అన్వేషించండి

Pushpa 2 Censor: పుష్పరాజ్ రక్తపాతానికి సెన్సార్ కత్తెర... అల్లు అర్జున్ 'పుష్ప 2'లో డిలీట్ చేసిన సీన్స్ లిస్ట్ ఇదిగో

Pushpa 2 Censor Certificate: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా సెన్సార్ పూర్తి అయ్యింది. సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ లభించింది. మరి, ఈ సినిమాలో ఏయే సీన్లకు సెన్సార్ కత్తెర పడిందో తెలుసా?

Pushpa 2 Censor Cuts: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఆందోళనకు తెర పడింది. ఓ వైపు తమ హీరో దేశంలోని వివిధ నగరాలు తిరుగుతూ ప్రచారం చేస్తుంటే... మరోవైపు ఇంకా సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడం కాస్త కలర్ పెట్టింది. డే అండ్ నైట్ వర్క్ చేసిన సుకుమార్ 'పుష్ప 2' సినిమా ఫైనల్ కాపీ రెడీ చేశారు. ఇవాళ సెన్సార్ కూడా పూర్తి అయింది.‌ 

పుష్పరాజ్ నరకుడుకు సెన్సార్ కత్తెర!
'పుష్ప 2' చిత్రానికి సెన్సార్ బోర్డ్ యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే అది ఇవ్వడానికి ముందు సినిమాలో మూడు పదాలను పూర్తిగా మార్చమని సూచించింది. రెండు సన్నివేశాలలో హీరో వీరోచిత పోరాటానికి కత్తెర వేసింది. ఆ వివరాల్లోకి వెళితే...

పుష్ప సీక్వెల్ వచ్చేసరికి సుకుమార్ యాక్షన్ డోస్ బాగా పెంచారని ముందు నుంచి ఫిలిం నగర్ వర్గాల నుంచి వినపడుతోంది.‌ ఈ‌ రోజు సెన్సార్ సూచించిన కత్తెరలు కూడా అది నిజమేనని మరోసారి అనుకోక తప్పదు. ఓ సన్నివేశంలో పుష్పరాజ్ నరికిన కాళ్లు గాల్లో ఎగురుతూ ఉంటుందట. దానిని తొలగించమని సెన్సార్ సూచన చేయగా... సీజీతో కవర్ చేసేశారు. మరొక సన్నివేశంలో విలన్ చెయ్యి నరికి దాన్ని పట్టుకుని హీరో వెళతాడట. అది కూడా తీయమని సెన్సార్ చెప్పింది. దాంతో కట్ అయిన పార్ట్ చూపించకుండా సన్నివేశాన్ని జూమ్ చేశారు. ఈ రెండు కత్తెరలు‌ క్లైమాక్స్ యాక్షన్స్ సీక్వెన్స్ లో వచ్చాయి.

సెన్సార్ తొలగించమని చెప్పిన పదాల విషయానికి వస్తే... 'పుష్ప 2' ప్రారంభంలో 'రండి' అని ఒక పదం ఉంది. తెలుగులో రండి అంటే గౌరవం. కానీ హిందీలో మహిళను వేశ్య అని కించపరచడం. ఆ పదం పట్ల సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేయగా 'లపాకీ' అని మార్చారు.‌ అదే సన్నివేశంలో మరొక బూతు మాటకు కత్తెర వేశారు. ఇంకొక సన్నివేశంలో 'వెంకటేశ్వర' అని వచ్చే డైలాగులో 'భగవంతుడా...' అని మార్చారు. ఈ ఐదు కత్తెరలు తప్ప ఇంకేమీ సెన్సార్ చెప్పలేదు.

Also Readదేవకీ నందన వాసుదేవ రివ్యూ: మహేష్ బాబు మేనల్లుడు అశోక్ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడానికి కారణాలు ఏంటి?

థియేటర్లలో ప్రేక్షకులు ఎన్ని గంటలకు కూర్చోవాలి?
'పుష్ప 2' రన్ టైం మూడు గంటల కంటే ఎక్కువ. మైత్రి మూవీ మేకర్స్ అధినేతలలో ఒకరైన నవీన్ ఎర్నేని ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. తమ సినిమా మూడు గంటల 20 నిమిషాలు ఉంటుందని చెప్పారు.‌ సెన్సార్ సర్టిఫికెట్ చూసినా అదే రన్ టైం ఉంది. 200 నిమిషాల సినిమా ఇది.

థియేటర్లలో ప్రేక్షకులు ఎలా లేదన్న మూడున్నర గంటలు కూర్చుని చూడాల్సిన సినిమా. అల్లు అర్జున్, సుకుమార్ కలిసి అంతసేపు ప్రేక్షకులను ఎలా కూర్చోబెడతారు అనేది చూడాలి. ఒక్కటే సినిమా ముందున్న టఫ్ టాస్క్. ఆల్రెడీ సినిమాపై ఉన్న అంచనాలను చూస్తే మొదటి రోజు భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉంది.

Also Read: రోహిణి దెబ్బకు మారిన బిగ్ బాస్ లెక్కలు... శివంగిలా ఆడుతూ టాప్ 5 లిస్టులోకి Jabardasth లేడీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy - Tollywood: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Heart Attack: క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy - Tollywood: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Heart Attack: క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
Errolla Srinivas: బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ - తీవ్ర ఉద్రిక్తత, పోలీస్ రాజ్యమంటూ హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం
బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ - తీవ్ర ఉద్రిక్తత, పోలీస్ రాజ్యమంటూ హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం
Nandyal  News:   కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య -  వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య - వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Deadbody Parcel: 'చేప దొరికిందా?' - శవం దొరకలేదని అమాయకున్ని చంపేశారా?, చెక్క పెట్టెలో డెడ్ బాడీ వెనుక అంతుచిక్కని ప్రశ్నలెన్నో?
'చేప దొరికిందా?' - శవం దొరకలేదని అమాయకున్ని చంపేశారా?, చెక్క పెట్టెలో డెడ్ బాడీ వెనుక అంతుచిక్కని ప్రశ్నలెన్నో?
Embed widget