Telugu breaking News: రూ. 2,75,891 కోట్లతో తెలంగాణ ఓట్-ఆన్ అకౌంట్ బడ్జెట్- సభ ముందు ఉంచిన ప్రభుత్వం
Latest Telugu breaking News:ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.
LIVE
Background
Latest Telugu breaking News: నేటి (ఫిబ్రవరి 8 గురువారం) నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30 నిమిషాలకు గవర్నర్ తమిళిసై ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి. తొలిసారి మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత ఎమ్మెల్యే హోదాలో సమావేశాలకు హాజరుకానున్నారు. ఇప్పటికే నీటి పారుదల ప్రాజెక్టులపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య తీవ్రస్థాయిలో ఫైట్ జరుగుతుంది. అది సభపై కూడా ప్రభావం చూపుతుందనే వాదన బలంగా వినిపిస్తోంది.
కేంద్రానికి ప్రాజెక్టుల నిర్వహణ అప్పగించడాన్ని బీఆర్ఎస్ ప్రశ్నించే అవకాశం ఉంది. దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్ గత హయంలో జరిగిన తప్పులను ఎత్తి చూపుతూ నిలదీసేందుకు సిద్దమైంది. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న టైంలో ఈ సమావేశాలు ఊహించనంత హాట్‌గా జరగొచ్చని అంటున్నారు.
ఈ సమావేశాల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. సుమారు వారం రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ఒకరోజు, ధన్యవాదాల తీర్మానంపై చర్చకు ఇంకొక రోజు పోతుంది. తర్వాత బడ్జెట్ పెట్టడానికి ఒకరోజు... దానిపై చర్చకు రెండు రోజుల సమయం కేటాయించే ఛాన్స్ ఉంది. తర్వాత వివిధ విభాగాలపై శ్వేత పత్రాలు రిలీజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది వాటి కోసం మిగిలిన రోజులు కేటాయించనున్నారు.
బడ్జెట్ సమావేశాల (Telangana Budget Session 2024) నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై శాసన సభ మీటింగ్ హాల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమీక్షా సమావేశం నిర్వహించారు.
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు త్వరితగతిన అందించాలని సూచించారు. సమావేశాల సమయంలో సంబంధిత అధికారులు తప్పకుండా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. అసెంబ్లీ ప్రాంగణంలోని మండలి షిఫ్టింగ్ త్వరగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకునేలా శాసన సభ వ్యవహారాల మంత్రి తోడ్పాటు అందించాలని గుత్తా కోరారు. భద్రత, రక్షణ వ్యవహారాల విషయంలో పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో ధర్నాలు, ర్యాలీల అనుమతి విషయంలో ఆచితూచి చర్యలు చేపట్టాలని సూచించారు.
ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమావేశాలు నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పట్లు ఆయా విభాగాల అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని అధికారులను శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశించారు. సభ్యుల ప్రశ్నలకు సాధ్యమైనంత త్వరగా సమాధానాలు ఇవ్వాలని సూచించారు. డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ మాట్లాడుతూ.. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో మంత్రులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అసెంబ్లీ కమిటీల ఏర్పాటును త్వరగా పూర్తి చేయాలని సూచించారు. మండలి, శాసన సభకు ఎన్నికైన నూతన సభ్యులకి ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించాలన్నారు.
శాసన సభ సమావేశాల సమయంలో అన్ని విభాగాలను కోఆర్డినేట్ చేసేందుకు, త్వరితగతిన సమాధానాలు సభ్యులకు అందించేందుకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. ఈ సమావేశాల్లో మంత్రులకు సబ్జెక్టుల వారీగా బాధ్యతలు ఇస్తున్నామని, సభ్యుల ప్రశ్నలకు వీలైనంత త్వరగా సమాధానాలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ కు సూచించారు. ప్రోటోకాల్ విషయంలో తప్పిదాలు జరగవద్దని, గతంలో ప్రోటోకాల్ విషయంలో తాను కూడా బాధితుడిని అని మంత్రి శ్రీధర్ బాబు గుర్తు చేసుకున్నారు.
మండలిని అసెంబ్లీ ప్రాంగణంలో కు త్వరితగతిన షిఫ్ట్ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇంకా ఏమైనా సమస్యలుంటే వెంటనే పరిష్కారం చెయ్యాలని చీఫ్ సెక్రటరీ, అసెంబ్లీ సెక్రటరీని మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. కొత్త సభ్యుల కోసం సమావేశాల తర్వాత రెండు రోజుల ఓరియంటేషన్ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమావేశాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, భద్రతపై సమక్షలో.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహ చార్యులు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రామకృష్ణ రావు, డీజీపీ రవి గుప్త, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, ముగ్గురు పోలీస్ కమిషనర్లు, ఇతర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మూసీ ఆధునీకరణకు వెయ్యి కోట్లు
ఆరోగ్య శ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు
వైద్య రంగానికి 11,500 కోట్లు కేటాయింపు
త్వరలో 15వేల మంది కానిస్టేబుళ్ళ నియామకాలు
TSPC నిర్వాహణకు 40 కోట్లు కేటాయింపు
ఆరు గ్యారంటీల అమలుకు 53,196 కోట్లు కేటాయింపు
హైదరాబాద్ మెడలో అందమైన హారంగా మూసీ నది
మూసీ ఆధునీకరణకు వెయ్యి కోట్లు
త్వరలోనే రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ
ఐటీ రంగం మరింత వృద్ధి చెందేలా చర్యలు
ఐటీ పరిశ్రమలు ఇతర జిల్లాలకు విస్తరణ
Telangana Budget 2024: గద్దర్‌ను గౌరవించడం అంటే ప్రజాగాయకులకు దక్కిన గౌరవం
ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా ఇక నుంచి నంది అవార్డును గద్దర్ అవార్ పేరుతో చిత్ర, టీవీ కళాకారులకు అందచేయనున్నామన్నారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ కు ఇదే తాము ఇచ్చే నివేళి అన్నారు. గద్దర్ను గౌరవించడం అంటే తెలంగాణ సంస్తృతిని, ప్రగతిల భావజాలంతో సమాజాన్ని చైతన్య పరిచే ప్రజా కవులు, ప్రజా గాయకులను గౌరవించడమే అన్నారు.
Telangana Budget 2024: శాంతి భద్రతల పరిరక్షణే ప్రథమ కర్తవ్యం
రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడం మా ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అన్నారు భట్టి. శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు నిరాటకంగా అందించ్ అవకాశం ఉంటుంది. గత ఐదేళ్లు సంవత్సరాలుగా రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు వినియోగం ఎక్కువైందజి. ఎంతో మంది యువతీ యువకులు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతున్నారు. ఇది ఏ మాత్రం ఉపేక్షించే అంసం కాదన్నారు.
అందుకే రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. రాష్ట్రంలో గత నెలరోజులుగా మన పోలీసులు, ఆబ్కారీ అధికారులు దాడుల్లో పెద్ద మొత్తంలో పట్టుకున్న గంజాయి ఇతర మాదక ద్రవ్యాలే మా కార్యచరణకు నిదర్శనం అన్నారు. మాదక ద్రవ్యాల నిరోధక బృందాలకు అవసరమైన నిధులను సిబ్బందిని కేటాయించాం. తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం అనే మాట ఉత్పన్న కాకూడదన్‌నారు. ప్రజల్లో అవగాహన పెంచి మాదక ద్రవ్యాల మహమ్మారి బారిన పడకుండా తెలంగాణ యువతను కాపాడుతున్నామన్నారు. ఈ నెల 4 వ తేదీన జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంల హుక్కా బార్లను కూడా నిషేదించామన్నారు.
ఎంతో కాలంగాణ పెండింగ్‌లో ఉన్న నూతన హైకోర్టు భవన సముదాయానికివంద ఎకరాల స్థలాన్ని కేటాయమైంది. న్యాయవ్యవస్థ పటిష్ఠతకు మేం తీసుకుంటున్న చర్యతో దేశ మొత్తం తెలంగాణ వైపు చూసతుడటంతో సందేహం లేదు.
Telangana Budget 2024: ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశ పెట్టడానికి కారణమేంటీ?
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టే తొలి బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌గా ప్రవేశ పెట్టడం అయిష్టంగా ఉందన్నారు భట్టి. కేంద్ర ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టింది. మొదటి నుంచి మా ప్రభుత్వానికి నిధులు ఎలా సమకూర్చుకువాలనే విషయంపై స్పష్టమైన అవగాహన ఉంది. దానిలో భాాగంగానే కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు విడుదల చేసే నిధులు సాధ్యమైనంత ఎక్కువగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఉపయోగించుకోవాలనే స్పష్టత ఉంది. అలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం పూర్థి స్థాయి బడ్జెట్‌లో వివిధ రంగావారిగా కేటాయింపులు జరిగినప్పుడే, మన రాష్ట్రానికి ఎంత మేరకు ఆ నిధుల్లో వాటా వస్తుందనేది అంచనా వేయగలుగుతామన్నారు. అందువల్లే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టినప్పుడే రాష్ట్రంలో పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాలని నిర్ణయించామన్నారు.
Telangana Budget 2024: ఇందిరమ్మ రాజ్యమే లక్ష్యం
తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రవేశ పెడతుందన్నారు. ఈ బడ్జెట్ లక్ష్యం ఒక్కటే అన్నారు. తెలంగాణ రాష్ట్ర మొత్తం సమగ్రంగా అభివద్ధి చేయడమే అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ప్రస్తావించిన విధంగా ఆరు గ్యారంటీలను తూజా తప్పకుండా అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని బడుగు బలహీనులను అభివృద్ధి చేస్తామన్నారు.