? అనే సందేహం ఎవరికీ లేదు. ఎంత భారీ విజయం సాధిస్తుంది? ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది? అని మాత్రమే ఆడియన్స్ చూస్తున్నారు. ఇండస్ట్రీ కూడా ఈ సినిమా మీద చాలా అంచనాలు పెట్టుకుంది. పాన్ ఇండియా స్థాయిలో మరోసారి తెలుగు సినిమా సత్తా చూపించేది 'పుష్ప 2' అని నమ్మకంగా ఉంది.