పిల్లలను ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్లేప్పుడు పేరెంట్స్ కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. ఈ రోజుల్లో చాలా మంది బిజీ బిజీగా గడిపేస్తున్నారు. చాలా సమయాల్లో తల్లిదండ్రులు వారి పిల్లలను ఒంటరిగా వదిలి వెళ్లిపోతున్నారు. అలాంటి సమయంలో పేరెంట్స్ కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. పిల్లలు ఒక్కరే ఉన్నప్పుడు, ఎవరైనా తెలియని వ్యక్తులు వస్తే తలుపులు తెరవకూడదని చెప్పాలి. మీ ఫోన్ నెంబర్లను పిల్లలు గుర్తుంచుకునేలా చేయండి. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రిజ్‌లో ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచండి. మీ పిల్లల ఒంటరితనాన్ని పోగొట్టడానికి.. వాళ్లకు ఇష్టమైనవన్ని ఇంట్లో ఏర్పాటు చేయండి. ఇలా చేయడం వలన వారి ఆలోచనా సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.