అన్వేషించండి

Top Headlines Weekly: బండి సంజయ్ అరెస్టు నుంచి మోదీ టూర్‌ వరకు వీక్లీ టాప్ హెడ్‌లైన్స్‌ ఇవే

Top Headlines Weekly: ఏప్రిల్‌ 2, 2023 నుంచి ఏప్రిల్‌ 8, 2023 వరకు తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా చాలా పరిణామాలు జరిగాయి. అన్నింటిని సంక్షిప్తంగా మీకోసం అందిస్తోంది ఏబీపీ దేశం.

ప్రతీకాత్మక చిత్రం

1/9
తెలంగాణలో టెన్త్ పరీక్ష లీకేజ్ కలకలం రేపింది. ఈ కేసులో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌తోపాటు పలువురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. బండి సంజయ్‌ను మంగళవారం అర్థరాత్రి అరెస్టు చేశారు. లీక్  కేసులో ఏ వన్‌గా ఉన్న బండి సంజ‌య్‌కు హన్మకొండలో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 8 గంటల సుదీర్ఘ విచారణ అనంతరం ఇద్దరు వ్యక్తుల హామీ, రూ.20 వేల పూచీకత్తుతో కండిషనల్ బెయిల్ ఇచ్చింది. శుక్రవారం ఉదయం విడుదలైన ఆయన కేసీఆర్ ఫ్యామిలీ, తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్, కవిత అరెస్టు తప్పదని హెచ్చరించారు.

2/9
ఏప్రిల్ 8వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రానున్నారు. సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడవనున్న వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించబోతున్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రధాని మోదీ బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 11.35కు రోడ్డు మార్గంలో బేగంపేట నుంచి సికింద్రాబాద్ కు బయలుదేరతారు. ఉదయం 11.45 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. 11.45 నుంచి 11.47 వరకు రైల్వే అధికారులు ప్రధానికి ఘన స్వాగతం పలుకుతారు. 11.47 నుంచి 11.55 వరకు సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఫస్ట్ కోచ్ ను పరిశీలిస్తారు. అదే కోచ్ లో ఉండనున్న చిన్నారులతో మోదీ సరదాగా ముచ్చటించనున్నారు. 11.55 నుండి 12 గంటల మధ్యలో సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడిచే వందే భారత్ రైలుకు జెండా ఊపి ప్రారంభిస్తారు.

3/9
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. 39 మందిని ఐపీఎస్‌ అధికారులను, 57 మంది ఐఏఎస్ లను బదిలీ చేసింది. కొన్ని జిల్లాలకు కొత్త కలెక్టర్ల, ఎస్పీలను నియమించింది. గురువారం, శుక్రవారాల్లో అర్ధరాత్రి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

4/9
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్య‌మంత్రిగా పని చేసిన న‌ల్లారి కిరణ్ కుమార్ రెడ్డి  బీజేపీలో చేరారు. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధినాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తాను ఎప్పుడూ కాంగ్రెస్ వీడుతానని అనుకోలేదన్నారు. కాంగ్రెస్ చేసిన పొరపాటు నిర్ణయాలు కారణంగా ఆంధ్రప్రదేశ్ విడిపోయిందన్నారు కిరణ్‌కుమార్ రెడ్డి. దాని వల్ల ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పూర్తిగా నాశనమైందని అభిప్రాయపడ్డారు. కనీసం రాష్ట్రంలో ఎవర్నీ సంప్రదించకుండా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. విభజన కోసం ఎవర్ని నియమించారో వాళ్లెవరూ తమతో మాట్లాడలేదన్నారు. పట్టించుకోలేదని ఆరోపించారు.

5/9
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా  జగనన్నే మా భవిష్యత్ అనే కార్యక్రమాన్ని వైఎస్ఆర్‌సీపీ నేతలు అట్టహాసంగా ప్రారంభించారు.  వైసీపీ ప్రజా ప్రతినిధులు.. ఎమ్మెల్యేలు, గృహ సారథులు కన్వీనర్లు ప్రతి ఇంటికి వెళ్లి  సంక్షేమ కార్యక్రమాల గురించి  వివరిస్తున్నారు.   ఈ నెల 20 వరకు ఈ కార్యక్రమం జరగనుంది.  శుక్రవారం నుంచి ఈ నెల 20 వరకు జరగనున్న...  కార్యక్రమంతో ఎమ్మెల్యే లు... ప్రజాప్రతినిధులు... నియోజక వర్గ నేతలు.. గృహ సారధులతో ప్రజల్లోకి వెళ్ళేందుకు జగన్ ప్లాన్ చేశారు.   రెండు వారాల పాటు  రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ప్రజల అభిప్రాయం తీసుకుంటారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తారు. ప్రజలకు గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా తెలియచేస్తూ ఐదు ప్రశ్నలతో ప్రజాభిప్రాయసేకరణ చేస్తారు.

6/9
టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు అల్లు అర్జున్. సినీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ... యాక్టింగ్, డాన్సులతోనే కాకుండా, స్టైలింగ్ లోనూ తన స్పెషాలిటీ చూపించాడు. కేవలం తెలుగులోనే కాకుండా, పొరుగు ఇండస్ట్రీల్లోనూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా వెలుగొందుతున్న బన్నీ.. ఈరోజు (ఏప్రిల్ 8) తన 41వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా పుష్ప-2 గ్లింప్స్ విడుదల చేశారు. గ్లింప్స్ విడుదల చేయడానికి ముందు 'వేర్ ఈజ్ పుష్ప' అంటూ ఓ చిన్న వీడియో విడుదల చేశారు. అది చూస్తే... 'తిరుపతి జైలు నుంచి బుల్లెట్  గాయాలతో తప్పించుకున్న పుష్ప' అని వార్తల్లో రావడం, ప్రజలు, హడావిడి వీడియోలో అంశాలు అన్నీ హైప్ పెంచాయి. తిరుపతి జైలు నుంచి తప్పించుకున్న పుష్పను చూపించారు.

7/9
సినీ నటుడు వేణు ఎల్దండి దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘బలగం’. ప్రియ దర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్ లుగా నటించారు. చిన్న సినిమాగా విడుదలైన ఈ ‘బలగం’ మూవీ పెద్ద హిట్ ను అందుకుంది. తెలంగాణ సాంప్రదాయాలను అద్దం పట్టే ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. బుల్లితెరపై కూడా సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు పలు అవార్డులు దక్కాయి. ఈ చిన్న సినిమా గ్లోబల్ స్థాయిలో ఏకంగా 6 అవార్డులను అందుకొని సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా ‘బలగం’ సినిమాకు మరో అంతర్జాతీయ అవార్డు లభించింది. తాజాగా ఈ మూవీ డైరెక్టర్‌ వేణు ఉత్తమ ఉత్తమ దర్శకుడిగా ఆమ్‌ స్టర్‌ డామ్‌ ఇంటర్నేషనల్‌ అవార్డుకు అందుకున్నాడు.  కాగా ఇప్పటికే ఈ సినిమాకు లాస్ ఏంజెలెస్ సినిమాటోగ్రఫీ నుంచి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులను అందాయి.

8/9
ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ రీడర్ పోల్‌లో బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ మొదటి స్థానంలో నిలిచారు. ఈ టైమ్100 రీడర్ పోల్‌లో మ్యాగజైన్ వినియోగదారులు తాము ఇష్టపడ్డ వ్యక్తులకు అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా ఓట్లు వేసి గెలిపించవచ్చు. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న మిషెల్ యో (Michelle Yeoh), ప్రముఖ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ (Serena Williams), మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg), బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాకియో లులా డ సిల్వలను సైతం వెనక్కి నెట్టి కింగ్ ఖాన్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఓటింగ్‌లో షారుక్ ఖాన్‌కు నాలుగు శాతం ఓట్లు లభించాయి. దాదాపు 12 లక్షల మంది షారుక్‌కు ఓటు వేశారు. స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న ఇరానీ మహిళలకు రెండో శాతం దక్కింది. వీరికి మూడు శాతం ఓట్లు లభించాయి.

9/9
తమిళ స్టార్ హీరోల్లో నటుడు విశాల్ ఒకరు. ఆయనకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన అన్ని సినిమాలు దాదాపు తెలుగులో కూడా విడుదల అవుతాయి. కేవలం నటుడు గానే కాకుండా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సినిమాలను నిర్మిస్తున్నారు. అయితే గత కొంత కాలంగా ఆయన తన నిర్మాణ సంస్థకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.  ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో నడుస్తుండటంతో ఈ విషయం కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా కోర్టు విశాల్ కు బిగ్ షాక్ ఇచ్చింది. కోర్టులో 15 కోట్లు డిపాజిట్ చేయకపోతే ఆయన నిర్మించిన సినిమాలను విడుదల చేయడానికి వీల్లేదు అంటూ తీర్పునిచ్చింది మద్రాస్ హైకోర్టు. దీంతో విశాల్ సినిమా కెరీర్ రిస్క్ లో పడినట్లైంది.

న్యూస్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
Ind vs Nz 3rd Test Highlights: ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Rahul To Telangana : ఐదో తేదీన హైదరాబాద్‌లో రాహుల్ ‘సంవిధాన్ సమ్మాన్’ - కులగణనపై  కీలక ప్రకటన చేసే చాన్స్
ఐదో తేదీన హైదరాబాద్‌లో రాహుల్ ‘సంవిధాన్ సమ్మాన్’ - కులగణనపై కీలక ప్రకటన చేసే చాన్స్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

మహిళలు ఒకరి మాటలు వినకూడదు, తాలిబన్ల వింత రూల్స్లెబనాన్‌లోని బీరట్‌ సిటీపై దాడులు చేసిన ఇజ్రాయేల్Kithampeta Village No Diwali Celebrations |  70ఏళ్లుగా దీపావళి పండుగకు దూరమైన కిత్తంపేట | ABP DesamKTR Padayatra Announced | పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్..గులాబీ పార్టీ కొత్త అధినేతగా అడుగులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
Ind vs Nz 3rd Test Highlights: ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Rahul To Telangana : ఐదో తేదీన హైదరాబాద్‌లో రాహుల్ ‘సంవిధాన్ సమ్మాన్’ - కులగణనపై  కీలక ప్రకటన చేసే చాన్స్
ఐదో తేదీన హైదరాబాద్‌లో రాహుల్ ‘సంవిధాన్ సమ్మాన్’ - కులగణనపై కీలక ప్రకటన చేసే చాన్స్
AP TET Results 2024: అభ్యర్థులకు అలర్ట్, ఏపీ టెట్‌ ఫలితాలు వాయిదా - రిజల్ట్ విడుదలకు డేట్ ఫిక్స్
అభ్యర్థులకు అలర్ట్, ఏపీ టెట్‌ ఫలితాలు వాయిదా - రిజల్ట్ విడుదలకు డేట్ ఫిక్స్
Crime News: శృంగారం అయిపోగానే తల కత్తిరించి తీసుకుపోయింది -  ఇది దృశ్యం కాదు అదృశ్యం !
శృంగారం అయిపోగానే తల కత్తిరించి తీసుకుపోయింది - ఇది దృశ్యం కాదు అదృశ్యం !
Prabhas: బాలీవుడ్ హీరో నో చెబితే ప్రభాస్ 'ఎస్' అన్నారా? ఆ నెగిటివ్ షెడ్ రోల్ చేస్తారా? 
బాలీవుడ్ హీరో నో చెబితే ప్రభాస్ 'ఎస్' అన్నారా? ఆ నెగిటివ్ షెడ్ రోల్ చేస్తారా? 
Kiran Abbavaram: చెన్నైలో తెలుగు షోలకు స్క్రీన్లు ఇవ్వట్లేదు... తమిళ ఇండస్ట్రీ వైఖరిపై కిరణ్‌ అబ్బవరం ఆవేదన
చెన్నైలో తెలుగు షోలకు స్క్రీన్లు ఇవ్వట్లేదు... తమిళ ఇండస్ట్రీ వైఖరిపై కిరణ్‌ అబ్బవరం ఆవేదన
Embed widget