Peelings Song : "పీలింగ్స్" సాంగ్ పక్కా లోకల్... పాడింది ఈ పాపులర్ జానపద గాయకులే అని తెలుసా?
Pushpa 2 : 'పుష్ప 2' నుంచి "పీలింగ్స్" సాంగ్ ఆదివారం రోజు రిలీజ్ అయ్యింది. అయితే ఈ సాంగ్ ను పాడింది ఈ పాపులర్ జానపద గాయకులే అన్న విషయం మీకు తెలుసా?
Peelings song from Pushpa 2 The Rule : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ 'పుష్ప 2 : ది రూల్". ఈ సినిమాలోని ఫీలింగ్స్ అనే కొత్త పాటను ఆదివారం రోజు మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో అల్లు అర్జున్, రష్మిక మందన్న మాస్ స్టెప్పులతో ఇరగదీశారు. అయితే సాధారణంగా పాన్ ఇండియా సినిమా అనగానే అదే రేంజ్ ఉన్న సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఈ సినిమాకు పాడడం, మ్యూజిక్ అందించడం వంటివి చేస్తూ ఉంటారు. కానీ సుకుమార్ మాత్రం పక్కా లోకల్ అంటూ ఈ పాన్ ఇండియా సినిమాలో 'పీలింగ్స్' పాటలో తెలుగు వాళ్లకే ఛాన్స్ ఇవ్వడం విశేషం.
డిసెంబర్ 5న 'పుష్ప 2' మూవీ తెలుగుతో పాటు హిందీ, మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతోంది. బ్లాక్ బస్టర్ హిట్ 'పుష్ప'కు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న, ఫాహద్ ఫాజిల్, సునీల్ వంటి నటీనటులంతా మరోసారి కనిపించబోతున్నారు. ఇక మూవీ రిలీజ్ కు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ వదులుతూ, జోరుగా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు చిత్ర బృందం. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ దక్కింది. అయితే కొద్దిరోజుల క్రితం రిలీజ్ చేసిన 'పీలింగ్స్' పాట ప్రోమో మాత్రం పూనకాలు తెప్పించింది.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ ఫుల్ సాంగ్ ను ఆదివారం రిలీజ్ చేశారు. ముందు మలయాళ లిరిక్స్ తో మొదలైన ఈ పాట ఆ తర్వాత తెలుగులోనే కంటిన్యూ అయింది. ఈ పాటకి దేవిశ్రీ ప్రసాద్ మాస్ మ్యూజిక్ అందించగా, చంద్రబోస్ రాసిన లిరిక్స్ అదిరిపోయాయి. ఇక ఈ పాటను పాడింది ఎవరో కాదు శంకర్ బాబు కందుకూరి, లక్ష్మీ దాస అనే జానపద సింగర్స్. వీళ్ళ గురించి మూవీ లవర్స్ కి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ తెలుగు స్టేట్స్ లో ఉండి జానపద పాటలను ఇష్టపడే వారికీ మాత్రం ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఇప్పటిదాకా ఎన్నో పాటలు పాడి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ జానపద సింగర్స్ ఇప్పుడు ఏకంగా 'పుష్ప 2' లాంటి పాన్ ఇండియా సినిమాలో పాట పాడే అవకాశాన్ని దక్కించుకోవడం ప్రత్యేకమనే చెప్పాలి. ముఖ్యంగా లక్ష్మీ 'నిన్నాడేమన్నంటినా తిరుపతి' అనే పాటతో బాగా పాపులర్ అయ్యింది. ఆ తరువాత వీరిద్దరూ పలు బోనాలు. భక్తి పాటలు కూడా పాడారు.
View this post on Instagram
View this post on Instagram
ఇక సుకుమార్ పాన్ వరల్డ్ తీసినా సరే లోకల్ టాలెంట్ ని మాత్రం మర్చిపోవట్లేదు. అది 'పుష్ప' సినిమాకు మరింత ప్లస్ పాయింట్ అవుతుంది. గతంలోనూ 'పుష్ప' సినిమాలో 'ఊ అంటావా' అనే ఐటమ్ సాంగ్ ఊపేసిన సంగతి తెలిసిందే. ఈ పాటలో సమంత, అల్లు అర్జున్ ఎంత స్పెషల్ గా నిలిచారో, ఆ పాట పాడిన వాయిస్ కూడా అంతకంటే ఎక్కువగానే ఆకట్టుకుంది. ఆ పాటని మంగ్లీ సోదరి, ఇంద్రవతి చౌహన్ పాడి అందర్నీ మత్తులో ముంచేసింది. ఇక ఇప్పుడు 'పీలింగ్స్' పాటని కూడా తెలుగు జానపద సింగర్స్ శంకర్ బాబు కందుకూరి, లక్ష్మీ దాస పాడి అల్లు అర్జున్, రష్మిక మందన్న రేంజ్ లో హైలైట్ గా నిలిచారు. మరి ఇప్పటికైనా వీళ్ళకి ఇలా సినిమాలలో పాడే ఛాన్స్ లు ఊపందుకుంటాయేమో చూడాలి.