అన్వేషించండి

Salaar: బెస్ట్ క్యాప్షన్ ఇవ్వండి, ఫ్రీగా 'సలార్' టికెట్స్ గెలుచుకోండి - ప్రభాస్ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్

Salaar Trailer: 'సలార్' ట్రైలర్ విడుదలకు ముందు రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్, ప్రేక్షకులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఫస్ట్ డే టికెట్స్ గెలుచుకునే ఛాన్స్ ఇస్తోంది.

Here is a chance to win Salaar first day ticktes and Salaar Merchandise: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు, ప్రేక్షకులకు ఓ సువర్ణ అవకాశం! ఆయన నటిస్తున్న తాజా సినిమా 'సలార్' సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఆశ పడుతున్నారా? ఆ షోకి 'సలార్' టీ షర్టులు, క్యాప్ (మర్చండైజ్) ధరించి వెళితే బాగుంటుందని ఆలోచిస్తున్నారా? అటువంటి వాళ్ళ కోసమే ఈ అవకాశం!

క్యాప్షన్ ఇవ్వండి... టికెట్స్ అందుకోండి!
'సలార్' చిత్రీకరణలో ప్రభాస్ (Prabhas)కు తన ఫోనులో దర్శకుడు ప్రశాంత్ నీల్  ఏదో చూపిస్తున్న ఫోటోను చిత్ర బృందం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోకి క్యాప్షన్ ఇవ్వమని అభిమానులను కోరింది. బెస్ట్ క్యాప్షన్ ఇచ్చిన టాప్ 5 నెటిజనులకు తమ తమ ఏరియాలో 'సలార్' ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ ఇస్తామని పేర్కొంది. అంతే కాదు... మర్చండైజ్ కూడా అందిస్తామని వివరించింది. మరి, ఇంకెందుకు ఆలస్యం? వెంటనే క్యాప్షన్ ఇవ్వండి మరి!

Salaar Trailer Release Date and Time: మరికొన్ని గంటల్లో 'సలార్' ట్రైలర్ రిలీజ్ కానుంది. శుక్రవారం... అనగా డిసెంబర్ 1న రాత్రి 7.11 గంటలకు యూట్యూబ్‌లో విడుదల చేయనున్నారు. ట్రైలర్ విడుదలకు ముందు ఈ ఆఫర్ ఇవ్వడమే కాదు... బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్టోరీ కూడా లీక్ చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్!

Also Read: నేను మౌనవ్రతం అంటూ స్వయంగా చెప్పిన చిరంజీవి - మీమర్స్‌కు ఫుల్ మీల్స్

ఇద్దరు స్నేహితులు బద్ధ శత్రువులు అయితే?
Salaar story leaked by Prashanth Neel: 'సలార్' ఇద్దరు స్నేహితుల కథ అని ప్రశాంత్ నీల్ చెప్పారు. పరిస్థితుల కారణంగా ఆ స్నేహితులు ఇద్దరూ శత్రువులు అయితే ఏం జరిగింది? అనేది సినిమాలో చూడాలని చెప్పారు. కథలో ఎమోషన్స్ చాలా ఉన్నాయని, ఆరు గంటల సినిమా వస్తోందని, అందుకని రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేసినట్లు ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు. దాంతో పాటు ఆయన పెద్ద ట్విస్ట్ కూడా ఇచ్చారు. 

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

'సలార్'లో వరదరాజ మన్నార్ పాత్రలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, రాజమన్నార్ పాత్రలో జగపతి బాబు నటిస్తున్నారు. సన్నిహిత మిత్రుల నుంచి శత్రువులుగా మారిన వ్యక్తులుగా ప్రభాస్, పృథ్వీరాజ్ కనిపించవచ్చు.

'కెజియఫ్'... 'సలార్'.... రెండు ప్రపంచాలు వేరు!
'కెజియఫ్' ఫ్రాంచైజీలో 'సలార్' కూడా ఉంటుందని సినిమా మొదలైనప్పటి నుంచి చిత్ర పరిశ్రమతో పాటు ప్రేక్షకులు అందరూ భావిస్తున్నారు. 'కెజియఫ్'లో ఈశ్వరి రావు కుమారుడి పేరు సలార్ కావడం, 'సలార్'లో ఆమె ఉండటంతో... ప్రశాంత్ నీల్ ఈ రెండు సినిమాలను ఎలా లింక్ చేస్తారని ఎవరికి వారు తమకు తోచిన విధంగా కథలు అల్లేశారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఏమో రెండు సినిమాలకు లింక్ లేదని స్పష్టం చేశారు. 

Also Read: 'యానిమల్' బడ్జెట్, తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ - 'దిల్' రాజుకు ప్రాఫిట్ తెచ్చే సినిమాయేనా?

'కెజియఫ్', 'సలార్' మధ్య సంబంధం లేదని బాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ పేర్కొన్నారు. రెండిటి మధ్య లింక్ లేదని ఆయన స్పష్టం చేశారు. 'సలార్', 'కెజియఫ్' ప్రపంచాలు వేర్వేరు అని ప్రశాంత్ నీల్ చెప్పారు. అయితే... 'కెజియఫ్'లో ఉన్నట్లు, 'సలార్'లో కూడా సాలిడ్ (స్ట్రాంగ్) యాక్షన్ సీన్లు ఉంటాయని వివరించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Chetan Maddineni: తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Chetan Maddineni: తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Parliament Sessions: 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు -  రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
25 నుంచి పార్లమెంట్ సమావేశాలు - రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Pawan Kalyan in Palnadu: సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
YS Sharmila: వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Embed widget