మహిళలై ఉండి వయసు 30 దాటితే ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టాలని అర్థం.

విటమిన్ D పరీక్ష తప్పక చేయించుకోవాలి.

థైరాయిడ్ కూడా ఈ మధ్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోంది. కనుక T3,T4, THS టెస్టులు తప్పక చేయించుకోవాలి.

గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ పాప్ స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి.

నిద్ర సమస్యలు ఉంటే డిప్రెషన్ టెస్ట్ చేయించుకోవడం అవసరం.

హీమోగ్లోబిన్ తగినంత ఉందో లేదో చూసుకోవాలి. సీబీపీ టెస్ట్ చేయించుకోవాలి.

ఏడాదికోసారి తప్పకుండా గైనకాలజిస్ట్ ను కలిసి గైనిక్ హెల్త్ పరీక్షించి చూసుకోవాలి.

శరీర బరువు మోతాదును తెలిపే బీఎంఐ టెస్ట్ తప్పక చేయించుకోవాలి.

బీపీ లెవెల్స్ కంట్రోల్​లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం చాలా అవసరం.

కుటుంబ చరిత్రలో డయాబెటిస్ ఉన్నా, ఎక్కువ బరువు ఉన్నా తప్పకుండా డయాబెటిస్ టెస్ట్ చేయించుకోవాలి.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసమే.