డయాబెటిస్ ఈ మధ్య చాలా పెరిగిపోయింది. ఇందుకు కారణాలు తెలుసుకుందాం. ఆకలేస్తేనే తినాలి. అవసరానికి మించి ఒక్కముద్ద కూడా ఎక్కువ తినకూడదు. ఎక్కువ తినే వారికి షుగర్ రావచ్చు. స్థూలకాయం డయాబెటిస్ కి మొదటి కారణం. ఎట్టి పరిస్థితుల్లోనూ బరువు ఎక్కవ పెరగకూడదు. కొంత మంది బరువు తక్కువగానే ఉంటారు. సన్నగానే కనిపిస్తారు కానీ పొట్ట చుట్టు కొవ్వు పేరుకుని ఉంటుంది. ఇలా పొట్టచుట్టు పేరుకున్న కొవ్వు డయాబెటిస్ కి నేరుగా కారణం అవుతుందట. రోజూ కనీసం గంట పాటు ఏదో ఒక వ్యాయామం చెయ్యడం అవసరం. హార్మోన్ల అసమతుల్యత. ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథి పనితీరు ఆరోగ్యకంరగా లేకపోతే డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. షుగర్ రావడానికి మరో ముఖ్య కారణం బాల్యం నుంచి కూడా విటమిన్ D తక్కువగా ఉండడం కూడా కావచ్చు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న మానసిక ఒత్తిడి వల్ల కూడా డయాబెటిస్ రావచ్చు. పైన చెప్పిన ఏ కారణం మీలో ఉన్నా సరే ఏడాదికి ఒక సారి తప్పకుండా Hba1C అనే రక్త పరీక్ష చేయించుకోవాలి. ఈ పరీక్ష రిజల్ట్ 5.6 కంటే ఎక్కువగా ఉంటే తప్పకుండా డాక్టర్ సలహా తీసుకోవాలి. ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే