ప్రపంచవ్యాప్తంగా యోగా ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది. చాలా మంది యోగాను ఒక వర్కవుట్ ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారు.

కానీ యోగా కేవలం వర్కవుట్ కాదు. ఇది మన శరీరాన్ని సమన్వయపరిచే సాధన.

ఏదో ఒక వర్కవుట్ మాదిరిగా చేసే ప్రక్రియ కాదు. కనుక కొన్ని విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి.

చాలా మంది ఉదయమే లేచి యోగా చేస్తుంటారు. తర్వాత స్నానం చేస్తారు.

కానీ అన్ని వర్కవుట్ల తరహాలో ఇలా చేస్తే యోగాతో వచ్చే ప్రయోజనాలు పూర్తిగా పొందలేరని నిపుణులు అంటున్నారు.

మనసు మరెక్కడో పెట్టి.. నిద్ర మగత వదలకపోతే లాభం ఉండదు.

యోగా చేస్తున్నంత సేపు ప్రతి కదలిక పూర్తి ఏకాగ్రతతో సాగాలి.

అందుకే స్నానం చేసి యోగసాధన మొదలు పెడితే శరీరం తాజాగా ఉండటమే కాదు, నిద్ర మగత కూడా పూర్తిగా వదులుతుంది.

అంతేకాదు యోగా కేవలం ఒక ఎక్సర్సైజ్ గా భావించకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది మిమ్మల్ని మీతో అనుసంధాన పరిచే ఆధ్యాత్మిక సాధనగా గుర్తించ గలిగితే మరింత మంచి ఫలితాలను పొందవచ్చు.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే