చాలామంది ఉదయం లేవగానే జిమ్‌కి వెళ్లడం లేదా యోగా వంటివి చేస్తుంటారు. వారిలో ఎక్కువమంది నడకకే ప్రాధాన్యత ఇస్తారు. వ్యాయామాల కంటే ప్రతి రోజూ నడిస్తే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఏ వయసు వారు ఎంత సేపు నడవాలో ఇక్కడ చూద్దాం .. నడక వల్ల మధుమేహం, అధిక రక్తపోటు కూడా తగ్గుతాయని వైద్యులు అంటున్నారు. 6 నుంచి 17 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు రోజుకు కనీసం 15 వేల అడుగులు నడవాలట. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు రోజుకు కనీసం 12 వేల అడుగులు నడవాలట. 50 ఏళ్లు దాటిన వారు రోజుకు కనీసం 12 వేల అడుగులైనా నడవాలట. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.