స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో ఓ స్పూన్ నూనె వేసి వేడిచేయండి. ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించండి. బఠాణీలు, క్యారెట్స్, క్యాప్సికమ్ వంటి వెజిటెబుల్స్ వేసి మగ్గనివ్వండి. అనంతరం టమాటాలు ముక్కలు వేసి బాగా ఉడకనివ్వండి. పసుపు, కారం, గరం మసాలా వేసి.. అన్ని బాగా కలిసేలా తిప్పండి. దానిలో నీరు వేసి బాగా కలిపి.. సూప్ మాదిరిగా నీటిని మరగనివ్వాలి. ఇప్పుడు ఓట్స్, రుచికి తగినంత సాల్ట్, పెప్పర్ వేసి మంచిగా ఉడకనివ్వాలి. స్టౌవ్ ఆపేసి కొత్తిమీరతో గార్నీష్ చేసుకుంటే మసాలా ఓట్స్ రెడీ. (Images Source : Unsplash)