Akhanda 2 Success Meet: అమరావతిలో 'అఖండ 2' సక్సెస్ మీట్... ఎప్పుడంటే - పవన్ వస్తారా?
Akhanda 2 Thaandavam Latest Update: 'అఖండ 2 తాండవం' విజయంపై గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను సంతోషం వ్యక్తం చేశారు. ఏపీలో ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహిస్తున్నారు.

Balakrishna's Akhanda 2 Thaandavam Success Meet Update: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణతో పాటు దర్శకుడు బోయపాటి శ్రీను సైతం 'అఖండ 2 తాండవం' విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సిటీలో 'అఖండ 2' బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఇప్పుడు ఏపీలోనూ ఓ సక్సెస్ మీట్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.
అమరావతిలో 'అఖండ 2' సక్సెస్ మీట్
Akhanda 2 success meet - Amaravathi: అమరావతిలో 'అఖండ 2 తాండవం' సక్సెస్ మీట్ నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 18న... అంటే గురువారం ఏపీ రాజధానిలో సక్సెస్ మీట్ జరుగుతుందని తెలిసింది.
Also Read: Jai Akhanda: 'జై అఖండ'కు కొత్త నిర్మాతలు... 14 రీల్స్ ప్లస్ నుంచి మరొకరికి!
ఏపీ ప్రభుత్వంలో పెద్దలు కొందరు అమరావతిలో 'అఖండ 2' సక్సెస్ మీట్‌కు అటెండ్ అయ్యే అవకాశం ఉంది. సనాతన ధర్మం నేపథ్యంలో ఈ సినిమా రూపొందిన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తే బావుంటుందని కొందరి ఆలోచన. మరి వర్కవుట్ అవుతుందో? లేదో? వెయిట్ అండ్ సి.
వీకెండ్ తర్వాత వసూళ్లు కొంత తగ్గినా?
'అఖండ 2 తాండవం'కు ప్రీమియర్స్ నుంచి మంచి టాక్ వచ్చింది. మొదటి రోజు భారీ వసూళ్లు వచ్చాయి. బాక్స్ ఆఫీస్ బరిలో 60 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత కూడా మంచి వసూళ్లు వచ్చాయి. అయితే వీకెండ్ తర్వాత కొంత తగ్గాయి. సాధారణంగా ఏ సినిమాకు అయినా సరే సోమవారం నుంచి వసూళ్లు తగ్గుతాయి. అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రేక్షకుల నుంచి సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది.
'సింహ', 'లెజెండ్', 'అఖండ' తర్వాత 'అఖండ 2 తాండవం'తో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో మరో బ్లాక్ బస్టర్ వచ్చింది. డబుల్ హ్యాట్రిక్ సినిమాకు శ్రీకారం చుట్టారు. దీని తర్వాత 'జై అఖండ' చేయనున్నారు. అది ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది? అనేది తెలియాల్సి ఉంది.





















