Plastic Munching Superworms: ప్లాస్టిక్ కాలుష్య నిర్మూలనలో కీలక ముందడుగు.. అత్యంత వేగంగా ప్లాస్టిక్‌ను విచ్ఛిన్నం చేసే పురుగుల గుర్తింపు!
భూమ్మీద కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్న ప్లాస్టిక్ భూతాన్ని పారదోలే సమయం ఆసన్నం అయ్యింది. ప్లాస్టిక్ వ్యర్థాలను అత్యంత వేగంగా విచ్ఛినం చేసే పురుగులను పరిశోధకులు గుర్తించారు.
భూమ్మీద పెరిగిపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు మానవ మనుగడకే తీవ్ర ముప్పు తీసుకురాబోతుంది. ఈ నేపథ్యంలోనే ప్లాస్టిక్ నిర్మూలన కోసం ప్రపంచ వ్యాప్తంగా పలు స్వచ్ఛంద సంస్థలు ఉద్యమాలు చేశాయి. ఫలితంగా ఆయా దేశాలు ప్లాస్టిక్ రీసైక్లింగ్ దిశగా అడుగులు వేశాయి. నెమ్మదిగా ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఇదే సమయంలో ప్లాస్టిక్ ను పర్యావరణ హితంగా మార్చే దిశగా పరిశోధనలు ఊపందుకున్నాయి. తాజాగా అత్యంత వేగంగా ప్లాస్టిక్‌ను విచ్ఛిన్నం చేసే పురుగులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఒకప్పుడు అటవీ నిర్మూలనకు పరిష్కారంగా ప్లాస్టిక్ సంచులను, ప్లాస్టిక్ కంటైనర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. రాను రాను ప్లాస్టిక్ వినియోగం పెరగడం మూలంగా.. ప్రతి సంవత్సరం మూడు వందల మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఏర్పడుతున్నాయి. ఈ చెత్త భారీ పర్యావరణ పరిణామాలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేయడంతో పాటు తగ్గించే ప్రయత్నాలు అమెరికాలో సర్వసాధారణం అయ్యాయి. ఈ ప్రక్రియలో సమయం కాస్త ఎక్కువ పడుతుంది.తాజాగా జరిగిన పలు పరిశోధనల్లో అత్యంతగా వేగంగా ప్లాస్టిక్ వ్యర్థాలను విచ్ఛిన్నం చేసే మైనపు పురుగులను గుర్తించారు. తాజాగా ఈ విషయాన్ని ప్రకృతి రచయిత రిచర్డ్ స్మిత్ తన పుస్తకం ‘ఎ స్వీట్, వైల్డ్ నోట్’లో వెల్లడించారు. “మైనపు పురుగులు ప్లాస్టిక్ ను అద్భుతంగా విచ్ఛిన్నం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. వీటితో కొత్త ఆవిష్కరణ జరగబోతుంది” అని తెలిపారు.
ప్రస్తుతం, ఈ పురుగులు పల్లపు ప్రదేశాలలో, సహజ ప్రదేశాలలో పెరుగుతున్న ప్లాస్టిక్ పదార్థాల లభ్యతకు అనుగుణంగా పరిణామాత్మక మార్పును పొందాయా? లేదా? అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ ప్రక్రియలో వాటి లాలాజలం కీలకమైనదిగా పరిశోధకులు గుర్తించారు. ఒక శాస్త్రవేత్త తన తేనెటీగల నుండి మైనపు పురుగులను శుభ్రపరిచే సమయంలో ఈ విషయాన్ని గుర్తించారు. తేనెటీగలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తున్న మైనపు పురుగులను ప్లాస్టిక్ సంచిలో ఉంచారు. కొద్ది సేపట్లోనే ఆ పురుగులు ప్లాస్టిక్ పదార్థాన్ని తినడాన్ని గమనించారు. మైనపు పురుగు లాలాజలంలోని ఎంజైమ్‌లు అత్యంత సాధారణమైన ప్లాస్టిక్ రకం పాలిథిలిన్ గొలుసును విచ్చిన్నం చేస్తాయని తెలుసుకున్నారు. ఇది గది ఉష్ణోగ్రత వద్ద, నీటి అడుగున, తటస్థ PH స్థాయిలను మెయింటెయిన్ చేసినప్పుడు ఈ ప్రక్రియ మరింత వేగంగా కొనసాగుతున్నట్లు గుర్తించారు.
మైనపు పురుగులతో పాటు కొన్ని ఇతర తెలిసిన ప్లాస్టిక్ తినే జీవుల సహాయంతో అత్యంత ముప్పుగా మారిన ప్లాస్టిక్ కాలుష్యాన్ని పరిష్కరించగలవని పరిశోధకులు భావిస్తున్నారు. 2016లో ప్లాస్టిక్‌ను తినే బ్యాక్టీరియా కనుగొనబడింది. ఆ తర్వాత సంవత్సరం ప్లాస్టిక్‌ను కూడా విచ్ఛిన్నం చేసే ఫంగస్ కనుగొనబడింది. శాస్త్రవేత్తలు సంవత్సరాలుగా ప్లాస్టిక్ కాలుష్య పరిష్కారాలను వెతుకుతున్నప్పటికీ, ప్రస్తుతం ఆ దిశగా కీలక ముందుడుగు పడింది. మైనపు పురుగు వంటి చిన్నది జీవి ఇందుకు సహాయకారిగా నిలవడం పట్ల పరిశోధకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ప్లాస్టిక్ కాలుష్య కాసారాన్ని తగ్గించేందుకు ఈ జీవుకలిసి ముందుకుసాగబోతున్నారు.