Andhra News: ఎమ్మెల్యే జగన్ కు 1100 మంది పోలీసుల్ని కేటాయించాం, సైకోల వల్లే ఇబ్బందులు- కాలువ శ్రీనివాసులు
చనిపోయిన వ్యక్తిని రాజకీయాలకు జగన్ వాడుకోవడం దురదృష్టకరమన్న కాలువ శ్రీనివాసులు, జగన్ కు మైండ్ దొబ్బిందని.. అతనింకా కోలుకోలేదన్నారు.

అనంతపురం: నిన్న మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో పర్యటన రాజకీయ దుమారాన్ని రేపుతుంది. మరణించిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన వైసీపీ అధినేత జగన్ రెడ్డి బీసీ పోలీసు అధికారులు నోటికొచ్చినట్లు మాట్లాడటంపై తెలుగుదేశం పార్టీ పోలీస్ బ్యూరో సభ్యుడు, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తీవ్రంగా మండిపడ్డారు. ఎమ్మెల్యే హోదాలో ఉన్న జగన్ కు 1100 మంది పోలీసుల్ని కేటాయించారు. హెలిప్యాడ్ వద్ద 200మంది పోలీసులు ఉన్నా కూడా కొందరు అత్యుత్సాహవంతులు ముందుకు దూసుకొచ్చారు. బందోబస్తుకు వచ్చిన పోలీసులపై రాళ్ల దాడి కూడా చేశారు. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సైకోయిజంతో ఉన్నారో తెలుస్తోంది అన్నారు.
లింగమయ్య హత్యకేసులో నిందితుల్ని పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. అదే విధంగా పోలీసులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేశారు. ఒక బీసీ పోలీస్ అధికారిపై జగన్ దారుణ పదజాలం ఉపయోగించారు. సుధాకర్ యాదవ్ పై చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలనీ.. వారం లోపు క్షమాపణ చెప్పకపోతే.. జగన్ మీద రాజకీయ యుద్ధం చేస్తాం. ఆధారాలు లేని మాటలు మాట్లాడుతున్నావ్ జగన్... వీడియో కాల్స్ చేసినట్టు నీ దగ్గరున్న సాక్షాలేంటనీ ప్రశ్నించారు. బీసీలకు క్షమాపణ చెప్పకపోతే.. బీసీల ప్రతాపం ఏంటో చూపిస్తాం. లింగమయ్య కుటుంబానికి ఇప్పటి వరకు ఏం సాయం చేశావ్.. బీసీల మరణాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటే ఎవరూ ఓర్వరు.. జగన్ కు మైండ్ దొబ్బింది.. అతనింకా కోలుకోలేదన్నారు’ కాలువ శ్రీనివాసులు.
కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కామెంట్స్...
‘ప్రశాంతంగా ఉన్న జిల్లాలో జగన్ అలజడులు సృషించారు. తాగుబోతులంతా కలిసి హెలికాప్టర్ వద్దకు దూసుకొచ్చారు. ఒక బీసీ నేత చనిపోవడం చాలా బాధాకరం. ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగుతుంటే జగన్ ఓర్వలేకపోతున్నారు. అందుకే జగన్ కు అలాటుగా మారిన శవ రాజకీయాలు చేస్తున్నాడు. ఒక పక్క రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే... ఇలాంటి సమయంలో జగన్ అరాచకాలు సృష్టిస్తున్నారు. నీ ఐదేళ్ల పాలనలో పోలీస్ వ్యవస్థను ఎంత దుర్వినియోగం చేశావ్ అందరికీ తెలుసు జగన్. మళ్లీ అధికారంలోకి వస్తానని కలలు కంటున్నారు. ఇలాంటి సైకోని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా లేరనీ’ కళ్యాణ దుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు విమర్శించారు....
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

