Aava Pulihora Recipe : శ్రావణమాసం స్పెషల్ ఆవ పులిహోర.. నోరూరించే సింపుల్ రెసిపీ ఇదే
Sravana Masam Specials : నోరూరించే ఆవ పులిహోరను ఇంట్లోనే చాలా సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చు. ఈ టేస్టీ రెసిపీ కచ్చితంగా మీకు టెంపుల్ వైబ్స్ ఇస్తుంది. మరి దీనిని ఎలా చేయాలంటే..
Tasty Aava Pulihora Recipe : శ్రావణమాసంలో పూజలు ఎక్కువగా చేసుకుంటారు. పూజలు ఉంటే కచ్చితంగా ప్రసాదాలు ఉండాల్సిందే. ప్రసాదం అంటే పులిహోర లేకుండా ఎలా? గుడికి వెళ్లినా.. ఇంట్లో అయినా ప్రసాదంగా పులిహోర చేసుకుంటే ఓ తృప్తి ఉంటుంది. దీనిని తినేందుకు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే టెంపుల్ స్టైల్ ఆవ పిండి పులిహెరను ఎలా చేయాలో.. దానిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
బియ్యం - రెండు గ్లాసులు
ఆవాలు - మూడు స్పూన్లు
ఎండుమిర్చి - 10
ఉప్పు - అర చెంచా
నూనె - 6 స్పూన్లు
జీడిపప్పు - 10
ఉప్పు - రుచికి తగినంత
పసుపు - స్పూన్
వేరుశనగపప్పు - 2 స్పూన్లు
కరివేపాకు - రెండు రెబ్బలు
చింతపండు రసం - 1 కప్పు
పచ్చిశనగపప్పు - 1 స్పూన్
మినపప్పు - 1 స్పూన్
మెంతులు - అర చెంచా
ఆవాలు - అర చెంచా
ఇంగువ - చిటికెడు
పచ్చిమిర్చి - 5
ఎండు మిర్చి - 5
తయారీ విధానం
ముందుగా బియ్యాన్ని బాగా కడిగి.. స్టౌవ్ వెలిగించి అన్నం వండుకోవాలి. చింతపండును కడిగి నానబెట్టుకుని రసం తీసి పక్కన పెట్టుకోవాలి. అన్నం ఉడికే లోపు ఆవపిండి సిద్ధం చేసుకోవాలి. దీనికోసం ఆవాలు, ఎండుమిర్చి, ఉప్పును మిక్సీజార్‌లోకి తీసుకోవాలి. దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆవపిండితోనే మనం పులిహోర చేసుకుంటాము. ఇప్పుడు అన్నం సిద్ధమైపోతే దానిని ఓ కంచంలోకి తీసుకుని చల్లాబెట్టుకోవాలి.
చల్లారిన అన్నంలో ఓ చెంచా పసుపు, రుచికి తగినంత ఉప్పు, పచ్చి కరివేపాకు వేయాలి. ముందుగా సిద్ధం చేసుకున్న ఆవపిండిని కూడా వేసుకోవాలి. అనంతరం దానిలో ఓ రెండు చెంచాల నూనె వేసి అన్ని రైస్‌కి బాగా అంటుకునేలా కలపాలి. ఇలా కలిపిన అన్నాన్ని పక్కన పెట్టి.. ఇప్పుడు పులిహోర తాళింపు సిద్ధం చేసుకోవాలి. స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టి నాలుగు స్పూన్ల నూనె వేయాలి. దానిలో పల్లీలు, జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటిని వేరే ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోవాలి.
ఇప్పుడు అదే కడాయిలో ఇంగువ, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అనంతరం పొడుగ్గా కోసిన పచ్చిమిర్చి, ఎండుమిర్చిని వేసి ఫ్రై చేయాలి. మెంతులు కూడా వేసుకుంటే రుచి అదిరిపోతుంది. అనంతరం చిటికెడు పసుపు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తాళింపులో ముందుగా నానబెట్టి తీసుకున్న చింతపండు రసం వేసి బాగా ఉడికించుకోవాలి. చింతపండు రసం చిక్కగా మారేవరకు ఉడికించాలి.
ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న ఆవరైస్లో చింతపండు తాళింపు వేసి బాగా కలుపుకోవాలి. చివర్లో పల్లీలు, జీడిపప్పు కూడా వేసుకుని మళ్లీ ఓ సారి మొత్తం కలిపితే టేస్టీ టేస్టీ ఆవ పులిహోర రెడీ. ఈ టేస్టీ పులిహోర మీకు కచ్చితంగా టెంపుల్ వైబ్స్ ఇస్తుంది. పైగా శ్రావణమాసంలో పూజలు రెగ్యూలర్‌గా చేసుకునేవారికి ఈ రెసిపీ ఎంతగానో హెల్ప్ అవుతుంది. కేవలం పూజలకే కాకుండా పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ దీనిని ఇష్టంగా తింటారు.
Also Read : లెమన్ టీని రోజూ ఉదయాన్నే రెగ్యూలర్‌గా తీసుకుంటే కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఇవే