అన్వేషించండి

Pushpa 2 Censor Review: పుష్ప 2 సెన్సార్ బోర్డు రివ్యూ... అల్లు అర్జున్ సినిమాలో హైలైట్స్ ఏంటో తెలుసా?

Pushpa 3 Is Confirmed or Not?: 'పుష్ప 2' సెన్సార్ పూర్తి అయ్యింది. మరి, బోర్డు మెంబర్స్ ఇచ్చిన రివ్యూ, ఇంకా ల్యాబ్ రిపోర్ట్ ఏంటి? 'పుష్ప 3' ఉందా? లేదా? అనే వివరాలు తెలుసుకోండి.

Pushpa 2 Censor Report: 'పుష్ప 2' సెన్సార్ రివ్యూ వచ్చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి వచ్చిన రిపోర్ట్ ఎలా ఉంది? సినిమాలో హైలైట్స్ ఏం ఉన్నాయి? అనేది చూస్తే... 

జపాన్ ఎపిసోడ్‌తో 'పుష్ప 2' మొదలు!
'పుష్ప: ది రైజ్' ప్రారంభం గుర్తుందా? టైటిల్ కార్డుల్లో జపాన్ ప్రస్తావన ఉంటుంది. ఈ సారి జపాన్ ఎపిసోడ్‌తో 'పుష్ప 2: ది రూల్'ను ప్రారంభించారని సెన్సార్ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. నవంబర్ 28న (గురువారం) 'పుష్ప 2' సెన్సార్ పూర్తి అయ్యింది. యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. దాంతో సినిమా నిడివి 3 గంట‌ల 20 నిమిషాలు అనేది కూడా కన్ఫర్మ్ అయ్యింది.

ఆల్మోస్ట్ అరగంట జాత‌ర ఎపిసోడ్... కేక!
'పుష్ప: ది రూల్'లో జాతర ఎపిసోడ్ గురించి ముందు నుంచి యూనిట్ వర్గాలు చాలా గొప్పగా చెబుతున్నాయి. సెన్సార్ సభ్యులు సైతం ఆ ఎపిసోడ్ సూపర్ ఉందని చెప్పినట్టు సమాచారం. ఆల్మోస్ట్ 25 నిమిషాల నుంచి అరగంట పాటు సాగే ఆ ఎపిసోడ్ సినిమా మొత్తానికి హైలైట్ అవుతుందట. ప్రేక్షకులు పెట్టిన టికెట్ డబ్బులకు ఆ జాత‌ర ఎపిసోడ్ పైసా వ‌సూల్ అనిపిస్తుందట.

క్లైమాక్స్‌లో మాస్ అప్పీల్... మరి ఫ్యామిలీలకు?
మాస్ అప్పీల్‌తో సాగిన‌ 'పుష్ప 2' క్లైమాక్స్ ఫైట్‌ ఆడియన్స్ అందరికీ అడ్రినల్ రష్ ఇస్తుందని, ఆ యాక్షన్ సీక్వెన్సులో విలన్ కాళ్లూ చేతులు హీరో నరికే సన్నివేశాలు ఉంటాయని తెలిసింది. అక్కడ రక్తపాతం బి, సి సెంటర్ ప్రేక్షకులకు - నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి ప్రాంతాల్లో మాస్ జనాలను బాగా నచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

Also Read: పుష్పరాజ్ రక్తపాతానికి సెన్సార్ కత్తెర... అల్లు అర్జున్ 'పుష్ప 2'లో డిలీట్ చేసిన సీన్స్ లిస్ట్ ఇదిగో

'పుష్ప 2'లో యాక్షన్ డోస్ ఎక్కువ ఉన్నప్పటికీ... అల్లు అర్జున్, రష్మిక మధ్య సీన్లు కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా సుకుమార్ తీశారట. పుష్పరాజ్ - శ్రీ‌వ‌ల్లి మ‌ధ్య ఎమోష‌నల్ బాండింగ్ - ఆ సీన్లు కుటుంబ ప్రేక్ష‌కుల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డం ఖాయంగా క‌నిపిస్తోందని అంటున్నారు. 


పుష్ప 3 ఉందని చెప్పారు! కానీ... నో విజువల్స్!
'పుష్ప 1: ది రైజ్'ను మించి 'పుష్ప 2: ది రూల్' ఘన విజ‌యాన్ని సాధిస్తుంద‌ని ఆల్రెడీ సినిమా చూసిన జనాలు చెబుతున్నారట. అంతే కాదు... 'పుష్ప 2'కు సీక్వెల్ కూడా ఉందట. 'పుష్ప 2: ది రూల్' ఎండింగ్ తర్వాత 'పుష్ప 3' గురించి చెప్పారట. జస్ట్ టైటిల్ కార్డు మాత్రమే వేసి ఊరుకున్నారట. అప్పుడు వీడియో గ్లింప్స్ లేదా విజువల్స్ వంటివి ఏమీ లేవట.

Also Readదేవకీ నందన వాసుదేవ రివ్యూ: మహేష్ బాబు మేనల్లుడు అశోక్ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడానికి కారణాలు ఏంటి?


డిసెంబర్ 4న అమెరికాలో, డిసెంబర్ 5న ఇండియాలో థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్. ఇందులో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, కన్నడ స్టార్ డాలీ ధనుంజయ, టాలీవుడ్ సీనియర్ స్టార్ జగపతి బాబు, ఇంకా సునీల్, అనసూయ భరద్వాజ్, జగదీశ్ ప్రతాప్ బండారి తదితరులు నటించారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ స్వరకర్త.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Hyderabad Old City: మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
Bangladesh squad for T20 world cup: టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
Embed widget