అన్వేషించండి
Advertisement
(Source: Poll of Polls)
Khiladi Movie Review: ‘ఖిలాడి’ రివ్యూ: ప్రేక్షకుడు ఊహించలేని ట్విస్టులెన్నో!
Khiladi Movie Review Telugu: మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ఖిలాడి'. ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది?
'ఖిలాడి'
Action Thriller
Director
రమేష్ వర్మ
Starring
రవితేజ, మీనాక్షీ చౌదరి, డింపుల్ హయతి, అనసూయ తదితరులు
సినిమా రివ్యూ: ఖిలాడి
రేటింగ్: 2/5
నటీనటులు: రవితేజ, మీనాక్షీ చౌదరి, డింపుల్ హయతి, అనసూయ, మురళీ శర్మ, ముఖేష్ రుషి, సచిన్ ఖేడేకర్, ఠాకూర్ అనూప్ సింగ్, రావు రమేష్ తదితరులు
పాటలు: శ్రీమణి
మాటలు: శ్రీకాంత్ విస్సా, సాగర్
సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సమర్పణ: జయంతి లాల్ గడ
నిర్మాత: కోనేరు సత్యనారాయణ
దర్శకత్వం: రమేష్ వర్మ
విడుదల తేదీ: ఫిబ్రవరి 11, 2022
జైలులో ఖైదీగా, సూటు బూటులో స్టయిలిష్‌గా... రెండు షేడ్స్‌లో మాస్ మహారాజ రవితేజ కనిపించిన సినిమా 'ఖిలాడి'. ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. రవితేజతో 'వీర' తీసిన రమేష్ వర్మ, ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈసారైనా రవితేజ - రమేష్ వర్మ కాంబినేషన్ హిట్ అందుకుందా? లేదా?
కథ: మనుషుల మాటలకే కాదు... మౌనానికి కూడా మీనింగ్ కనిపెట్టగలని చెప్పుకొనే సైకాలజీ స్టూడెంట్ పూజ (మీనాక్షీ చౌదరి). ఆమె ఇంటిలిజెన్స్ ఐజీ కుమార్తె. ఓ థీసిస్ కోసం సెంట్రల్ జైల్ లో ఖైదీ మోహన్ గాంధీ (రవితేజ)ను కలుస్తుంది. అతడు చెప్పినదంతా నిజమని నమ్మి తండ్రి సంతకం ఫోర్జరీ చేసి మరీ అతడికి బెయిల్ వచ్చేలా చేస్తుంది. జైలు నుంచి మోహన్ గాంధీ బయటకు వచ్చిన తర్వాత అతడు పెద్ద క్రిమినల్ అని తెలుస్తుంది. హోమ్ మంత్రికి ఇటలీ నుంచి వచ్చిన పదివేల కోట్ల రూపాయలు కొట్టేయడం కోసం తనను పావులా వాడుకున్నాడని పూజకు తెలుస్తుంది. అసలు, ఆ పదివేల కోట్లు ఎవరివి? ఎక్కడ ఉన్నాయి? మోహన్ గాంధీని మళ్లీ పోలీసులు పట్టుకున్నారా? లేదా? డబ్బు కోసం గాంధీ ఏం చేశాడు? అతడి లక్ష్యం ఏంటి? పూజ ఏం చేసింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ: అరవై నాలుగు కళల్లో చొరకళ ఒకటి. డబ్బు కొట్టేయడం ఓ కళ. అలాగే, ప్రేక్షకుల మనసు దోచుకోవడం కూడా! చీట్ చేసి డబ్బులు దోచుకోవచ్చు. ప్రతిసారీ చీట్ చేసి ప్రేక్షకుల మనసు దోచుకోవడం కష్టం. బహుశా... దర్శక - నిర్మాతలు, హీరో అది గుర్తించలేదు ఏమో!? 'ప్లే స్మార్ట్' ట్యాగ్‌లైన్‌కు న్యాయం చేయడం కోసం విపరీతమైన ట్విస్టులు, టర్నులతో సినిమాను పతాక సన్నివేశాల వరకూ నడిపించారు. ఫస్టాఫ్ చూసిన తర్వాత 'ఏంటీ రొటీన్ సినిమా' అనుకునే ప్రేక్షకుడు... సెకండాఫ్ ట్విస్టులు, క్లైమాక్స్ చూశాక ఆ రొటీన్ ఫస్టాఫ్ బెటర్ అనుకుంటే అది వాళ్ళ తప్పు కాదు. క్లైమాక్స్‌లో ఆ రేంజ్‌లో ట్విస్టులు పెట్టారు. విసుగు తెప్పించారు.
సినిమా మొదలు కావడమే రవితేజ మార్క్ రొటీన్ సన్నివేశాలతో మొదలైంది. ఆ కామెడీ గానీ... సన్నివేశాలు గానీ ఏమాత్రం ఆకట్టుకోవు. ఏదో జరుగుతుందనుకునే లోపు కథను జైలుకు తీసుకువెళ్లారు. కట్టుకున్న భార్యను రవితేజ హత్య చేశాడని చూపిస్తూ కథపై ఆసక్తి రేకెత్తించారు. ఆ ఆసక్తిని చివరి వరకూ కొనసాగించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యారు. ఎక్కువ ట్విస్టులతో ప్రేక్షకుడిని విసిగించారు. ఫైట్స్ కూడా హాలీవుడ్ సినిమాల నుంచి ఎత్తేసినవే. అయితే... స్టయిలిష్‌గా తీశారు. పాటల్లో కమర్షియల్ బీట్స్ ఎక్కువ వినిపించాయి. హీరోయిన్ల అందాల ప్రదర్శన వల్ల మాస్ ప్రేక్షకులకు కనువిందుగా ఉంటాయి. నేపథ్య సంగీతం రొటీన్ కథకు తగ్గట్టు ఉంది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడలేదని తెరపై విజువల్స్ చూస్తే తెలుస్తుంది.
రవితేజ (Hero Ravi Teja) హుషారుగా చేశారు. ఆయనకు ఇటువంటి పాత్రలు చేయడం అలవాటే. అయితే... 'క్రాక్'లో కనిపించినంత హ్యాండ్సమ్‌గా లేరు. డింపుల్ హయతి అందాల ప్రదర్శనతో కుర్రకారును ఆకట్టుకుంటారు. ఓ పాటలో మీనాక్షీ చౌదరి కూడా అందాల ప్రదర్శన చేశారు. నటనలో ఇద్దరికీ పెద్దగా స్కోప్ ఉన్న పాత్రలు దక్కలేదు. ఫస్టాఫ్‌లో పద్ధతిగా కనిపించిన అనసూయ, సెకండాఫ్‌లో గ్లామర్ వైపు మొగ్గు చూపారు. క్యారెక్టర్ అటువంటిది. రెండు షేడ్స్ ఉన్నాయి. అర్జున్, ముఖేష్ రుషి, నికితిన్ ధీర్, రావు రమేష్, 'వెన్నెల' కిషోర్... అందరివీ రొటీన్ క్యారెక్టర్లే. ఉన్ని ముకుందన్ ఎమోషనల్ రోల్ చేశారు.
Also Read: 'గెహరాయియా' రివ్యూ: ఆ ఒక్క రొమాంటిక్ మిస్టేక్ కంటే జీవితం పెద్దది!
'ఖిలాడి' గురించి చెప్పాలంటే... సినిమాలో ట్విస్టులు ఎక్కువ ఉన్నాయి. అలాగని, మేటర్ ఎక్కువ ఉందని కాదు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌లో సాగిన చిత్రమిది. పాటలు, ఫైట్స్ ఉంటే చాలని అనుకునే ప్రేక్షకులు ఓసారి వెళ్లే ప్రయత్నం చేయవచ్చు. రీమేక్ సినిమా 'రాక్షసుడు'తో విజయం అందుకున్న రమేష్ వర్మ ట్రాక్ రికార్డు చూస్తే... స్ట్రయిట్ సినిమాలతో విజయాలు అందుకున్న సందర్భాలు తక్కువ. రవితేజతో గతంలో ఆయన తీసిన 'వీర' ఆశించిన విజయం అందుకోలేదు. 'ఖిలాడి' (Khiladi Movie) ఆ సినిమా సరసన చేరుతుందా? లేదా? అంటే... ప్రేక్షకుల ఆదరణ మీద ఆధారపడి ఉంటుంది.
Also Read: 'గెహరాయియా' రివ్యూ: ఆ ఒక్క రొమాంటిక్ మిస్టేక్ కంటే జీవితం పెద్దది!
'ఖిలాడి' గురించి చెప్పాలంటే... సినిమాలో ట్విస్టులు ఎక్కువ ఉన్నాయి. అలాగని, మేటర్ ఎక్కువ ఉందని కాదు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌లో సాగిన చిత్రమిది. పాటలు, ఫైట్స్ ఉంటే చాలని అనుకునే ప్రేక్షకులు ఓసారి వెళ్లే ప్రయత్నం చేయవచ్చు. రీమేక్ సినిమా 'రాక్షసుడు'తో విజయం అందుకున్న రమేష్ వర్మ ట్రాక్ రికార్డు చూస్తే... స్ట్రయిట్ సినిమాలతో విజయాలు అందుకున్న సందర్భాలు తక్కువ. రవితేజతో గతంలో ఆయన తీసిన 'వీర' ఆశించిన విజయం అందుకోలేదు. 'ఖిలాడి' (Khiladi Movie) ఆ సినిమా సరసన చేరుతుందా? లేదా? అంటే... ప్రేక్షకుల ఆదరణ మీద ఆధారపడి ఉంటుంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement