Lemon Tea Benefits : లెమన్ టీని రోజూ ఉదయాన్నే రెగ్యూలర్‌గా తీసుకుంటే కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఇవే
Health Benefits of Lemon Tea : రోజూ లెమన్ టీ తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి అంటున్నారు నిపుణులు. దీర్ఘకాలిక సమస్యలు కూడా దూరమవుతాయని చెప్తున్నారు.
Morning Lemon Tea Routine : దాదాపు అందరి ఇళ్లల్లో నిమ్మకాయలు రెగ్యూలర్‌గా ఉంటాయి. వీటివల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో దీనిని రెగ్యూలర్‌గా వినియోగిస్తే ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు మీ సొంతమవుతాయి. రోజూ నిమ్మకాయను లెమన్ టీగా తీసుకుంటే చాలా మంచిది. ఇది టీ వినియోగాన్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది.
నిమ్మకాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా కాల్షియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు వీటిలో ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ప్రయోజనాలు అందిస్తాయి. అందుకే దీనిని రెగ్యూలర్‌గా తీసుకుంటే మంచిది అంటున్నారు. పైగా దీనిలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది బరువు తగ్గేవారికి కూడా మంచి ఆప్షనే. ఇంతకీ లెమన్ టీ తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటంటే?
డిటాక్స్
శరీరాన్ని డిటాక్స్ చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెప్తున్నారు. నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ లక్షణాలు శరీరాన్ని డిటాక్స్ చేస్తాయి. కాలేయాన్ని శుద్ధి చేయడంలో హెల్ప్ చేస్తాయి. కాబట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో లెమన్ టీ తీసుకుంటే కాలేయంలో పేరుగుపోయిన వ్యర్థాలు, టాక్సిన్లు బయటకు పోతాయి. అంతేకాకుండా నిమ్మకాయల్లో సిట్రస్ ఫ్లేవనాయిడ్స్ రోజువారీ టాక్సిన్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని అందిస్తాయి.
జీర్ణ సమస్యలకై..
వర్షాకాలంలో జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ సమయంలో లెమన్ టీ తీసుకోవాలి అంటున్నారు. ఎందుకంటే ఇది జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. నిమ్మకాయలోని డైటరీ ఫైబర్ గట్ సమస్యలను తగ్గిస్తాయి. ఆకలిని కంట్రోల్ చేస్తాయి. బరువు తగ్గడానికి కూడా ఇది మంచి హెల్ప్ అవుతుంది. మెరుగైన మెటబాలీజం అందించి.. కేలరీలను వేగంగా బర్న్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది.
హైడ్రేషన్ కోసం..
ప్రతి వ్యక్తి రోజూ రెండు లీటర్ల నీరు తాగాలి. దీనివల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. దీనిని మీరు ఫాలో అవ్వలేకపోతున్నారా? అయితే మీరు రెగ్యూలర్‌గా లెమన్ టీ తీసుకుంటే.. ఇది మీకు మంచి హైడ్రేషన్‌ను అందిస్తుంది. హైడ్రేటెడ్‌గా ఉంటే ఆరోగ్యానికి, స్కిన్‌కి ఎన్ని ప్రయోజనాలుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇమ్యూనిటీకై..
ఆరోగ్యంగా ఉండాలంటే.. రోగనిరోధక వ్యవస్థ చాలా ఇంపార్టెంట్. లెమన్‌టీ ఇమ్యూనిటీని పెంచుతుంది. దీనిలో విటమిన్ సి చాలా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది. అంటు వ్యాధులను, ఇతర ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లతో నిండిన లెమన్ టీ.. మీకు పలు ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే డీసీస్ నుంచి ఉపశమనం అందిస్తుంది.
స్కిన్ బెనిఫిట్స్
లెమన్ టీ రెగ్యూలర్‌గా తీసుకుంటే దీనిలో ఆస్ట్రింజెంట్ లక్షణాలు మృత చర్మకణాలను తొలగిస్తాయి. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మొటిమలు, తామరను దూరం చేస్తుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు క్రమం తప్పకుండా శరీరానికి అంది.. చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ముఖం మెరుస్తుంది. ఆరోగ్యంగా కనిపిస్తుంది. కొల్లాజెన్‌ను పెంచి వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది.
దీర్ఘకాలిక వ్యాధులకై..
ఇవేకాకుండా యూరిన్ ఇన్ఫెక్షన్లు రాకుండా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా లెమన్ టీ స్ట్రెస్‌ని తగ్గిస్తుంది. తలనొప్పిని దూరం చేసి.. రిలాక్స్‌గా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. నిరాశ, ఆందోళనను దూరం చేస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. దాని వాసన కూడా పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది. రిఫ్రెష్‌గా ఉండేలా చేస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్తున్నారు నిపుణులు. రక్తంలో షుగర్‌ని కంట్రోల్ చేస్తుంది. అలాగే క్యాన్సర్ కారకాలను దూరం చేస్తుందని చెప్తున్నారు.
Also Read : కాఫీ అంటే ఇష్టమా? అయితే ఈ ఒక్క మార్పు చేసి కాఫీ తాగితే షుగర్ కంట్రోల్ అవుతుంది, బరువు తగ్గుతారు