By: ABP Desam | Published : 18 Oct 2021 11:35 PM (IST)|Updated : 18 Oct 2021 11:35 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
భారీ షాట్ ఆడుతున్న ఇషాన్ కిషన్(Source: BCCI Twitter)
ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ మొదటి వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం ఓపెనర్లు చెలరేగి ఆడటంతో భారత్ ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది.
భారీ స్కోరే చేసిన ఇంగ్లండ్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు జేసన్ రాయ్ (17: 13 బంతుల్లో, రెండు ఫోర్లు), జోస్ బట్లర్ (18: 13 బంతుల్లో, మూడు ఫోర్లు) వేగవంతమైన ప్రారంభాన్ని అందించారు. మొదటి వికెట్‌కు 36 పరుగులు జోడించిన అనంతరం జోస్ బట్లర్ అవుటయ్యాడు. పవర్ ప్లే చివరి ఓవర్‌లో మరో ఓపెనర్ జేసన్ రాయ్ కూడా అవుటవ్వడంతో ఆరు ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. ఆ తర్వాత డేవిడ్ మలన్(18: 18 బంతుల్లో, మూడు ఫోర్లు), జానీ బెయిర్‌స్టో(49: 36 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 30 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్ పదో ఓవర్లో డేవిడ్ మలన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో పది ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ మూడు వికెట్లు నష్టపోయి 79 పరుగులు చేసింది.
పది ఓవర్లు ముగిసిన అనంతరం ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ మరింత చెలరేగి ఆడారు. మొదట లియామ్ లివింగ్ స్టోన్(30: 20 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), చివర్లో మొయిన్ అలీ (43: 20 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటంతో ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 188 పరుగులు చేసింది.
భారత బౌలర్లలో షమీ మూడు వికెట్లు తీయగా.. బుమ్రా, రాహుల్ చాహర్ చెరో వికెట్ తీశారు. భువనేశ్వర్ నాలుగు ఓవర్లలో ఏకంగా 54 పరుగులు సమర్పించుకున్నాడు. షమీ 40 పరుగులు, రాహుల్ చాహర్ 43 పరుగులు ఇచ్చారు. ఒక్క వికెట్ కూడా తీయకపోయినా.. అశ్విన్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చాడు. బుమ్రా కూడా 26 పరుగులే ఇచ్చాడు.
అదరగొట్టిన ఓపెనర్లు
189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు లోకేష్ రాహుల్ (51: 24 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు), ఇషాన్ కిషన్ (70: 46 బంతుల్లో, ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు) చెలరేగి ఆడారు. మొదటి వికెట్‌కు 82 పరుగులు జోడించిన అనంతరం లోకేష్ రాహుల్ అవుటయ్యాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ గేర్ మార్చాడు. ఆదిల్ రషీద్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో ఇషాన్ కిషన్ రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టడంతో ఏకంగా 22 పరుగులు వచ్చాయి.
అయితే విరాట్ కోహ్లీ (11: 13 బంతుల్లో) ఈ మ్యాచ్‌లో కూడా విఫలం అయ్యాడు. తర్వాత ఇషాన్ కిషన్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. దీంతో స్కోరింగ్ రేటు కాస్త మందగించింది. సూర్యకుమార్ యాదవ్ (8: 9 బంతుల్లో, ఒక ఫోర్) విఫలం అయినా.. హార్దిక్(12: 10 బంతుల్లో, రెండు ఫోర్లు)తో కలిసి పంత్ (29: 14 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లు) పని ముగించాడు. 19 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి భారత్ 192 పరుగులు చేసి, ఏడు వికెట్లతో విజయం సాధించింది.
Also Read: ఐపీఎల్ ఫైనల్ ముందు ధోనీ నేర్పిన వ్యాపార పాఠమిది! ప్రశంసించిన ఆనంద్ మహీంద్రా
Also Read: టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఇదే.. ఈ ఐపీఎల్‌లో ఎంతమంది హిట్ అయ్యారో తెలుసా?
CSK Worst Record: ఐపీఎల్‌లో చెన్నై చెత్త రికార్డు - 15 సీజన్లలో ఏ జట్టూ చేయని ఘోరమైన ప్రదర్శన!
Amalapuram Celebrations: తొలిసారి థామస్ కప్ నెగ్గిన భారత్, ఏపీలోని అమలాపురంలో సంబరాలు - ఎందుకంటే !
LSG Vs RR: లక్నోపై రాజస్తాన్ ఘనవిజయం - రెండో స్థానానికి రాయల్స్ - పోటీ ఇవ్వలేకపోయిన సూపర్ జెయింట్స్!
LSG Vs RR: సమిష్టిగా రాణించిన రాజస్తాన్ బ్యాటర్లు - ఒక్క అర్థ సెంచరీ లేకుండా భారీ స్కోరు - లక్నో టార్గెట్ ఎంతంటే?
CSK Vs GT Result: టేబుల్ టాప్ దిశగా గుజరాత్ - చెన్నై ఏడు వికెట్లతో ఘనవిజయం!
YSRCP Rajyasabha : బీజేపీ చాయిస్‌గా ఓ రాజ్యసభ సీటు - వైఎస్ఆర్సీపీ ఆఫర్ ఇచ్చిందా ?
Karate Kalyani Notice : ఆ చిన్నారి ఎవరు? కరాటే కళ్యాణి నుంచి నో రిప్లై, మరోసారి నోటీసులు!
Covid 19 in North Korea: కిమ్ రాజ్యంలో కరోనా వైరస్ వీరవిహారం- 10 లక్షలకు పైగా కేసులు!
Diabetes: డయాబెటిస్ ఉంటే మటన్ తినకూడదంటారు, ఎందుకు?