అన్వేషించండి

Janardhan Reddy Political Party: కొత్త పార్టీ ప్రకటించిన గాలి జనార్థన్ రెడ్డి

Janardhan Reddy Political Party: మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి.. నూతన పార్టీని ఆవిష్కరించారు.

Janardhan Reddy Political Party: వివాదాస్పద మైనింగ్ వ్యాపారి, మాజీ మంత్రి గాలి జనార్ధన రెడ్డి.. కొత్త పార్టీ ప్రకటించారు. బెంగళూరులో తన కొత్త పార్టీకి 'కల్యాణ రాజ్య ప్రగతి పక్ష' అనే పేరు పెట్టారు. రానున్న ఎన్నికల్లో గంగావతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పారు.

Karnataka | Mining tycoon and former minister Gali Janardhana Reddy announces his new party 'Kalyana Rajya Pragati Paksha' in Bengaluru. He further said that he would contest from the Gangavati assembly constituency in the upcoming state elections.

— ANI (@ANI) December 25, 2022

చాలా ఏళ్ల పాటు భాజపాలో ఉన్న గాలి జనార్థన్ రెడ్డి తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. భాజపాతో తన బంధంపై కూడా చాలా సార్లు మాట్లాడారు.

" నేను భాజపాలో సభ్యుడ్ని కాదు. అయినా చాలా మంది నేను ఆ పార్టీకి చెందిన వాడినే అనుకుంటున్నారు. ఆ ప్రచారానికి నేను ఈరోజు తెర దించుతున్నా. భాజపాతో నాకు ఎలాంటి సంబంధం లేదు. కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ పేరుతో, నా ఆలోచనలకు తగినట్లుగా కొత్త పార్టీ ప్రారంభిస్తున్నా. నేను గోలీల ఆటలోనే ఓటమిని అంగీకరించలేదు. అలాంటప్పుడు రాజకీయాల్లో నేనెలా ఓటమిని అంగీకరిస్తా? నాకు ప్రజల ఆశీర్వాదం లభిస్తుంది. కర్ణాటక సంక్షేమ రాజ్యంగా మారుతుంది. "
-గాలి జనార్దన్ రెడ్డి

భాజపా సీనియర్ నేత యడియూరప్ప అంటే తనకు ఎంతో గౌరవం అని గాలి జనార్థన్ రెడ్డి చెప్పారు. ఆయనపై ఇప్పటికీ ప్రేమ, నమ్మకం అలానే ఉన్నాయన్నారు. అయితే.. కొత్త పార్టీ ఏర్పాటుపై యడియూరప్పతో చర్చించలేదని స్పష్టం చేశారు. 

అక్రమ మైనింగ్

ఓబులాపురం మైనింగ్ పేరుతో గాలి జనార్దన్ రెడ్డి ఐరన్ ఓర్‌ను తవ్వేవారు. కర్ణాటక - ఆంధ్రా సరిహద్దులను కూడా చెరిపేసి విచ్చలవిడిగా మైనింగ్ చేశారని.. అన్ని రకాల నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. అయితే పన్నెండేళ్లుగా  ఈ కేసుల విచారణ ముందుకు సాగడంలేదు. గాలి జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ షరతుల సడలింపు పిటిషన్‌పై విచారణలో న్యాయమూర్తులు ఈ అంశంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

12 ఏళ్ల క్రితం న‌మోదైన ఈ కేసులో ఇప్ప‌టివరకు కోర్టు‌లో ట్ర‌య‌ల్ జ‌‌ర‌గక‌పోవ‌డం విచార‌క‌ర‌మ‌ని కోర్టు వ్యాఖ్యానించింది. తీవ్ర అభియోగాలున్న ఇలాంటి కేసుల ట్ర‌య‌ల్‌లో జాప్యం అంటే న్యాయాన్ని అప‌హాస్యం చేయ‌డ‌మేన‌ని కూడా కోర్టు ఘాటు వ్యాఖ్య‌లు చేసింది.

2009 నుంచి  గాలి జనార్ద‌న్ రెడ్డిపై సీబీఐ న‌మోదు చేసిన గ‌నుల అక్ర‌మ తవ్వ‌కాల కేసు ప్ర‌స్తుతం హైద‌రాబాద్ నాంప‌ల్లిలోని సీబీఐ ప్ర‌త్యేక కోర్టులో విచార‌ణ జ‌రుగుతోంది. అప్పట్లో గాలి జనార్దన్ రెడ్డి అరెస్టయిన తర్వాత దాదాపుగా ఇరవై నెలల పాటు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత ఆయనకు  బెయిల్ వచ్చింది. అయితే కేసుల విచారణ ముందుకు సాగకుండా అదే పనిగా అడ్డం పడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసుల్లో ఉన్న నిందితులు ఒకరి తర్వాత ఒకరు డిస్చార్జ్ పిటిషన్లు వేయడం.. వాయిదాలు కోరడం వంటివి చేస్తుండటంతో విచారణ ఆలస్యం అవుతోందని సీబీఐ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

జడ్జికే లంచం!

ఈ కేసుల్లో సీబీఐ అరెస్ట్ చేసిన సమయంలో బెయిల్ కోసం ఏకంగా న్యాయమూర్తికే లంచం ఇచ్చి గాలి జనార్దన్ రెడ్డి , ఆయన సోదరులు పట్టుబడ్డారు. సీబీఐ కోర్టు న్యాయమూర్తిని కూడా సీబీఐ ట్రాప్ చేసింది. ఈ కేసు కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కేసు కూడా విచారణలో ఉంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vamsi Video: సత్యవర్థన్‌ను వంశీ ఇంటికి తీసుకెళ్లిన అనుచరులు - సంచలన వీడియో రిలీజ్ చేసిన టీడీపీ
సత్యవర్థన్‌ను వంశీ ఇంటికి తీసుకెళ్లిన అనుచరులు - సంచలన వీడియో రిలీజ్ చేసిన టీడీపీ
Telangana Ration Card Latest News:ఏటీఎం కార్డులా తెలంగాణలో రేషన్ కార్డు- జిల్లాకు లక్ష చొప్పున పంపిణీకి సిద్ధం
ఏటీఎం కార్డులా తెలంగాణలో రేషన్ కార్డు- జిల్లాకు లక్ష చొప్పున పంపిణీకి సిద్ధం
YS Jagan:  తన సామాజికవర్గం నుంచి వంశీ ఎదుగుతున్నాడనే అరెస్టు చేశారు - చంద్రబాబు, లోకేష్‌పై జగన్ ఆరోపణ
తన సామాజికవర్గం నుంచి వంశీ ఎదుగుతున్నాడనే అరెస్టు చేశారు - చంద్రబాబు, లోకేష్‌పై జగన్ ఆరోపణ
Tesla in India: టెస్లా ఇండియా వచ్చేసింది. డ్రైవింగ్ ఎలా ఉందో తెలుసా..?
టెస్లా ఇండియా వచ్చేసింది. డ్రైవింగ్ ఎలా ఉందో తెలుసా..?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sunita Williams Coming back to Earth | Gravity లేకపోతే మన బతుకులు అథోగతేనా | ABP DesamAdilabad Bala Yesu Festival | క్రిస్మస్ కన్నా ఘనంగా చేసుకునే బాల యేసు పండుగ | ABP DesamPawan Kalyan Maha kumbh 2025 | ప్రయాగ్ రాజ్ లో ఫ్యామిలీతో పవన్ కళ్యాణ్ | ABP DesamHigh Tension in Tuni | ఘర్షణలకు దారి తీసిన తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vamsi Video: సత్యవర్థన్‌ను వంశీ ఇంటికి తీసుకెళ్లిన అనుచరులు - సంచలన వీడియో రిలీజ్ చేసిన టీడీపీ
సత్యవర్థన్‌ను వంశీ ఇంటికి తీసుకెళ్లిన అనుచరులు - సంచలన వీడియో రిలీజ్ చేసిన టీడీపీ
Telangana Ration Card Latest News:ఏటీఎం కార్డులా తెలంగాణలో రేషన్ కార్డు- జిల్లాకు లక్ష చొప్పున పంపిణీకి సిద్ధం
ఏటీఎం కార్డులా తెలంగాణలో రేషన్ కార్డు- జిల్లాకు లక్ష చొప్పున పంపిణీకి సిద్ధం
YS Jagan:  తన సామాజికవర్గం నుంచి వంశీ ఎదుగుతున్నాడనే అరెస్టు చేశారు - చంద్రబాబు, లోకేష్‌పై జగన్ ఆరోపణ
తన సామాజికవర్గం నుంచి వంశీ ఎదుగుతున్నాడనే అరెస్టు చేశారు - చంద్రబాబు, లోకేష్‌పై జగన్ ఆరోపణ
Tesla in India: టెస్లా ఇండియా వచ్చేసింది. డ్రైవింగ్ ఎలా ఉందో తెలుసా..?
టెస్లా ఇండియా వచ్చేసింది. డ్రైవింగ్ ఎలా ఉందో తెలుసా..?
Telangana Highcourt: వాదనలు వినిపిస్తూ చనిపోయిన లాయర్ - తెలంగాణ హైకోర్టులో విషాదం
వాదనలు వినిపిస్తూ చనిపోయిన లాయర్ - తెలంగాణ హైకోర్టులో విషాదం
Telangana Indiramma Illu Latest News: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎగిరి గంతేసే వార్త- బిగ్ అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎగిరి గంతేసే వార్త- బిగ్ అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
Amritha Aiyer: అరెరే అమృతా... ఇంతందంగా ఉంటే ప్రేక్షకులు చూడరా
అరెరే అమృతా... ఇంతందంగా ఉంటే ప్రేక్షకులు చూడరా
Revanth Reddy: సైబర్ నేరగాళ్లు ఒక్క ఏడాదిలో ఎన్ని వేల కోట్లు కొట్టేశారో తెలుసా? షీల్డ్ సమ్మిట్‌లో రేవంత్ రెడ్డి
సైబర్ నేరగాళ్లు ఒక్క ఏడాదిలో ఎన్ని వేల కోట్లు కొట్టేశారో తెలుసా? షీల్డ్ సమ్మిట్‌లో రేవంత్ రెడ్డి
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.