మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. ప్రకృతి నుంచి దొరికే కూరగాయలను తీసుకోవాల్సి ఉంటుంది. వివిధ కారణాల దృష్ట్యా చాలా మంది జంక్ ఫుడ్ ని ఎక్కువగా తీసుకుంటారు. దానివల్ల అధిక బరువు, చెడు కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో బాధ పడుతున్నారు. అయితే కొన్ని కూరగాయలు తీసుకోవడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చట. క్యారెట్ లో బీటా కెరోటిన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చు. టమాటోలో లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది బరువును తగ్గిస్తుంది. పాలకూరలో ఐరన్, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చు. కొత్తిమీరను జీర్ణక్రియ మెరుగుపరచడంతో పాటు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.