Virat Kohli: 2 దశాబ్దాల సచిన్ రికార్డు బద్దలు, ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన కోహ్లీ
ODI World Cup 2023: వాంఖడే వేదికగా మరో అద్భుతం సాకారమైంది. ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ రికార్డుల మీద రికార్డులు సృష్టించాడు.
Virat Kohli Creates History: వాంఖడే వేదికగా మరో అద్భుతం సాకారమైంది. ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ రికార్డుల మీద రికార్డులు సృష్టించాడు. క్రికెట్ గాడ్, తన ఆరాధ్య ధైవం సచిన్ టెండూల్కర్ ఎదుటే.. అతని మైదానంలోనే రెండు దశాబ్దాలుగా తన పేరిట ఉన్న రికార్డును విరాట్ బద్దలు కొట్టేశాడు. 2011 ప్రపంచకప్‌ను టీమిండియా సగర్వంగా అందుకున్న చోటే.. క్రికెట్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని రికార్డు కింగ్ కోహ్లి వశమైంది. ముందుగా వన్డేల్లో సచిన్ 50వ శతకం రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ... ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే ప్రపంచకప్ 2003లో క్రికెట్ గాడ్ 673 పరుగలు చేయగా... భారత్ వేదికగా 2023 ప్రపంచకప్‌లో ఈ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ప్రపంచకప్‌లో మొత్తం 10 ఇన్నింగ్స్‌ల్లోనే కోహ్లీ 711 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. ఆడిన పది ఇన్నింగ్సుల్లో విరాట్ మూడు సెంచరీలు, అయిదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ ప్రపంచకప్‌లో భీకర ఫామ్‌లో ఉన్న విరాట్ ఇప్పటికే 711 పరుగులు చేసి సత్తా చాటాడు. సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో 117 పరుగులు చేసి సత్తా చాటాడు.