Sudigali Sudheer: 'సుడిగాలి' సుధీర్ సినిమా ఎక్కడ - 'యానిమల్' దెబ్బకు షోస్, స్క్రీన్స్ గల్లంతు
Sudigali Sudheer movie gets no major screens in Hyderabad: 'సుడిగాలి' సుధీర్ సినిమాకు హైదరాబాద్ సిటీలో మేజర్ స్క్రీన్స్ లేవు. మార్నింగ్ షోస్ అసలే లేవు.
Calling Sahasra release date review: చిన్న సినిమాకు విడుదల తేదీ ఎంత ముఖ్యం అనేది ఛోటా మోటా దర్శక నిర్మాతలు తెలుసుకోవడానికి 'కాలింగ్ సహస్ర' విడుదల ఓ ఉదాహరణ. డిసెంబర్ 1... అనగా ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తుందీ సినిమా. అదే రోజు 'యానిమల్' విడుదల కూడా! ఆ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఉంది. దానికి పోటీ ఎందుకు? అని 'కాలింగ్ సహస్ర' దర్శకుడు అరుణ్ విక్కిరాలను మీడియా ప్రశ్నిస్తే... ''మేం 'యానిమల్'కి పోటీగా రావడం లేదు. 'యానిమల్'తో పాటు వస్తున్నాం'' అని సమాధానం ఇచ్చారు.
ప్రేక్షకుల్లో క్రేజ్ ఉన్న పెద్ద సినిమాతో రావడం వల్ల చిన్న సినిమాకు ఎంత నష్టం జరుగుతుందో ఆయన ముందుగా అంచనా వేయలేకపోయారు. పాపం... పెద్ద సినిమాతో విడుదల చేయాలనే నిర్ణయం 'కాలింగ్ సహస్ర' కొంప ముంచింది. ఈ సినిమా వైపు చూసే ప్రేక్షకులు కరువు అయ్యారు.
హైదరాబాద్ సిటీలో మార్నింగ్ షోస్ ఎక్కడ?
No morning shows for Sudigali Sudheer's Calling Sahasra Movie: బుల్లితెరపై నటుడిగా పేరు తెచ్చుకున్న 'సుడిగాలి' సుధీర్... ఆల్రెడీ వెండితెరపై స్టార్ హీరోల సినిమాల్లో కొన్ని క్యారెక్టర్లు చేశారు. హీరోగా కూడా రెండు మూడు సినిమాలు చేశారు. 'గాలోడు' చిత్రానికి విమర్శకుల నుంచి మంచి రివ్యూలు రాలేదు. కానీ, ఆ సినిమాకు హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ స్క్రీన్లలో ఉదయం 8 గంటలకు షో పడింది. కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 10, 11 గంటలకు షోస్ పడ్డాయి.
'యానిమల్'తో పాటు విడుదల అవుతుండటం వల్ల హైదరాబాద్ సిటీలో ఉదయం 'కాలింగ్ సహస్ర' సినిమాకు స్క్రీన్లు దొరకలేదు. 'యానిమల్' ఫీవర్ ముందు... ఆ సినిమా దెబ్బకు 'కాలింగ్ సహస్ర' గల్లంతు అయ్యింది. మూసాపేట్ లక్ష్మీ కళ థియేటర్లలో ఉదయం 11.15 గంటలకు షో వేస్తున్నారు. అది మొదటి షో అని చెప్పాలి. అంతకంటే ముందు అంటే... మూవీ మ్యాక్స్: ఏఎంఆర్, ఈసీఐఎల్ సికింద్రాబాద్‌లో 10.15 గంటలకు, ఏషియన్ ఉప్పల్ లో 10 గంటలకు షోస్ పడుతున్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో గల సంధ్య 35 ఎంఎంలో సినిమా విడుదల అవుతుండటం 'సుడిగాలి' సుధీర్ అభిమానులకు కాస్త ఊరట ఇచ్చే అంశం. అందులో మొదటి షో 11 గంటలకు!
బుకింగ్స్ లేవు... సినిమా చూసే జనాలు లేరు!
'కాలింగ్ సహస్ర' సినిమాకు మెజారిటీ మల్టీప్లెక్స్ థియేటర్లలో ఒక్కో షో మాత్రమే వేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఏమంత బాలేదు. 'యానిమల్'తో పాటు కాకుండా డిసెంబర్ 15వ తేదీన సినిమా విడుదల చేసి ఉంటే బావుండేదని ట్రేడ్ వర్గాలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply
డిసెంబర్ 7న నాని 'హాయ్ నాన్న', 8న నితిన్ 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమాలు విడుదల అవుతున్నాయి. ఆ తర్వాత వారం థియేటర్లలో పెద్ద సినిమా లేదు. 22న 'సలార్' విడుదల అవుతుండటంతో, దానికి ముందు వారం వచ్చే సాహసం ఎవరు చేయడం లేదు. ఒకవేళ ఆ తేదీకి వచ్చి ఉంటే... సుధీర్ సినిమాకు మార్నింగ్ షోస్ వేసుకునే అవకాశం లభించేది. జనాల్లోకి సినిమా వెళ్ళేది. బావుంటే వారం రోజులు బాగా ఆడేది. ఆ తర్వాత కూడా షోస్ ఉంటాయి. ఇప్పుడు 'యానిమల్' జోరు ముందు 'కాలింగ్ సహస్ర' కనబడటం లేదు. విడుదల తేదీ విషయంలో చేసిన తప్పు వల్ల భారీ మూల్యం చెల్లించుకోక తప్పడం లేదు.