అన్వేషించండి

One Nation- One Election : జమిలి ఎన్నికలు అంత సులువు కాదు.. దాటాల్సిన రాజ్యాంగపరమైన చిక్కులు ఇవే!

One nation- One election: వన్‌ నేషన్- వన్ ఎలక్షన్ నినాదం నుంచి విధానంగా మారేందుకు రంగం సిద్ధమైంది. అయితే అదేమంత చిన్నపని కాదని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు.

is One nation- One election possible: వన్‌ నేషన్- వన్ ఎలక్షన్ విధానానికి బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదంతో.. సాధ్యాసాధ్యాలపై విపరీతమైన చర్చ మొదలైంది. జమిలి ఎన్నికలను స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లలోనే చూసిన భారతావనికి.. ఇప్పుడు మళ్లీ అమలు చేయాలంటే ఎన్నో అవరోధాలు అడ్డుగా నిలుస్తున్నాయి. అనేక రాజ్యాంగ సవరణలు చేపట్టాలని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. 2029 సార్వత్రికాన్నే జమిలిగా మార్చాలంటే.. లోక్‌సభ, రాజ్యసభలో రాజ్యాంగ సవరణలకు ఆమోదం లభించాలి. సమాఖ్య వ్యవస్థ అయిన మన దేశంలో రాష్ట్రాల ఆమోదమూ ముఖ్యమే.

భారతదేశంలో జమిలి కొత్త ప్రతిపాదనేమీ కాదు.. ఒక నాడు అమల్లో ఉన్నదే:

వన్ నేషన్‌- వన్ ఎలక్షన్ అంటే.. ఇప్పటిలా రాష్ట్రాలకు, లోక్‌సభకు వేర్వేరు సమయాల్లో ఎన్నికలు నిర్వహించడం కాకుండా.. దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం. తద్వారా ఎన్నికల వ్యయాన్ని తగ్గించడం సహా పదేపదే ఎన్నికల కారణంగా పథకాల అమల్లో అవరోధాలను తొలగించడం. అయితే భారత్‌ గతంలో ఎప్పుడైన జమిలిని చూసిందా అంటే.. జమిలి భారత్‌కు కొత్తకాదన్న సమాధానమే వస్తుంది. 1951 నుంచి 1967 వరకు దేశంలో జరిగిన ఎన్నికలన్నీ జమిలి ఎన్నికలే. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల కారణంగా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోయి.. మధ్యంతర ఎన్నికలు వచ్చి.. వివిధ రాష్ట్రాల అసెంబ్లీల గుడువులు మారి.. లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు మధ్య పొంతన కుదరకుండా పోయంది. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో వన్ నేషన్- వన్ ఎలక్షన్ నినాదంతో 2014 నుంచి ప్రజల ముందుకు వచ్చిన భాజపా నేతృత్వంలోని NDA సర్కారు ఈ దఫా ఆ హామీని అమల్లోకి తేవాలని నిర్ణయించింది. అందుకోసం మోదీ 2.Oలోనే మాజీ రాష్ట్రపతి రామ్‌నాద్‌ కోవింద్ నేతృత్వంలో కమిటీ వేసి.. ఇప్పుడు ఆ విధానం అమలుకుపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంది.

కోవింద్ కమిటీ నివేదికలో కీలకాంశాలు- ఆరు రాజ్యాంగ సవరణలు అత్యావశ్యకం:

ప్రస్తుతం జమిలి జరపాలంటే.. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువు పెంచాలి. మరి కొన్ని రాష్ట్రాల్లో శాసనసభల గడువు తగ్గించాలి. లోక్‌సభ ఎప్పుడైనా ముందస్తుకు వెళ్లినా ఆ పరిస్థితులకు అనుగుణంగా జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే దాదాపు ఆరు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లో మార్పులు సహా ఆరు రాజ్యాంగ సవరణలు చేయాలని కోవింద్ కమిటీ స్పష్టం చేసింది. లోక్‌సభ, రాజ్యసభ కాలపరిమితికి సంబంధించి ఆర్టికల్‌ 83ని సవరించాలి. రాష్ట్రాల అసెంబ్లీలకు గడువును నిర్దేశించే ఆర్టికల్ 172(1)లోనూ సవరణలు అవసరం. ఆర్టికల్ 83(2) ఎమర్జెన్సీ సమయాల్లో సభ కాలపరిమితి ఏడాదికి మించకుండా పార్లమెంటు చట్టం ద్వారా వీలు కల్పించే ఈ ఆర్టికల్‌లో మార్పు అవసరం.  ఆర్టికల్ 172(1) కింద రాష్ట్రాలకు ఈ సదుపాయం ఉంది. వీటితో పాటు కేంద్ర, రాష్ట్రాల్లో ప్రభుత్వాల రద్దుకు సంబంధించి రాష్ట్రపతి, గవర్నర్‌కు అధికారాన్ని సంక్రమించే ఆర్టికల్ 85(2)బి సహా రాష్ట్రాలకు సబంధించి ఆర్టికల్ 174(2)బి లోనూ రాజ్యాంగ సవరణలు తప్పనిసరి. రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు అవకాశం కల్పించే ఆర్టికల్ 356తో పాటు ఎన్నికల కమిషన్‌ అధికారాలకు సంబంధించిన ఆర్టికల్ 324లోనూ సవరణలు చేపట్టాలి.

 పార్లమెంటు సహా సగం రాష్ట్రాల ఆమోదం తప్పని సరి:

 జమిలి ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగ సవరణలు తప్పనిసరి అయిన దశలో.. పార్లమెంటు ఉభయసభలతో పాటు రాష్ట్ర అసెంబ్లీలు కూడా ఆమోదించాల్సి ఉంటుంది. రాజ్యాంగ సవరణకు పార్లమెంటులో మూడించ రెండు వంతుల ఎంపీల మద్దతు అవసరం. ప్రస్తుతం లోక్‌సభలో భాజపా బలం చూస్తే.. NDA పక్షాలతో పాటు ఇతర పక్షాల ఎంపీలు కూడా కొందరు సహకరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం లోక్‌సభలో ఎన్‌డీఏ బలం 293 కాగా.. రాజ్యాంగ సవరణ కోసం 362 మంది ఎంపీల మద్దతు అవసరం. ఇదే విధంగా రాజ్యసభలో ఎన్‌డీఏ బలం 121 కాగా.. రాజ్యాంగ సవరణలు చేపట్టాలంటే 164 మంది సభ్యుల మద్దతు ఉండాలి. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాల మాటలకూ గౌరవం ఉంటుంది కాబట్టి.. రాజ్యాంగ సవరణకు సగం రాష్ట్రాల అసెంబ్లీలు అనుమతించాలి. అంటే దాదాపు 14కి పైగా రాష్ట్రాలు ఆమోదం తెలపాలి. ప్రస్తుతం దేశంలో భాజపా సొంతంగా 13 రాష్ట్రాల్లో.. కూటమిగా 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉండడం కలిసి వచ్చే విషయం.

దేశ వ్యాప్తంగా ఒకే ఓటరు జాబితా:

జమిలి ఎన్నికలు వాస్తవంలోకి వస్తే ఇవి రెండు దశల్లో జరుగుతాయి. తొలి దశలో పార్లమెంటుకు, రాష్ట్రాలకు, రెండో దశలో పంచాయితీలు సహా మొత్తం స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ మొత్తం ప్రక్రియ వంద రోజుల్లో పూర్తి అవుతుంది. ఇలా ఎన్నికలన్నీ ఒకే సారి నిర్వహిస్తే.. ఒటరు కార్డు, ఓటరు జాబితా కూడా దేశస్థాయిలో ఒకటే ఉంటుంది. వేర్వేరు రాష్ట్రాల్లో ఓట్లు కలిగి ఉండే అవకాశం ఉండదు. ఇలా ఓటర్ల జాబితా ప్రక్రియకు కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లతో సంప్రదింపులు జరిపి ఓటర్ల జాబితా సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇందుకు అవలసరమైన రాజ్యాం సవరణలు కూడా చేయాల్సి ఉంటుంది. జమ్ము కశ్మీర్ సహా శాసససభలున్న కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణకు కూడా రాజ్యాంగ సవరణలు చేపట్టాల్సి ఉంటుంది.

జమిలి ఎన్నికలతో పాటు మహిళా రిజర్వేషన్ల చట్టం అమలు చేయాలని భావిస్తోంది. 2023 సెప్టెంబర్‌లోనే ఈ చట్టం పార్లమెంటు ఆమోదం పొందినప్పటికీ.. ప్రభుత్వం అమల్లోకి మాత్రం తేలేదు. దీనిపైనా దృష్టి సారిస్తోంది.  2029 నాటికి లోక్‌సభ సీట్ల పెంపుపైనా దృష్టి పెట్టింది.

Also Read: జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం మరో అడుగు - రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు ఆమోదం - ఇక ఒక్క అడుగే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Police On Jagan: జగన్ క్షమాపణ చెప్పకపోతే న్యాయపోరాటం - ఏపీ పోలీసు అధికారుల సంఘం హెచ్చరిక
జగన్ క్షమాపణ చెప్పకపోతే న్యాయపోరాటం - ఏపీ పోలీసు అధికారుల సంఘం హెచ్చరిక
Amaravati Hyderabad Greenfield Expressway: అమరావతి- హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకి కేంద్రం ఆమోదం
అమరావతి- హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకి కేంద్రం ఆమోదం
Hanuman Vijaya Yatra: ఈ 12న హైదరాబాద్‌లో హనుమాన్ విజయయాత్ర, నిర్వాహకులకు పోలీసుల కీలక సూచనలివే
ఈ 12న హైదరాబాద్‌లో హనుమాన్ విజయయాత్ర, నిర్వాహకులకు పోలీసుల కీలక సూచనలివే
Manchu Manoj: మా అన్న కెరీర్ కోసం నన్ను వాడుకున్నారు... ఆడవేషం వేయించారు... కన్నీటి పర్యంతమైన మంచు మనోజ్
మా అన్న కెరీర్ కోసం నన్ను వాడుకున్నారు... ఆడవేషం వేయించారు... కన్నీటి పర్యంతమైన మంచు మనోజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR Batting Strategy IPL 2025 | లక్నో మీద గెలవాల్సిన మ్యాచ్ ను కేకేఆర్ చేజార్చుకుంది | ABP DesamNicholas Pooran 87 vs KKR | లక్నోకు వరంలా మారుతున్న పూరన్ బ్యాటింగ్Priyansh Arya Biography IPL 2025 | PBKS vs CSK మ్యాచ్ లో సెంచరీ బాదిన ప్రియాంశ్ ఆర్య ఎంత తోపంటేDevon Conway Retired Out Controversy | కాన్వే రిటైర్డ్ అవుట్ అవ్వటం సీఎస్కే కొంప ముంచిందా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Police On Jagan: జగన్ క్షమాపణ చెప్పకపోతే న్యాయపోరాటం - ఏపీ పోలీసు అధికారుల సంఘం హెచ్చరిక
జగన్ క్షమాపణ చెప్పకపోతే న్యాయపోరాటం - ఏపీ పోలీసు అధికారుల సంఘం హెచ్చరిక
Amaravati Hyderabad Greenfield Expressway: అమరావతి- హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకి కేంద్రం ఆమోదం
అమరావతి- హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకి కేంద్రం ఆమోదం
Hanuman Vijaya Yatra: ఈ 12న హైదరాబాద్‌లో హనుమాన్ విజయయాత్ర, నిర్వాహకులకు పోలీసుల కీలక సూచనలివే
ఈ 12న హైదరాబాద్‌లో హనుమాన్ విజయయాత్ర, నిర్వాహకులకు పోలీసుల కీలక సూచనలివే
Manchu Manoj: మా అన్న కెరీర్ కోసం నన్ను వాడుకున్నారు... ఆడవేషం వేయించారు... కన్నీటి పర్యంతమైన మంచు మనోజ్
మా అన్న కెరీర్ కోసం నన్ను వాడుకున్నారు... ఆడవేషం వేయించారు... కన్నీటి పర్యంతమైన మంచు మనోజ్
Kangana Ranaut: లక్ష రూపాయల కరెంట్ బిల్... షాక్‌లో హీరోయిన్... కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఫైర్
లక్ష రూపాయల కరెంట్ బిల్... షాక్‌లో హీరోయిన్... కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఫైర్
CM Chandrababu: అమరావతిలో సీఎం చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన, నిర్మాణ బాధ్యతలు ఎవరికంటే
అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన, నిర్మాణ బాధ్యతలు ఎవరికంటే
Repo Rate Cut: బ్రేకింగ్‌ న్యూస్‌ - ప్రజలకు 'రెండో' లడ్డూ, రెపో రేట్‌ తగ్గించినట్లు ఆర్బీఐ ప్రకటన
బ్రేకింగ్‌ న్యూస్‌ - ప్రజలకు 'రెండో' లడ్డూ, రెపో రేట్‌ తగ్గించినట్లు ఆర్బీఐ ప్రకటన
AA22 x A6: అవేంజర్స్, ఎక్స్ మ్యాన్... అట్లీతో ఐకాన్ స్టార్ ప్లానేంటి? సైన్స్‌ ఫిక్షన్ సినిమాయేనా... వీఎఫ్ఎక్స్‌ కంపెనీల హిస్టరీ తెల్సా?
అవేంజర్స్, ఎక్స్ మ్యాన్... అట్లీతో ఐకాన్ స్టార్ ప్లానేంటి? సైన్స్‌ ఫిక్షన్ సినిమాయేనా... వీఎఫ్ఎక్స్‌ కంపెనీల హిస్టరీ తెల్సా?
Embed widget