GGH Recruitment: ఏలూరు జీజీహెచ్‌లో 108 పారామెడికల్ పోస్టులు, వివరాలు ఇలా
ఏలూరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాలలో ఒప్పంద/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఏలూరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాలలో ఒప్పంద/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 108 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి పదోతరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 11 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 108
* పారామెడికల్ పోస్టులు
➥ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏలూరు (GMC, Eluru) పరిధిలో: 17
విభాగాలవారీగా ఖాళీలు: స్టోర్ కీపర్-02, ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్(పీఈటీ)-01, కంప్యూటర్ ప్రోగ్రామర్-01, ఎలక్ట్రికల్ హెల్పర్-01, ఆఫీస్ సబార్డినేట్-09, మార్చురీ అటెండెంట్-02.
➥ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఏలూరు (GGH, Eluru) పరిధిలో: 81(17 కేటగిరీలలో)
విభాగాలవారీగా ఖాళీలు: రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్-01, కార్డియాలజీ టెక్నీషియన్-03, ఛైల్డ్ సైకాలజిస్ట్-01, కంప్యూటర్ ప్రోగ్రామర్-01, ఎలక్ట్రికల్ హెల్పర్-02, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్-26, జనరల్ డ్యూటీ అటెండెంట్-18, ల్యాబ్ అటెండెంట్-18, ల్యాబ్ టెక్నీషియన్-04, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్-01, ఆఫీస్ సబార్డినేట్-14, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్-01, సైకియాట్రిక్ సోషల్ వర్కర్-02, స్పీచ్ థెరపిస్ట్-01, స్టోర్ అటెండెంట్-01, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్-01, క్లినికల్ సైకాలజిస్ట్-01.
➥ ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ఏలూరు (GCON, Eluru) పరిధిలో: 10(05 కేటగిరీలలో)
విభాగాలవారీగా ఖాళీలు: జూనియర్ అసిస్టెంట్/ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్(ఉమెన్)-02, వార్డెన్ (ఉమెన్)-02, ఆఫీస్ సబార్డినేట్(ఉమెన్)-02, స్వీపర్(ఉమెన్)-03, ల్యాబ్ అటెండెంట్(ఉమెన్)-01.
ఆఫీస్ సబార్డినేట్స్, ఈఎంటీ, కంప్యూటర్ ప్రోగ్రామర్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ఫార్మసిస్ట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్త
అర్హత: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
చిరునామా: Office of the Principal, Government Medical College,
Government General Hospital Office, Eluru.
ముఖ్యమైన తేదీలు..
➥ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.11.2023
➥ దరఖాస్తుకు చివరి తేదీ: 11.12.2023.
Also Read:
26,146 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల - అర్హతలు, పూర్తి వివరాలివే
SSC Constable GD Notification: కేంద్ర భద్రత బలగాల్లో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ (Constable GD), రైఫిల్ మ్యాన్ జనరల్ డ్యూటీ (Rifle Man GD) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నవంబరు 24న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 26,146 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఇందులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF)లో 6174 పోస్టులు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)లో 11025 పోస్టులు, సెంట్రల్ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్(CRPF)లో 3,337 పోస్టులు, సశస్త్ర సీమాబల్(SSB)లో 635 పోస్టులు, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సెస్(ITBP)లో 3,189 పోస్టులు, అస్సాం రైఫిల్స్(AR)లో 1,490 పోస్టులు, స్పెషల్ సెక్యూరిటీ ఫోర్సెస్(SSF)లో 296 పోస్టులు ఉన్నాయి. మొత్తం ఖాళీల్లో పురుషులకు 23347 పోస్టులు, మహిళలకు 2799 పోస్టులు కేటాయించారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..