Mahaan Review - 'మహాన్' రివ్యూ: తండ్రీ కొడుకుల మధ్య యుద్ధంలో విజయం ఎవరిది?

Vikram & Dhruv Vikram's Mahaan Movie Review: విక్రమ్, ఆయన తనయుడు ధ్రువ్ విక్రమ్ నటించిన 'మహాన్' ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? ఏంటి?

FOLLOW US: 
సినిమా రివ్యూ: మహాన్
రేటింగ్: 2.5/5
నటీనటులు: విక్రమ్, ధ్రువ్ విక్రమ్, బాబీ సింహా, సిమ్రాన్, సనంత్, ముత్తుకుమార్ తదితరులు
స్టంట్స్: దినేష్ సుబ్బరాయన్ 
ఎడిటర్: వివేక్ హర్షన్ 
సినిమాటోగ్రఫీ: శ్రేయాస్ కృష్ణ
సంగీతం: సంతోష్ నారాయణన్ 
నిర్మాతలు: ఎస్.ఎస్. లలిత్ కుమార్ 
దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్ 
విడుదల తేదీ: ఫిబ్రవరి 9, 2022 (అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో)
 
ప్రేక్షకుల హృదయాల్లో కథానాయకుడిగా, నటుడిగా విక్రమ్ ఎప్పుడో చెరగని ముద్ర వేశారు. విజయాలు అందుకున్నారు. కొన్నాళ్లుగా మునుపటి స్థాయిలో ఆయనకు విజయాలు రావడం లేదు. అయితే... నటుడిగా విక్రమ్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. వైవిధ్యం చూపిస్తూ వస్తున్నారు. వేషధారణ (గెటప్స్) పరంగా ఎప్పటికప్పుడు కొత్తదనం అన్వేషిస్తూ ఉన్నారు. 'సామి స్క్వేర్' వంటి కమర్షియల్ సినిమాలు కూడా చేశారు. కానీ, విజయాలే ఆశించినంత భారీ స్థాయిలో రాలేదు. చిన్న విరామం తర్వాత ఈ రోజు 'మహాన్' సినిమాతో ప్రజల ముందుకు వచ్చారు. ఇందులో ఆయన తనయుడు ధ్రువ్ విక్రమ్ కూడా నటించారు. థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది?
 
కథ: గాంధేయవాదుల కుటుంబంలో గాంధీ మహాన్ (విక్రమ్) జన్మిస్తాడు. అతని తండ్రి, పిల్లను ఇచ్చిన మామ మద్యపాన నిషేధం కోసం పోరాడారు. భార్య ఝాన్సీ (సిమ్రాన్) కూడా గాంధేయవాది. 40 ఏళ్లు వచ్చేవరకూ గాంధీ మహాన్ మద్యం ముట్టకుండా ఉంటాడు. జీవితంలో తనకు నచ్చినట్టు ఉండాలని 40వ పుట్టిన రోజున మందు తాగుతాడు. భార్యకు విషయం తెలిసి అబ్బాయి దాదా (ధ్రువ్ విక్రమ్)ను తీసుకుని అతడి నుంచి దూరంగా వెళుతుంది. ఆ తర్వాత చిన్ననాటి స్నేహితుడు సత్యవాన్ (బాబీ సింహా)తో కలిసి ఏపీలో మందు సామ్రాజ్యానికి  మహారాజుగా గాంధీ మహాన్ ఎదుగుతాడు. సత్యవాన్ - మ‌హాన్‌కు ఎదురులేదని అనుకుంటున్న సమయంలో... ఉత్తరాది నుంచి వచ్చిన ఓ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ 'దాదా'భాయ్ నౌరోజీ (ధ్రువ్ విక్రమ్) వాళ్ళను టార్గెట్ చేస్తాడు. గాంధీ మహాన్ కుమారుడే స్పెషల్ ఆఫీసర్ నౌరోజీ అనే సంగతి సత్యవాన్, ఇతరులకు తెలుసా? తండ్రీ కొడుకుల మధ్య జరిగిన యుద్ధంలో ఎవరు విజయం సాధించారు? ఇందులో ఉప ముఖ్యమంత్రి జ్ఞానం ('వెట్టై' ముత్తు కుమార్) పాత్ర ఏమిటి? అనేది మిగతా సినిమా.
 
విశ్లేషణ: విక్రమ్, అతని కుమారుడు ధ్రువ్ విక్రమ్ కలిసి నటించిన తొలి సినిమా కావడంతో 'మహాన్' మీద ముందు నుంచి అంచనాలు నెలకొన్నాయి. ఒకే ఫ్రేములో ఇద్దరూ ఉంటే ఎలా ఉంటుంది? ఎవరెలా నటిస్తారు? అనే చర్చ కూడా నడిచింది. 'ఏపీ మందు సామ్రాజ్యానికి మహారాజు నా బాబు' అని ధ్రువ్ విక్రమ్, 'రేయ్ నా కొడకా! ఇప్పుడు నీ బాబు... అప్పుడు నువ్ చూసిన, గాంధీ మహాన్ పేరు పెట్టుకున్న కామర్స్ టీచర్ కాదు' అని విక్రమ్ చెప్పిన డైలాగులు సినిమా ఆసక్తి పెంచాయి. ట్రైలర్ కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. అయితే... తండ్రీ కొడుకులను ఒకే ఫ్రేములో చూడ‌టానికి ఆడియన్స్ సినిమా మొదలైన గంట వరకూ వెయిట్ చేయాల్సి వచ్చింది.
 
దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కథలోకి వెళ్ళడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. సినిమా మొదలైన కాసేపటికి విక్రమ్, సిమ్రాన్ విడిపోయినట్టు చూపించారు. ఆ వెంటనే సారా వ్యాపారంలోకి హీరో దిగినట్టు చూపించారు. అదంతా ఆల్రెడీ కొన్ని తమిళ సినిమాల్లో చూసినట్టు ఉంటుంది. కథలో అసలు విషయం దగ్గరకు వెళ్ళడానికి మాత్రం ఇంటర్వెల్ వరకూ వెయిట్ చేయించారు.
 
ధ్రువ్ విక్రమ్ ఎంట్రీ... తండ్రి విక్రమ్‌తో కలిసి నటించిన సన్నివేశాలు ప్రేక్షకులకు కనులవిందు అని చెప్పాలి. ఒకవేళ థియేటర్లలో సినిమా విడుదలై ఉంటే... ఆ సీన్స్ వచ్చినప్పుడు చప్పట్లు, ఈలలుతో హాలు దద్దరిల్లిపోయేది. సినిమాలో హైలైట్ అంటే విక్రమ్ - ధ్రువ్ విక్రమ్ ఎదురుపడిన సీన్స్, ఇద్దరి మధ్య ఫైట్ అని చెప్పాలి. తండ్రీ కొడుకుల నటన అని చెప్పాలి. అంతకు మించి ఏముంది? అంటే... ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఎందుకంటే... కథను అంత నత్త నడకన కార్తీక్ సుబ్బరాజ్ నడిపించాడు. సినిమా స్టార్టింగ్ నుంచి నిదానంగా ఉంటుంది. ధ్రువ్ విక్రమ్ ఎంట్రీ తర్వాతైనా కథలో వేగం పెరుగుతుందని అనుకుంటే అలా జరగలేదు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌, లెంగ్తీ సీన్స్‌తో సహనాన్ని పరీక్షించాడు. అయితే... శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ, సంతోష్ నారాయణన్ నేపథ్య సంగీతం, దినేష్ సుబ్బరాయన్ ఫైట్స్ బావున్నాయి. పాటలు తెలుగు ప్రేక్షకులకు గుర్తు ఉండటం కష్టమే.
 
నటుడిగా విక్రమ్ మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకుంటారు. 40 ఏళ్ల వయసులో ఓ విధంగా, ఆ తర్వాత 60 ఏళ్ళ వయసులో మరో విధంగా స్టయిలింగ్, యాక్టింగ్ పరంగా వైవిధ్యం చూపించారు. పతాక సన్నివేశాల్లో ఆయన నటన బావుంది. తండ్రితో సమానంగా ధ్రువ్ విక్రమ్ నటించారని చెప్పలేం. కానీ, తండ్రి ముందు చక్కని నటన కనబరిచారు. గుండెల్లో ఎంతోకాలంగా దాగి ఉన్న కోపాన్ని బయటకు వ్యక్తం చేయలేని స్థితిని అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చారు. పాత్రకు తగ్గట్టు నటించారు. సిమ్రాన్ ఓకే. బాబీ సింహాకు ప్రాముఖ్యం ఉన్న పాత్ర దక్కింది. ఆయన బాగా చేశారు. డిఫరెంట్ గెట‌ప్‌తో క‌నిపించారు. బాబీ సింహా కుమారుడిగా నటించిన సనంత్, ముత్తు కుమార్ పర్వాలేదు.
 
విక్రమ్ - ధ్రువ్ విక్రమ్ కాంబినేషన్ సీన్స్ కోసం 'మహాన్'ను చూడొచ్చు. వాళ్ళిద్దరూ బాగా చేశారు. అయితే... వాళ్ళిద్దరి యాక్టింగ్‌కు, వాళ్ళిద్దరూ పోషించిన క్యారెక్టర్ల మధ్య కాన్‌ఫ్లిక్ట్‌కు తగిన స్ట్రాంగ్ & గ్రిప్పింగ్ స్టోరీ రాయడంలో కార్తీక్ సుబ్బరాజ్ ఫెయిల్ అయ్యాడు. సినిమా చూడాలనుకుంటే... ధ్రువ్ విక్రమ్ ఎంట్రీ మిస్ అవ్వొద్దు. తండ్రీ కొడుకుల కాంబినేషన్ సీన్స్ కూడా!
Published at : 10 Feb 2022 03:27 AM (IST) Tags: Simran Vikram ABPDesamReview Dhruv Vikram Karthik Subbaraj Mahaan Movie Review Mahaan Review Vikram's Mahaan Movie Review Mahaan Review in Telugu Simha Vikram Dhruv Vikram's Mahaan Movie Review మహాన్ రివ్యూ Amazon OTT Release Mahaan Review OTT Movie Mahaan Review

సంబంధిత కథనాలు

Emilia Clarke: ఔను, అది నిజమే! ‘GoT’ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ‘డ్రాగన్ క్వీన్’ ఎమీలియా క్లార్క్!

Emilia Clarke: ఔను, అది నిజమే! ‘GoT’ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ‘డ్రాగన్ క్వీన్’ ఎమీలియా క్లార్క్!

Puri Jagannadh : చీప్‌గా వాగొద్దు - బండ్ల గణేష్‌కు పూరి జగన్నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్

Puri Jagannadh : చీప్‌గా వాగొద్దు - బండ్ల గణేష్‌కు పూరి జగన్నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్

Madhavan Gets Trolled: సైన్స్ గురించి తెలియకపోతే నోరు మూసుకో - మాధవన్ మీద మండిపడుతున్న నెటిజన్లు

Madhavan Gets Trolled: సైన్స్ గురించి తెలియకపోతే నోరు మూసుకో - మాధవన్ మీద మండిపడుతున్న నెటిజన్లు

Kaduva Telugu Movie Teaser: వేట కోసం కాచుకున్న చిరుతలా ఒరిజినల్ 'డానియల్ శేఖర్' - 'కడువా'తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్న పృథ్వీరాజ్ 

Kaduva Telugu Movie Teaser: వేట కోసం కాచుకున్న చిరుతలా ఒరిజినల్ 'డానియల్ శేఖర్' - 'కడువా'తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్న పృథ్వీరాజ్ 

Ranga Ranga Vaibhavanga Teaser: బటర్ ఫ్లై కిస్ చూశారు, టీజర్ చూస్తారా? - వైష్ణవ్ తేజ్, కేతిక జోడీ రెడీ 

Ranga Ranga Vaibhavanga Teaser: బటర్ ఫ్లై కిస్ చూశారు, టీజర్ చూస్తారా? - వైష్ణవ్ తేజ్, కేతిక జోడీ రెడీ 

టాప్ స్టోరీస్

Atmakur Bypoll Results 2022: ఆత్మకూరులో నేడే కౌంటింగ్, మరికొన్ని గంటల్లో ఫలితం - భారీ మెజార్టీపై విక్రమ్ రెడ్డి దీమా !

Atmakur Bypoll Results 2022: ఆత్మకూరులో నేడే కౌంటింగ్, మరికొన్ని గంటల్లో ఫలితం - భారీ మెజార్టీపై విక్రమ్ రెడ్డి దీమా !

DA Hike In July: జులైలో పెరగనున్న జీతాలు! సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం!!

DA Hike In July: జులైలో పెరగనున్న జీతాలు! సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం!!

Amaravati Lands: అమరావతి భూములు కొంటారా ? ఎకరం పది కోట్లే  !

Amaravati Lands: అమరావతి భూములు కొంటారా ? ఎకరం పది కోట్లే  !

Weather Updates: నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడతాయని హెచ్చరిక - తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ

Weather Updates: నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడతాయని హెచ్చరిక - తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ