అన్వేషించండి

Natural Anti Aging Remedies : చర్మం డల్​గా మారి.. జుట్టు ఊడిపోతుందా? శరీరంలో అది తక్కువైతేనే ఈ వృద్ధాప్యఛాయలు వస్తాయట

Folic Acid Benefits for Skin and Hair : శరీరంలో ఏది తక్కువైనా దానికి సంబంధించిన లక్షణాలు మనకి తెలిసిపోతాయి. అలాంటి వాటిలో ఫోలిక్ యాసిడ్ కూడా ఒకటి. ఈ లక్షణాలు అది తక్కువగా ఉందని తెలిపే సంకేతాలే. 

Anti Aging Tips : జుట్టు, స్కిన్ హెల్తీగా ఉంటే ఎవరైనా అందంగా ఉంటారు. అయితే శరీరంలో ఫోలిక్ యాసిడ్(Folic acid benefits) తక్కువైనప్పుడు మాత్రం జుట్టు రాలిపోతూ.. స్కిన్​ డల్​గా మారిపోతుంది. ఈ లక్షణాలు మీరు గుర్తిస్తే వెంటనే మీ శరీరంలో ఫోలిక్ యాసిడ్ ఎంతుందో టెస్ట్ చేయించుకోవాలి. అసలు ఫోలిక్ యాసిడ్ అంటే ఏమిటి? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? దీనినీ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా వంటి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వృద్ధాప్య ఛాయలు దూరం చేస్తుంది..

ఫోలిక్ యాసిడ్(విటమిన్ బి9) శరీరంలో శక్తిని ఉత్పత్తి చేయడంతో పాటు.. సెల్యూలార్ మెటబాలీజంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది ఆహారంలో దొరికితే ఫోలేట్ అని.. సప్లిమెంట్స్​గా తీసుకుంటే ఫోలిక్​ యాసిడ్​ అని అంటారు. ఇది జుట్టు, గోళ్లు, స్కిన్​ను ఎక్కువ కాలం హెల్తీగా ఉంచుతుంది. దీనివల్ల వృద్ధాప్య ఛాయలు లేట్​గా వస్తాయి. అందుకే ఇది శరీరానికి చాలా అవసరమని నిపుణులు చెప్తున్నారు. 

కొల్లాజెన్​ను పెంచుతుంది..

ఫోలిక్ యాసిడ్ చర్మాన్ని హైడ్రేటెడ్​గా ఉంచుతుంది. తేమను నిల్వ ఉంచి.. రంగుని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా పొడిబారడాన్ని తగ్గిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి.. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. అంతేకాకుండా మొటిమలను తగ్గిస్తుంది. శరీరాన్ని, చర్మాన్ని డిటాక్స్ చేసి.. మెరుగైన గ్లోని అందిస్తుంది. ఎండలో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు స్కిన్​ని రక్షిస్తుంది. 

ఫ్రీరాడికల్స్​ నుంచి రక్షిస్తుంది..

ఫోలిక్ యాసిడ్ అనేది యాంటీ ఆక్సిడెంట్​గా పనిచేస్తుంది. వివిధ ఆరోగ్య సమస్యలు రాకుండా హెల్తీగా ఉంచుతుంది. అంతేకాకుండా చర్మంలోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఫ్రీ రాడికల్స్​ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. శరీరంలో కొత్త, హెల్తీ కణాల అభివృద్ధిని మెరుగుపరుస్తుంది. ఇది మీరు యంగ్​గా ఉండడంలో సహాయం చేస్తుంది.

జుట్టును హెల్తీగా చేస్తుంది..

జుట్టు రాలడాన్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. ఫోలిక్ యాసిడ్ కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది. వైట్ హెయిర్​ను దూరం చేస్తుంది. మీకు ఫోలేట్ లోపం ఉంటే.. జుట్టు రాలిపోతూ ఉంటుంది. అయితే ఇప్పటికే జుట్టు ఎక్కువగా రాలిపోతే ఫోలిక్ యాసిడ్​ని తీసుకున్నా పెద్ద ఉపయోగముండదంటున్నారు నిపుణులు. జింక్, మెగ్నీషియం లోపం కూడా జుట్టు రాలడానికి కారణమవుతాయి. బయోటిన్, జింక్, అమైనో యాసిడ్స్ వంటి సప్లిమెంట్స్ జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తాయి. 

ఎవరు తీసుకోవచ్చు.. 

మహిళల్లో ఈ లక్షణాలు ఉంటే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్​ తీసుకోవాలా? ఏ మోతాదులో తీసుకోవాలి? వంటి సందేహాలున్నాయా? అయితే సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెప్పినట్లుగా 20 నుంచి 30 ఏళ్లలోపు మహిళలు రోజు 400 మైక్రో గ్రాముల ఫోలిక్ యాసిడ్ తీసుకోవచ్చని చెప్తున్నారు. ప్రెగ్నెన్సీతో ఉన్నవారికి ఈ డోస్​లో మార్పులుంటాయి. అయితే వీటిని నేరుగా తీసుకోకుండా వైద్యుల సలహాతో తీసుకుంటే మెరుగైన ఫలితాలుంటాయి. 

సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?

ఫోలిక్ యాసిడ్ మంచి ప్రయోజనాలు అందించడంతో పాటు కొన్ని దుష్ప్రభావాలు కలిగి ఉన్నాయి. దీనిని అతిగా తీసుకోవడం మంచిది కాదు. చర్మాన్ని పొడి బారేలా చేసి.. మొటిమలు ఎక్కువ అవ్వడానికి కారణమవుతుంది. ఆకు కూరలు, సిట్రస్ ఫ్రూట్స్, నట్స్, మంసాహారాలలో ఎక్కువగా ఉంటుంది. గుడ్లు, సోయాబీన్స్ బఠానీలు కూడా మంచి ఆప్షన్సే. 

Also Read : శ్రావణమాసం స్పెషల్ ఆవ పులిహోర.. నోరూరించే సింపుల్ రెసిపీ ఇదే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
Royal Enfield Goan Classic 350: మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
Best Winter Train Rides in India : వింటర్​ ట్రిప్​కి ఇండియాలో ఇవే బెస్ట్​.. ట్రైన్ జర్నీ చేస్తే మంచి ఎక్స్​పీరియన్స్ మీ సొంతం
వింటర్​ ట్రిప్​కి ఇండియాలో ఇవే బెస్ట్​.. ట్రైన్ జర్నీ చేస్తే మంచి ఎక్స్​పీరియన్స్ మీ సొంతం
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Embed widget