Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
TG TET 2024 Exam Hall Tickets | తెలంగాణలో టెట్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదలైంది.రాష్ట్ర విద్యాశాఖ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే వారం నుంచి హాల్ టికెట్లు అన్‌లైన్లో అందుబాటులో ఉండనున్నాయి.
TET exam schedule released in Telangana | హైదరాబాద్: టెట్ అభ్యర్థులకు ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది. తెలంగాణలో టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలైంది. టెట్ పరీక్షలు జనవరి 2 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం టెట్ దరఖాస్తు ఫీజును ఈసారి తగ్గించిన విషయం తెలిసిందే. గతంలో టెట్ పరీక్షలకు ఒక పేపర్‌కు రూ.1000, రెండు పేపర్లు రాసేవారు రూ.2000 చెల్లించాల్సి వచ్చేది. అయితే ఈసారి ఫీజును రూ.750కి తగ్గించారు. ఒక పేపర్ రాసేవారు రూ.750 చెల్లించాల్సి ఉండగా, 2 పేపర్లు రాసేవారు రూ.1000 చెల్లించారు.
గతంతో పోల్చితే భారీగా తగ్గిన దరఖాస్తులు
TG TET 2024 Exam Admit Cards: డిసెంబర్ 26వ తేదీ నుంచి తెలంగాణ టెట్ హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. టీచర్ జాబ్స్ కోసం చూస్తున్న అభ్యర్థుల కోసం నిర్వహించే టెట్ పరీక్షలకు ఈసారి 2 లక్షలకు పైగా దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. ముందుగా జనవరి 1 నుంచి టెట్ పరీక్షలు 2025 ప్రారంభం అవుతాయి అని అంతా అనుకున్నారు. తాజాగా టెట్ పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ విడుదల చేసింది. గతంతో పోల్చితే టెట్ ఎగ్జామ్ పై ఆసక్తి తగ్గుతోంది. గత నోటిఫికేషన్లతో పోల్చితే ఈసారి దరఖాస్తులు భారీగా తగ్గాయి.
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TGTET)-2024 కోసం దరఖాస్తుల గడువు నవంబర్ 20తో ముగిసింది. దరఖాస్తులలో ఏమైనా తప్పిదాలు దొర్లితే వాటిని సరిదిద్దుకునేందుకు నవంబర్ 22 వరకు గడువు ఇచ్చారు. పేపర్-1కు 39,741 మంది, పేపర్-2కు 75,712 మంది అభ్యర్థులు మొదట దరఖాస్తు చేసుకున్నారు. తరువాత మరో అరవై వేల వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. అభ్యర్థులు www.schooledu.telagana.gov.in. వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు గతంలో సూచించారు.
టెట్‌లో 2 పేపర్లు ఉండగా.. పేపర్-1 సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT Posts)గా నియామకం, పేపర్-2 ద్వారా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత సాధించేందుకు నిర్వహిస్తారు. పేపర్-1కు సంబంధించి 1-8 తరగతులు సిలబస్, పేపర్-2 అభ్యర్థులకు 6-10 తరగతుల స్టాండర్డ్‌తో ఎగ్జామ్‌లో ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపర్ 150 మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కో ఎగ్జామ్‌కు రెండున్నర గంటల సమయం ఇస్తారు. ఒక్కసారి టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే డీఎస్సీ రాసుకునేందుకు జీవితకాల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా టెట్‌లో ఎక్కువ స్కోర్ చేస్తే, అది డీఎస్సీలో వెయిటేజీగా యాడ్ అవుతుంది.
Also Read: NIACL: న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో 500 అసిస్టెంట్ పోస్టులు, వివరాలు ఇలా
త్వరలో తెలంగాణ టెట్ హాల్ టికెట్లు అందుబాటులోకి
అభ్యర్థులు https://tstet2024.aptonline.in/tstet/ వెబ్‌సైట్ లేక www.schooledu.telagana.gov.in. లోకి వెళ్లాలి. అందులోని హోం పేజీలో డౌన్‌లోడ్ హాల్ టికెట్ అని ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేసిన తరువాత మీ రిజిస్ట్రేషన్ వివరాలు, బర్త్‌డే వివరాలు ఎంటర్ చేయాలి. సబ్మిట్ చేసిన వెంటనే మీ హాల్ టికెట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అది డౌన్‌లోడ్ చేసుకుని ప్రింటౌట్ తీసుకోవాలి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు టెట్ హాల్ టికెట్లో ఉన్న నియమ, నిబంధనలు తప్పక పాటించాలి. డిసెంబర్ 25, లేక 26 తేదీలలో తెలంగాణ టెట్ ఎగ్జామ్ హాల్ టికెట్లు విడుదల కానున్నాయి. ఫిబ్రవరి నెలలో టెట్ తుది ఫలితాలు ప్రకటిస్తామని ప్రభుత్వం చెబుతోంది.